Salaar 2 will Release in 2025: సాలార్ 2 పై ప్రభాస్ అదిరిపోయే అప్‎డేట్.


Prabhas' shocking update on Salaar 2.

Salaar Movie 2: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)నటించిన సాలార్ (Salaar)పార్ట్ 1 వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.650కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

ఈ యాక్షన్ మూవీ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) డుంకీ (Dunki)తో ఢీ కొట్టి బాక్సాఫీస్‌ను శాసిస్తూనే ఉంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 2పై పడింది.

మొదటి భాగంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సెకెండ్ పార్ట్ పై క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ సాలార్ 2(Salaar2) పై ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.

సలార్ పార్ట్ 2- శౌర్యాంగ పర్వం (Shauryanga Parvam) షూటింగ్ 2024 లోనే స్టార్ట్ అవుతుందని హింట్ ఇచ్చి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచాడు.

Prabhas on Salaar 2 : సలార్ 2పై ప్రభాస్ ఏమన్నాడంటే..

ప్రభాస్‌ (Prabhas)నటించిన సలార్ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసింది. కేజీఎఫ్ (KGF) ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neil) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ లో కొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది.

prabhas 1 Salaar 2 will Release in 2025: సాలార్ 2 పై ప్రభాస్ అదిరిపోయే అప్‎డేట్.

సాలార్ పార్ట్ 1లో ప్రభాస్ తో పాటు తమిళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Pruthviraj Sukumaran) నటి శృతి హాసన్ (Shruthi Haasan) కూడా నటించారు.

ఈ చిత్రం సీక్వెల్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ ఇటీవల ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. “సలార్ సీక్వెల్ (Salaar sequel) స్టోరీ రెడీ అయ్యింది. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెడతాము.

ఈ చిత్రాన్ని త్వరగా ప్రేక్షకుల ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాము. అభిమానులు కూడా సలార్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు.

త్వరలోనే పార్ట్2కి సంబంధించిన అప్‏డేట్స్ అందిస్తాము.అని తెలిపారు. దీంతో సలార్ పార్ట్ 2 2024నే రానుందని అర్థమవుతోంది. ఈ వార్త తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

That is my goal : నా లక్ష్యం అదే

images 99 Salaar 2 will Release in 2025: సాలార్ 2 పై ప్రభాస్ అదిరిపోయే అప్‎డేట్.

అదే ఇంటర్యూలో ప్రభాస్ మాట్లాడుతూ..” నా యాక్టింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను అలరించడమే నా ఏకైక లక్ష్యం. నేను ఎంచుకునే చిత్రాల వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన అదే.

నా తర్వాత ప్రాజెక్ట్ భవిష్యత్‌కు అనుగుణంగా ఉంటుంది. సాలార్ కఠినమైన మాస్ మూవీ, నేను నటించే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఒక హారర్ చిత్రం.

ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన జోనర్‌లను అన్వేషించాలనుకుంటున్నాను . సాలార్‌పై అభిమానులు చూపిన ప్రేమను నా భవిష్యత్ చిత్రాలపై కురిపిస్తారని ఆశిస్తున్నాను.” అని తెలిపారు.

Salaar part1 is just introduction : సలార్ పార్ట్ 1 జెస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే.

prabhas and prashanth neel Salaar 2 will Release in 2025: సాలార్ 2 పై ప్రభాస్ అదిరిపోయే అప్‎డేట్.

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neil)సలార్ (Salaar) పై అప్‏డేట్స్ అందించారు. ” సినిమా ముగింపుని చూపించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను.

సాలార్: పార్ట్ 1 లో తాను క్రియేట్ చేసిన ప్రపంచం , పాత్రలు సినిమా సీక్వెల్‌లోనూ కనిపిస్తాయి. సలార్ పార్ట్ 1 జెస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. పార్ట్ 1లో పాత్రలు మాత్రమే పరిచయం అయ్యాయి.

అసలు స్టోరీ శౌర్యాంగ పర్వం(Shauryanga Parvam)లోనే ఉంటుంది. కాబట్టి పార్ట్ 2 మిమ్మలి ఎట్టిపరిస్థితుల్లోనూ నిరుత్సాహ పరచదు. దీంతో సలార్ పార్ట్2 పై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

Leave a Comment