Why Dil Raaju So Angry : ఎప్పుడూ చూడని దిల్ రాజుని చూశాం?

website 6tvnews template 1 Why Dil Raaju So Angry : ఎప్పుడూ చూడని దిల్ రాజుని చూశాం?

Why Dil Raaju So Angry : ఎప్పుడూ చూడని దిల్ రాజుని చూశాం?

సినిమాల పట్ల భారతదేశం లో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. సినిమా నటీమణులను దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్యల్లా చూస్తారు, ఇక కధానాయకులనైతే సూపర్ నాచురల్ పవర్స్ ఉన్న వారీగా ఫీల్ అవుతారు. అందుకే వారి జీవితంలో ఎప్పడు ఎం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ ఆత్రుతనే క్యాష్ చేసుకునే బ్యాచ్ ఇప్పుడు తయారైంది.

ఈ తరహా వారు సినీ ఇండస్ట్రీ(Movie Industry) నటీనటుల పాలిట దండుపాళ్యం బ్యాచ్ లా అవతరించారు. వారి మీద ప్రజల్లో ఉన్న ఆదరణ, ఆకర్షణను సొమ్ము చేసుకోవడానికి ఉన్నవి లేనివి కల్పించి రాసి, గోరంతలు కొండంతలు చేసి చూపిస్తుంటారు, చిలవలు పలువలుగా రాసి తమ వెబ్ సైట్లు(Web Sites), యూట్యూబ్ ఛానెళ్ల(YouTube Channels) కి వ్యూస్ పెంచుకుంటారు, కొన్ని చానెళ్లు వారి టిఆర్పి రెంటింగ్(TRP Ratings) కోసం సినిమా వాళ్ల ఏకాంతానికి కూడా భంగం కలిగిస్తుంటారు.

అలాంటి వాటిని చూసి చూసి విసిగి వేసారి పోయి ఉన్నారేమో నిర్మాత దిల్ రాజు(Dil Raju) తాట తీస్తా ఒక్కొక్కడికి అంటూ డెడ్లి వార్ణింగ్ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే ? What actually happened?

అసలు ఇంతకీ ఎం జరిగింది ? దిల్ రాజు ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు ? ఆయన కోపం ఎందుకు అలా కట్టలు తెంచుకుంది ? ఎప్పుడు చిరు మందహాసంతో ఉండే దిల్ రాజు కళ్ళు ఎందుకు చింత నిప్పులు కురిపించాయి ? దిల్ రాజు కి ఆ యూట్యూబ్ ఛానెల్స్ కి సంబంధం ఏమిటి ? ఎలా చాలా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి చేసేవారిలో.

దిల్ రాజు 2003 సంవత్సరం లో దిల్(Dil) అనే సినిమాతో నిర్మాతగా మారి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఈమాట ఎందుకు ప్రస్తావించాం అంటే, అయన ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఒక అనుభవం ఉన్న నిర్మాతగా ఇండస్ట్రీలో ఉన్న సహ నిర్మాతలతో సమన్వయం చేసుకుంటూ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు.

పైగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దిల్ రాజు చేతిలో థియేటర్లు ఉన్నాయని కూడా అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇలాంటి నిర్మాత ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన ప్రొడ్యూసర్లతో పరస్పరం సహకారం అందించుకుంటూ ఉంటారు, వారు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారు.

సమన్వయం చేయడమే పొరపాటు అయిందా ? Was it a mistake to coordinate?

ఇలా సలహాలు సూచనలు ఇవ్వడమే దిల్ రాజు(Dil Raju) చిక్కుల్లో పడటానికి, యూట్యూబ్ ఛానెళ్ల వారు వెబ్ సైట్లవారు అబద్దపు కధనాలు అల్లడానికి అవకాశం ఇచ్చినట్లయింది. సంక్రాంతి(Sankranti) సీజన్ అంటేనే సినిమాల సందడి, పండగ సమయాన్ని సినిమాల తో ఎంజాయ్ చేస్తుంటారు ప్రజలు, అందుకే నిర్మాతలు(Producers) తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు.

