Captain Miller released Date: ధనుష్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్..26న కెప్టెన్ మిల్లర్ రిలీజ్

Captain Miller Dhanush Telugu Runtime, Captain Miller Telugu release gets updated runtime,Dhanush,Captain Miller release date,Captain Miller latest,Captain Miller, Captain Miller Telugu Release Date,captain miller telugu version,captain miller review,captain miller movie,dhanush captain miller,actor dhanush,director arun matheshwaran,కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ డేట్,కెప్టెన్ మిల్లర్ మూవీ,కెప్టెన్ మిల్లర్ రివ్యూ,ధనుష్ కెప్టెన్ మిల్లర్,కోలీవుడ్ న్యూస్,Dhanush, Captain Miller Movie, Shivarajkumar, Suresh Productions, Captain Miller Telugu Release Date, Captain Miller Review, Latest Telugu News, Tollywood News, Kollywood News, V6 News, Hyderabad News

Captain Miller released Date: తమిళ సూపర్ స్టార్ ధనుష్ (Dhanush)నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller)మూవీ సంక్రాంతి కానుకగా తమిళనాడులో రిలీజై థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. భారీ బడ్జెట్ తో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.

బ్రేక్ ఈవెన్ వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు వెర్షన్ లో కెప్టెన్ మిల్లర్ జనవరి 26న విడుదల కాబోతోంది(Captain Miller released Date).

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. 1930 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీని అరుణ్ మాథేశ్వ‌ర‌న్ (Arun Matheswaran) డైరెక్ట్ చేశాడు. బ్రిటీష్ కాలంలో కుల‌వివ‌క్ష ఎలా ఉండేది.

త‌క్కువ కులానికి చెందిన వారిని రాజ‌వంశ‌స్థులు, బ్రిటీష‌ర్లు ఎలా చూసేవారు? వారిని ఏ విధంగా వాడుకున్నార‌న్న‌ది ఈ సినిమాలో డైరెక్టర్ చూపించాడు.

Captain Miller Copied from the novel?: నవల నుండి కెప్టెన్ మిల్లర్ కాపీ ?

Captain Miller released Date

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని తమిళనాడులో బాక్సాఫీస్ లో భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. (Captain Miller released Date)కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ నుంచి సిపిమా వరకు అన్నీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అందుకే ప్రమోషన్స్ సోసోగా ఉన్నా కలెక్షన్ల సునామీని సృష్టించింది.

సినిమా బ్రేక్ ఈవెన్ ను అందుకుంటున్న తరుణంలో ఓ కొత్త వివాదంలో పడింది. తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు, రచయిత వేల రామమూర్తి (Vela Ramamoorthy)సినిమాపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తాను రచించిన ‘పట్టత్తు యానయ్’ (Pattatu Yanai)అనే నవలను కాపీ కొట్టి కెప్టెన్ మిల్లర్ ను తెరకెక్కించారని రామమూర్తి ఆరోపించారు.

సినిమా విడుదలకు ముందు ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller released Date) టీమ్ తన దగ్గరి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఆయన తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” నేను రాసిన నవల ‘పట్టతు యానై’ ఆధారంగా ‘కెప్టెన్ మిల్లర్’ రూపొందింది. నా కథను మేకర్స్ కాపీ కొట్టారు. నాకు న్యాయం జరగాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో నిజాయితీ లేదు.

అందుకే న్యాయం కోసం నేను సినీ దర్శకుల సంఘానికి వెళ్తున్నాను. లెజెండరీ డైరెక్టర్, యూనియన్ ప్రెసిడెంట్ భారతీరాజా (Bharti Raja) నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. అని కెప్టెన్ మిల్లర్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ మూవీ వివాదంలో పడింది.

Captain Miller is a mirror of freedom and self-respect : స్వేచ్ఛ, ఆత్మగౌరవాలకు అద్దం పట్టే కెప్టెన్‌ మిల్లర్‌

Captain Miller released Date

కెప్టెన్‌ మిల్లర్‌ (Captain Miller released Date)కథ గురించి డైరెక్టర్ అరుణ్ మాథేశ్వ‌ర‌న్ (Arun Matheswaran) ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..” ఈ కథ ఆలోచన నాకు పదేళ్లక్రితమే వచ్చింది. స్టోరీ రాస్తున్నంత సేపు ధనుష్(Dhanush) మాత్రమే నా మదిలో మెదిలింది.

కథ పూర్తవ్వగానే ధనుష్ ని కలిశాను . తను కూడా ఓకే చెప్పాడు. అలా కెప్టెన్‌ మిల్లర్‌ జర్నీ స్టార్ట్ అయ్యింది. బ్రిటిష్‌ ఆర్మీలో పనిచేసే ఓ భారతీయ సైనికుడి స్టోరీ ఇది. ధనుష్ తన పాత్రలో ఎంతో అద్భుతమైన నటించాడు. ఆయనతో ఈ సినిమా చేయడం గొప్ప అనుభవం. ఈ మూవీలో 40శాతం యాక్షన్‌ ఉంటుంది. మిగతా అంతా హీరో జర్నీనే కనిపిస్తుంది.

ప్యూర్‌ డ్రామా. ప్రేక్షకులు తమకు తాము గుర్తించుకునేలా చేస్తుంది. ఈ మూవీలో కీలక పాత్రలో శివరాజ్‌కుమార్ shivaraj kumar) కనిపించారు. ఆయన క్యారెక్టర్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఆయన స్క్రీన్ లుక్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. హీరోయిన్ ప్రియాంక అరుళ్‌ మోహన్‌ (Priyanka Arul Mohan) కెప్టెన్ మిల్లర్ లో కొత్తగా కనిపిస్తుంది. టాలీవుడ్ హీరో సందీప్‌కిషన్‌ (sandeep kishan)కూడా తన పాత్రకు న్యాయం చేశాడు”అని డైరెక్టర్ తెలిపాడు

Captain Miller released Date & Paid Premiere Details : ‘కెప్టెన్ మిల్లర్’ పెయిడ్ ప్రీమియర్స్ డీటెయిల్స్

జనవరి 25న సాయంత్రం కెప్టెన్ మిల్లర్‌ స్పెషల్‌ పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెకెల్ట్ చేసిన థియేటర్లలో కెప్టెన్‌ మిల్లర్ స్పెషల్ ప్రీమియర్‌ ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

మరి తెలుగులో ఈ మూవీ ఎంత మేర కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.ఇదిలా ఉంటే ఈ మూవీలో ధనుష్‌కు జోడీగా తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ (priyanka mohan) నటించింది. శివరాజ్ కుమార్ (shivaraj kumar), సందీప్ కిషన్ (sandeep kishan ), ఎలంగో కుమారవేల్‌ (Elango Kumaravel) లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.

అరుణ్ మతేశ్వరన్ (Arun Matheswaran)డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) మ్యూజిక్ అందించారు.

Leave a Comment