Ambati Rayudu Said Bye YSRCP: వైసీపీ కి అంబటి రాయుడు గుడ్ బై.

Good bye Ambati Rayudu to YCP.

Ambati Rayudu Said Bye YSRCP: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ రసవత్తరంగా మారుతోంది.

ఒకపక్క టీడీపీ వేగంగా ముందుకి దూసుకెళుతుంటే, వైసీపీ(YCP) కి మాత్రం దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఆపార్టీ లోని సీనియర్ నేతలు ఒక్కొక్కరు బయటకు వెళుతున్నారు.

వీరిలో మొట్టమొదట ప్రస్తావించాలంటే నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy), గురించి చెప్పుకోవాలి. అయన ఎగురవేసిన తిరుగుబాటు జండా ఇంకా రెపరెపలాడుతూనే ఉంది.

Also Read: CM Jagan meet with KCR: కేసీఆర్ తో సీఎం జగన్ భేటీ

ఇక ఆళ్ళ రామకృష్ణ రెడ్డి(Alla Rama Krishna Reddy) ఇచ్చిన షాక్ నుండి వైసీపీ అధినాయకత్వం తేరుకోకముందే మరో ఎదురుదెబ్బ తలిగిలింది.

రాయదుర్గం(Rayadurgam) ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి(kapu ramachandra reddy) వైసీపీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కి టాటా చెప్పిన అయన,

test cricket 14 1704528331 Ambati Rayudu Said Bye YSRCP: వైసీపీ కి అంబటి రాయుడు గుడ్ బై.

రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) కూడా ఆపార్టీ నుండి బయటకు వచ్చేశారు.

Ambati Rayudu Said Bye YSRCP

ఎంపీ మిధున్ రెడ్డి(Midhun Reddy), డెప్యూటీ సీఎం, మంత్రి నారాయణ స్వామి(Narayana Swamy) తోపాటు సీఎం జగన్(CM Jagan) ను కలుసుకున్నారు అంబటి రాయుడు.

అదే రోజు జగన్ అంబటి రాయుడుకి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ పట్టుమని పది రోజులు కూడా గడవకముందే అంబటి రాయుడు యూ టర్న్ తీసుకున్నాడు.

Also Read: CM Jagan meet with KCR: కేసీఆర్ తో సీఎం జగన్ భేటీ.

వైసీపీ కి గుడ్ బై చెప్పేశాడు. అయన పార్టీని వీడుతున్న విషయాన్నీ, కనీసం ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పకుండా, కేవలం సామజిక మాధ్యమం ద్వారా ఒక చిన్న మెసేజ్ పెట్టి వదిలేశారు.

అంబటి రాయుడు మొదటి నుండి తనకు సీఎం జగన్ అంటే అభిమానమని, అయన చేపట్టిన సంక్షేమ పధకాల పట్ల, పేద ప్రజల యందు జగన్ చూపెడుతున్న ఆదరణ పట్ల ఆకర్షితుడిని అయ్యానని చెప్పేవాడు.

ఒకానొక దశలో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pavan Kalyan) మీద కూడా విమర్శలు ఎక్కుపెట్టారు.

కానీ ఉన్నట్టుండి అంబటి ఇలా మిడిల్ డ్రాప్ అవ్వడంపై వైసీపీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమైంది బ్రో, అంటూ అంబటి ట్వీట్ కి కామెంట్లు చేస్తున్నారు.

ఇక అంబటి రాయుడు మాత్రం తనకి రాజకీయాల నుండి కొంత విరామం కావాలని అంటున్నాడు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు. తన భవిష్యత్తు కార్యాచరణ గురించి తవ్రలోనే ప్రకటన చేస్తానని చెప్పుకొచ్చాడు.

Read Also: KCR & Jagan Visit chandramohan funeral: దివంగత నటుడు చంద్రమోహన్ కు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సంతాపం.

అయితే రాయుడు మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతను భవిష్యత్తులో జనసేన పార్టీలో చేసే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a Comment