స్టోరీ మీద నమ్మకం ఉన్న ప్రతి నిర్మాత సంక్రాంతి బరిలోకి దిగుతూ ఉంటారు, అయితే అంతమంది సంక్రాంతి రేసులో ఉన్నప్పటికీ ఏ సినిమా కి ఉండే సత్తా ఆ సినిమాకే ఉంటుంది. కాకపొతే థియేటర్లు కూడా దొరకాలి కాబట్టి, అందరూ ఒకే సారి ఒకే రోజు కాకుండా కొద్దీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి సినిమాలు రిలీజ్ చేసుకుంటారు.

ఇలా రిలీజ్ చేసుకునే విషయంలో సీనియర్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు సదరు సినీ నిర్మాతలకు సమన్వయాన్ని కుదిర్చారు.

దిల్ రాజు పై కట్టు కథలు : Wrong News On Dil Raju

ఇలా నిర్మాతతో కూర్చుని దిల్ రాజు మాట్లాడటమే వారికి అవకాశం చిక్కినట్టయింది, దిల్ రాజు కేవలం పెద్ద సినిమాలను మాత్రమే రిలీజ్ చేసుకునేలా అవకాశం ఇచ్చారు, చిన్న హీరోల సినిమాలకు థియేటర్లు దొరకనివ్వలేదు అని, సినిమాను పోస్ట్ పోన్ వేసుకోవాలి అంటూ వార్ణింగ్ ఇచ్చినట్టుగా కట్టు కధలు అల్లుకొచ్చారు. అయితే దిల్ రాజు అసలు అలా ఎవరికీ వార్నింగ్ ఇవ్వలేదని, పైగా నైజామ్(Nizam) ఏరియాలో కొన్ని సెంటర్లలో సీనియర్ హీరోలకే థియేటర్లు దొరకలేదని, హనుమాన్(Hanuman) వంటి సినిమాకి థియేటర్స్ దొరికాయని చెప్పుకొచ్చారు. ఇక పోతే రవితేజ(Raviteja) నటించిన ఈగల్(Eagle) సినిమాను వాయిదా వేసుకోమని తానే రిక్వెస్ట్ చేశానని చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ మాటలను వక్రీకరించారా ? Are They Twisted Megastar Statements ?

ఇక మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హనుమాన్(hanuman) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన గురించి చెప్పిన విషయాలను కూడా వక్రీకరించి చూపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వెబ్ సైట్ లలో తప్పుడు రాతలు రాయడం కొత్తేమి కాదని, ఎప్పటి నుండో తప్పుడు కధనాలు వండి వరుస్తున్నారని అన్నారు. అయితే ఇన్నాళ్లు చూస్తూ ఉరుకున్నానని ఇక మీదట ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. ఒక్కొక్కరికి తాట తీస్తానని వేదిక మీది నుండే చెప్పారు.

ఇది అనాది నుండి వస్తోంది It is Continuing From Long Time

సినిమా ఇండస్ట్రీలో(Movie Industry) తప్పుడు వార్తలు రాసి వాటిని వైరల్ చేసి జనాలను తప్పు దోవ పట్టించడం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఎక్కువైంది అనుకుంటాం. కానీ ఇది అనాదిగా వస్తోంది. ఒక హీరోయిన్ హీరో కలిసి నాలుగైదు సినిమాల్లో కలిసి పనిచేస్తే చాలు వారి మధ్య ఎదో నడుస్తోందని, వారు పెళ్లి చేసుకోబోతున్నారని రాసేస్తారు.

