#BoycottMaldives trending?: బాయ్ కాట్ మాల్దీవ్స్(#BoycottMaldives) అనే హాష్ టాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఉన్నట్టుండి ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుకుంటున్నారా ?
అందుకు కారణం మాల్దీవ్స్ లోని మంత్రులు(Ministers Of Maldives) ఇతర నేతల దుందుడుకు స్వభావమే అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
వారి తొందరపాటు తత్త్వం మాట జారే స్వభావం వల్ల వారు భవిష్యత్తులో కొన్ని తీవ్ర ప్రరిణామాలు ఎదుర్కొనబోతున్నట్టు అర్ధమవుతోంది. భారతదేశం(India) అపరిశుభ్రంగా ఉందంటూ అక్కడివారు చేసిన తొందరపాటు వ్యాఖ్యల వల్ల వారు భారీగానే మూల్యం చెల్లించుకోబోతున్నారు.
Read also: PM Modi Lakshadeweep Visit: లక్ష దీవులలో భారత ప్రధాని ప్రయాణం.
భారత దేశానికి చెందిన ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్ మై ట్రిప్, మాల్దీవులకు వెళ్లే ప్లైట్స్ బుక్సింగ్స్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లుప్రకటించి సంచలనానికి తెరలేపింది.
ఈ విషయంలో సరదరు కంపెనీ సీఈవో నిశాంత్ పిట్టి(Nishant Pitti) మనదేశానికి మద్దతుగా ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
హోటల్ అండ్ ఫ్లయిట్ బూకిన్స్ రద్దు : Cancellation of hotel and flight bookings
కేవలం ఒక్క కంపెనీ మాత్రమే కదా ఈ నిర్ణయం తీసుకుంది అని లైట్ తీసుకుంటే మాల్దీవ్స్ లో మునిగినట్టే. ఎందుకంటే ఈ ఒక్క కంపెనీ కి మాత్రమే మన దేశంలోని ఆన్లైన్ ట్రావెలింగ్ బుకింగ్(Online Traveling Booking) లో 8.1 శాతం వాటా ఉంది.
అంటే చుడండి ఎంత మేర నష్టం కలుగుతుందో. ఎప్పుడైనా తిరుగుబాటు ఒక్కరు మొదలు పెడితే చాలు, మిగిలిన వారు కూడా మొదలుపెడతారు, మెల్లగా అది దావానలంగా వ్యాపిస్తుంది.
ప్రస్తుతం మాల్ దీవ్స్ విషయంలో కూడా అదే జరుగుతోంది. భారత్(India) కు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న చాలా మంది మాల్దీవ్స్ టూర్‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
పైగా క్యాన్సిల్ చేసుకున్న స్క్రీన్ షాట్లను నెట్ లో షేర్ చేస్తున్నారు. ఈ క్యాన్సిలేషన్ విషయం చుస్తే ఇప్పటివరకు 2500 పైచిలుకు ఫ్లయిట్ టికెట్లు(Flight Tickets), 8 వేల హోటల్ బుకింగ్స్(Hotel Bookings) రద్దు చేసుకున్నట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది.
మోదీ ఫొటోస్ వైరల్ : Modi’s photos are viral
మరికొంతమంది నెటిజన్లు మాల్ దీవ్స్ కి బదులు మన దేశంలోని లక్షద్వీప్ ఐలాండ్స్(Lakshadweep Islands) ను సజస్ట్ చేస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యనే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) కూడా లక్షద్వీప్ లో పర్యటించారు. దీంతో నెటిజన్లు మోదీ లక్షద్వీప్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ మాల్దీవ్స్ ను అవాయిడ్ చేయాలనీ సూచిస్తున్నారు.
ఈ విషయంలో కేవలం సామాన్యులు మాత్రమే కాదు మాల్దీవ్స్ ను బహిష్కరించే విషయంలో సినీ ప్రముఖులు కూడా నడుం బిగించారు. తమతమ సోషల్ మీడియా అకౌంట్లలో మాల్దీవ్స్ ను బాయ్ కాట్ చేయమని చెబుతున్నారు.