Family Star Release Date: ఎన్టీఆర్ ‘దేవర’ పైనే కన్నేసిన విజయ్ దేవరకొండ, ఎందుకంటే

Family Star Release Date

Family Star Release Date: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో సోలోగా తన టాలెంట్ నమ్ముకుని ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి చేరుకున్నాడు.

పెళ్లి చూపులు (Pelli Chupulu) సినిమాతో వెండి తెరకు హీరోగా పరిచయమైన విజయ్ అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా యూత్ లో విజయ్ కి ఉన్న క్రేజే వేరే .(Family Star Release Date) సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు.

కానీ గత ఏడాది విడుదలైన లైగర్ (Liger), ఖుషి (Kushi)సినిమాలు అనుకున్నంత హిట్ కాకపోవడంతో ఈసారి ఎలాగన్నా హిట్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నాడు విజయ్. (Family Star Release Date)ఫ్యామిలీ స్టార్ (Family Star) తో ప్రేక్షకులను మరోసారి పలకరించేందుకు రెడీ అయ్యాడు. గీత గోవిందం (Geetha Govindam)వంటి సూపర్ హిట్ మూవీని అందించిన డైరెక్టర్ పరశురామ్ (Parushuram)ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.

అందుకే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతే కాదు ఈ మధ్యనే రిలీజైన గ్లింప్స్ విడియో లోని డైలాగులు సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మూవీని తీశారు మేకర్స్. ఫ్యామిలీ స్టార్ ను ఈ సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేసినా , అనుకోని కారణాల వల్ల సడన్ గా రేస్ నుంచి తప్పకుంది.

దీంతో ఈ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ న్యూస్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మార్చి 28న సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ ఎన్టీఆర్ (NTR)నటిస్తున్న దేవర (Devara)మూవీ కనుక పోస్ట్ పోన్ అయితే ఫ్యామిలీ స్టార్ ను ఏప్రిల్ 5న రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

NTR Devara postponed?:ఎన్టీఆర్ దేవర వాయిదా?

Family Star Release Date

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) , డైరెక్టర్ కొరటాల శివ (Koratala siva) కాంబోలో రూపొందుతున్న మూవీ ‘దేవర‘ (Devara). భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో వస్తున్న ఈ మూవీని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు మేకర్స్. అందులో ఫస్ట్ పార్ట్ ను ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు(Family Star Release Date). అయితే గత కొంత కాలంగా సోషల్ మీడియాలో దేవర మూవీ వాయిదా వేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మేకర్స్ ఈ రూమర్ ను ఖండించినా ఇవి ఆగటం లేదు.

తాజాగా ‘దేవర’ మూవీ విడుదల తేదీపై మరో న్యూస్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఈ మూవీని నిజంగానే వాయిదా వేశారంటు వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఎలక్షన్స్ టైం కావడం,మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ (Anirudh) మ్యూజిక్ లేట్ అవడం,సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కు గాయం కావడం వల్ల దేవర రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు చెబుతున్నారు.

అంతే కాదు ‘దేవర’ ఆగస్టు 15వ రిలీజ్ అవుతుందని మరో వార్త కూడా బయటకు వచ్చింది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉంది అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఎన్టీఆర్ సినిమా వెనక్కి వెళుతుండటంతో ఫ్యామిలీ స్టార్(Family Star) ను రిలీజ్ చేసేందుకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారని టాక్.

Family Star Release Date: సంక్రాంతి కంటే బెస్ట్ రిలీజ్ డేట్!

‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)మూవీని ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అప్పటికే బరిలో నాలుగైదు సినిమాలు ఉండటం, భారీ పోటీ ఉండటంతో ఫ్యామిలీ స్టార్ వెనక్కి వెళ్ళింది. ఒక విధంగా పోస్ట్ పోన్ చేయడం వల్ల కూడా మంచి జరిగింది. ఏప్రిల్ 5 సంక్రాంతి కంటే బెస్ట్ రిలీజ్ డేట్ అని తెలుస్తోంది.

ఏప్రిల్ 5 శుక్రవారం, ఆ రోజు ఓపెనింగ్స్ కలెక్షన్స్ అదిరిపోతాయి. ఆ తర్వాత శని, ఆదివారాలు కావడంతో వసూళ్ల పరంగా వెనక్కి చూసుకోవాల్సి అవసరం లేదు(Family Star Release Date). ఆ తర్వాత కూడా ఏప్రిల్ 8న తెలుగువారి పండుగ ఉగాది వస్తుండటంతో సినిమా హిట్ అయితే కనుక ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ శాతం విజయ్ సినిమాకే ఓటు వేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

సో సంక్రాంతికి మిస్ అయినా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు అంతకు మించిన మంచి రిలీజ్ డేట్ దొరికిందని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తోంది. సెకెండ్ హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) కనిపించనుంది.

Leave a Comment