అలంటి రాతలను చూసి కలత చెందిన వారిలో మురళి మోహన్ ఒకరు(Murali Mohan). మురళి మోహన్ జయచిత్ర(jayachitra) పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ, అప్పట్లో ఒక సినీ వారపత్రిక ప్రచురించింది. దానికి మురళి మోహన్ చాల బాధ పాడారు. ఎందుకంటే అప్పటికే ఆయనకి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు.

అయన బాధ పడటం చూసిన ఓ బడా ప్రొడ్యూసర్ ఒక సలహా ఇచ్చారట, అసలు ఇలాంటి వార్తలను చదవడం మానెయ్, పట్టించుకుంటేనే తల నొప్పి, వదిలేస్తే ఏమి ఉండదు అని అన్నాడట, అప్పటి నుండి మురళి మోహన్ లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు.

కడిగి పారేసిన రేణు దేశాయ్ Renu Desai Given Perfect Counter

ఇక ఈ వెబ్ సైట్ లలో తప్పుడు రాతలు రాసే వారిని పవన్ కళ్యాణ్(Pavankalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renudesai) కూడా ఉతికి ఆరేసింది. ఒక సందర్భంలో యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూవర్ రేణు దేశాయ్ ను ఆమె నటించే సినిమాకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఆమె పర్సనల్ విషయాలు అలాగే పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ కి సంబంధించిన విషయాలపై ప్రశ్నలు వేశాడు.

దేంతో రేణుకి మండిపోయింది. వెబ్ సైట్లలో మా గురించి తప్పు తప్పుగా రాస్తుంటారు, యూట్యూబ్ చేనెల్స్ లో ఇష్టం వచ్చినట్టు థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోస్ వైరల్ చేస్తుంటారు, ఇలా సంపాదించిన డబ్బు తో మీ పిల్లలను పెంచితే వారికి యోగ్యమేనా అని మొహం మీదే అడిగేసింది. ఊహించని విధంగా ఆమె స్పందించడంతో చాల మంది రేణు తీరుకు నిర్ఘాంత పోయారు.

ఇలాంటి వారు సోషల్ నీడియాలోనే కాదు ఇండస్ట్రీ లో కూడా ఉన్నారు :

ఆర్టిస్టుల మీద తప్పుడు రాతలు రాసి డబ్బు సంపాదించుకునే వారికి కొందరు ముద్దుపేరు పెట్టుకున్నారు, వారిని పరాన్న జీవులు అని అంటారు. పరాయి వారి మీద ఆధారపడి వీరి జీవితాలు నడుస్తున్నాయి కాబట్టి ఆలా పేరు పెట్టారు. అయితే ఈ పరాన్న జీవుల్లో మరో రకం కూడా ఉన్నారు, సినిమా వారి మీద, సినిమా వారే సినిమాలు తీస్తుంటారు, వారిని డీ గ్రేడ్ చేసి సినిమాలు తీసి క్యాష్ చేసుకుంటారు.

అలంటి వారి వల్ల బలైపోయిన వారిలో స్టార్లు, పవర్ స్టార్లు కూడా ఉన్నారు. అయితే గుర్రాన్ని, గాడిదను ఒకే గాటికి కట్టేయడం సమంజసం కాదు, వెబ్ సైట్లలో అలాగే యూట్యూబ్ ఛానెల్స్ లో మంచివి కూడా ఉన్నాయి. సరైన అధరాలు లేకుండా వార్తలు ప్రచురించరు, అన్నిటికి మించి సమాజం లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

కాబట్టి మనం ఏ వెబ్ సైట్ లో వార్తలు చదువుతున్నాం అన్నదానిమీదే ఆధారపడి ఉంటుంది, నిఖార్సయిన వార్తల కోసం సరైన వెబ్ సైట్లను, సరైన యూట్యూబ్ ఛానెల్స్ ను సరైన మాధ్యమాలను మాత్రమే ఎంచుకోండి. ఇలాంటి పరాన్న జీవులకు దూరంగా ఆరోగ్యంగా ఉండండి.

Leave a Comment