Cyber Criminals focuses on Praja Palana Applications: ప్రజాపాలన దరఖాస్తులే టార్గెట్ గా సైబర్ నేరాలు.

website 6tvnews template 9 Cyber Criminals focuses on Praja Palana Applications: ప్రజాపాలన దరఖాస్తులే టార్గెట్ గా సైబర్ నేరాలు.

Cyber Criminals focuses on Praja Palana Applications: దారి కాచి దోపిడీలు చేసే రోజులు పోయి, అవకాశం అదును చూసి బ్యాంకు ఖాతాను ఖాళి చేసే రోజులు వచ్చేశాయి. కష్టపడకుండా, చుక్క చెమట చిందకుండా, కూర్చున్న చోట నుండి కదలకుండా సంపాదన పెంచుకోవడం కోసం టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఒకప్పుడు అమాయకులను చదువు లేని వారిని టార్గెట్ గా చేసుకుని మోసాలు చేసేవారు.

మొదట్లో ఈ మోసాలు ఎలా ఉండేవంటే, మీ పేరు మీద లాటరీ తీసాం, లక్కీ డ్రా లో మీ పేరే వచ్చింది, ప్రైజె మని మీ బ్యాంకు ఖాతా లోకి జమ అవ్వాలంటే మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ చెప్తే నగదు మీకు వెంటనే వస్తుంది అని ఆశ చూపెడతారు.

ఆ మాయ మాటలు విన్న వారు ఓటిపి గనక చెప్తే బ్యాంకు అకౌంట్ ఖాళి అయినట్టే. ఇలా మోసపోయిన వారు అనేక మంది. ఆ తరువాత సైబర్ పోలీసులు(Cyber Police) ఇలాంటి మోసాలపై ప్రజలకు అవగాహనా కల్పించారు. దీంతో మోసగాళ్లు మరో మార్గాన్ని ఎంచుకున్నారు.

ఓటీపీ చెప్పారా అంతే సంగతి : Don’t Reveal OTP

Heavy Que Line At Prajapalana apply 6 Cyber Criminals focuses on Praja Palana Applications: ప్రజాపాలన దరఖాస్తులే టార్గెట్ గా సైబర్ నేరాలు.


ప్రభుత్వం బ్యాంకు అకౌంట్ కు ఆధార్(Adhar) ను లింక్ చేయాలనో, లేకుంటే పాన్ కార్డును ఆధార్ కు లింక్ చేయాలనో, పాన్ కార్డుకి బ్యాంకు అకౌంట్ కి లింక్ చేయాలనో చెబుతుంది.

అలాంటప్పుడు బ్యాంకు అకౌంట్ కి కెవైసి(KYC) చేసుకోవాలి, ఓటీపీ పంపించాం అది మాకు చెప్పండి లేదంటే బ్యాంకు అకౌంట్ నిలిచిపోతుంది అని హెచ్చరించినట్టు చెబుతారు.

ఆ మాటలు గనుక నమ్మి ఓటీపీ నెంబర్ గనుక చెప్పమంటే అంతే సంగతి, బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్ జీరో అయ్యి తీరుతుంది. ఇలా చాలామందికి నెత్తిన టోపీ పెట్టారు. ఈ మోసాలను బ్యాంకులు(Banks) కూడా గ్రహించాయి.

తాము ఎటువంటి ఓటీపీ లు అడగమని, అటువంటి మెసేజులు కాల్స్ ను నమ్మి ఓటీపీ లు చెప్పి మోసపోవద్దని సూచనలు చేయడం మొదలెట్టాయి. దీంతో మోసగాళ్లకు ఆ దారులు కూడా మూసుకుపోయాయి.

అమాయక మహిళ నుండి పది వేలు : Innocent Women Lost 10K Amount


అయితే ఇప్పడు వారికి తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) ఆరు గ్యారంటీల పేరిట కొత్త గా అవకాశం లభించింది. మీరు ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమంలో దరఖాస్తు పెట్టారు కదా ? మీ అర్జీ మా వద్దకి వచ్చింది, మీ అర్జీ పెట్టుకున్న సంక్షేమ పధకం మంజూరవ్వాలంటే మీ మొబైల్ కి వచ్చే ఓటీపీ(OTP) మాకు చెప్పాలి అని అంటున్నారు.

ఆ మాటలు గనుక నమ్మి ఓటీపీ చెప్తే మీ బ్యాంకు ఖాతా తీసుకెళ్లి దొంగ చేతిలో పెట్టినట్టే. ఇలా ఓ మహిళా తెలంగాణాలో మోసపోయింది. ఆమె ఖాతా నుండి పది వేల రూపాయలు మాయమయ్యాయి.

దీంతో పోలీసులు ప్రజలను సైబర్ మోసాలపట్ల9Cyber Crime) జాగరూకులై ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఓటీపీ విధానమే లేదు : No OTP Process


తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు సేకరించి వాటిని కంప్యూటరైజ్ చేస్తుంది. ఆతరువాత డోర్ టు డోర్ ఎంక్వయిరీ చేపడతారు. ఆతరవాతే పధకాలకు అర్హులా కదా అన్నది తేల్చుకుంటారు. ఇందులో ఓటీపీ విధానమే లేదని, అసలు ఓటీపీ కి ఆస్కారమే ఉండదని అంటున్నారు.

కాబట్టి ఓటీపీ చెప్పాలంటూ వచ్చిన కాల్స్ కి అటువంటి సమాచారం ఇవ్వొద్దని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి సర్కారు(CM Revanth Reddy) అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది కాబట్టి ఇటువంటి కాల్స్ నమ్మవద్దని అంటున్నారు సైబర్ పోలీసులు.

Leave a Comment