Salaar v/s Dunki Targeting 1000Cr at Box office: సాలార్ డంకి మొదటి రోజు కలెక్షన్లు ఎంత అంటే?
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఈ క్రిస్మస్ Christmas కి డంకి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ సినిమా షారుక్ కి చాలా ప్రత్యేకమైంది అని చెప్పొచ్చు,
ఈ సినిమా గనుక హిట్టయితే ఈ సంవత్సరంలో షారుక్ (Sharukh)హ్యాట్రిక్ అందుకున్నట్టు అవుతుంది. ఈ ఏడాది షారుక్ నటించిన పఠాన్ pataan, జవాన్ jawan సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ అయ్యాయి.
Read: సాలార్ 2 పై ప్రభాస్ అదిరిపోయే అప్డేట్.
కాబట్టి ఇప్పుడు రాబోయే సినిమా కూడా బంపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఇక ఇదే క్రిస్మస్ కి మరో సూపర్ స్టార్ వెండి తెర పైకి తన సినిమాను వదలబోతున్నాడు. అతడే పాన్ ఇండియా స్టార్ prabhas.
Baahubali తరవాత ప్రభాస్ కి ఆస్థాయి హిట్టు దక్కలేదని చెప్పాలి, ఆ మధ్య వచ్చిన రాధే శ్యామ్ ఒక మోస్తరుగా ఆడినా, Aadipurush మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. అందుకే ప్రభాస్ తన ఆశలన్నీ salaar part 1 మీదే పెట్టుకున్నారు.
Pan India range:
Salaar సీజ్ ఫైర్ ను ప్రశాంత్ Prashanth Neel నీల్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా అఖండమైన విజయాన్ని అందుకుంటుంది అని ఆశిస్తున్నారు డార్లింగ్ ఫాన్స్.
ఇక ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా pan India స్థాయి లో విడుదల అవుతున్నాయి. అంచనాలు తారాస్థాయి లో ఉండటం వల్ల ఈ సినిమా చూసేందుకు ఫాన్స్ ఆశక్తి చూపెడుతున్నారు.
కాబట్టి ఈ సినిమాల తాలూకు టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ Advance Booking కూడా జరిగిపోతోంది. మరి ఈ రెండింటిలో ఏ సినిమాకి ఎక్కువ టికెట్లు తెగాయి,
మొదటి రోజు కలెక్షన్లు ఏ సినిమా ఎక్కువ రాబట్టింది, సీనియర్ హీరో అయిన షారుక్ పై చేయి సాధించాడా, లేదంటే ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, కలెక్షన్లు రాబట్టామా లేదా అన్నది ముఖ్యం అంటాడాPrabhas అసలు ఏమైంది అని చూద్దాం.
Advance booking:
ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్ భారీగానే ఉంది. ముందుగా సీనియర్ హీరో కాబట్టి షారుక్ సంగతి చూద్దాం, Sharuk నటించిన Dunki తొలి రోజు కలెక్షన్ 7.36 కోట్లు రాబట్టింది.
ఇది కేవలం అడ్వాన్సు బుకింగ్ లో వచ్చింది మాత్రమే. Salaar Part 1 సీజ్ ఫైర్ అన్ని లాంగ్వేజస్ లో చూసుకుంటే 6 కోట్ల రూపాయలు రాబట్టింది. డిసెంబర్ 21 న డుంకి, 22వ తేదీన సాలార్ సినిమా లు ప్రేక్షకులను పలుకరించబోతున్నాయి.
First day Dunki shows:
ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి, డంకి కోసం భారతదేశ వ్యాప్తంగా 9,658 షోలు వేయనుండగా అందులో 2,51,146 టికెట్లు అడ్వాన్స్ గా బుక్ అయ్యాయి.
కేవలం హిందీలో మాత్రమే విడుదలవుతున్న ఈ సినిమాకి 7.36 కోట్లు రాబడుతున్నట్టు తెలుస్తోంది. సాలార్ కి సంబంధించి చుస్తే 5.99 కోట్లు రాబట్టింది ఈ పాన్ ఇండియా స్టార్ సినిమా.
ఇండియా వైడ్ గా ప్రభాస్ సినిమాకి అమ్ముడుపోయిన టికెట్ల సంఖ్య డంకి తో పోల్చుకుంటే తక్కువే, 4,338 షోలు వేయనుండగా 2,46,772 టిక్కెట్లు విక్రయించబడ్డాయి.
Salaar Tickets in Telugu:
Salaar సినిమాకి సంబంధించి భాషల పరంగా టికెట్లు వాటి కలెక్షన్లు ఒక్కసారి చూద్దాం. సాలార్ సినిమాకి హిందీ భాషలో 35,946 టిక్కెట్ల అమ్ముడుపోగా, 1.11 కోట్ల రూపాయలు రాబట్టింది,
ఇక ప్రభాస్ కి ఎక్కువ ఫ్యాన్ బేస్ కలిగిన తెలుగు విషయానికి వస్తే 1,29,010 టిక్కెట్ల అమ్ముడవగా దానికిగాను 3.5 కోట్లు వచ్చాయి,
ఇక తమిళంలో 12 లక్షలు, కన్నడలో 9.9 లక్షలు, మలయాళంలో 98 లక్షల రూపాయల రాబడి మాత్రమే వచ్చింది. ఈ మూడు భాషల్లో సాలార్ సినిమా టికెట్ల అమ్మకం మాత్రం మెల్లగా పుంజుకుంటోంది అని చెప్పొచ్చు.
Star cast in Salaar:
Salaar సినిమాలో ప్రభాస్ తో స్రుతి హాస్సన్ Sruthi Hassan తొలిసారి జోడి కట్టగా, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ Prudhvi raaj Sukumaran, జగపతిబాబు,
ఈశ్వరి రావ్, టీను ఆనంద్ Teenu anand వంటి భారీ తారాగణం ఇందులో కనిపించనుంది. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించారు. హింసాత్మక దృశ్యాలు అధిక రక్తపాతం ఉండటంతో ఈ సినిమాకి సెన్సార్ బోర్డు A certificate జారీ చేసింది.