Vijay Devarakonda Cameo In Prabhas kalki: కల్కి లో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్

website 6tvnews template 48 Vijay Devarakonda Cameo In Prabhas kalki: కల్కి లో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్
Vijay Devarakonda Cameo In Prabhas kalki

VijayDevarakonda Cameo In Prabhas kalki: వైజయంతి మూవీస్(Vaijayanthi Movies) బ్యానర్ మీద తెరకెక్కుతున్న తాజా సినిమా కల్కి 2898 AD Kalki 2898 AD. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఫాంటసీ సినిమాను, నాగ్ అశ్విన్(Nag Aswin) భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.

లోక నాయకుడు కమల్ హస్సన్(Kamal Hassan) ప్రతినాయకుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitab Bachan) కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే(Dipika Padukone), దిశా పటాని(Disha patani) నాయికలుగా నటిస్తున్నారు.

ఇంతటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సినిమాలో నాగ్ అశ్విన్ మరో ఇద్దరు స్టార్లను ఈ సినిమా కోసం సిద్ధం చేస్తున్నాడట. వారెవరో కాదు, మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి(mammootty) తనయుడు దుల్కర్ సల్మాన్(Dulkar Salman) ఒకరైతే, మరొకరు రౌడీ బోయ్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).

ఈ విషయంపై మూవీ యూనిట్..

2023103021163126 WhatsApp Image 2023 10 30 at 9 17 32 PM Vijay Devarakonda Cameo In Prabhas kalki: కల్కి లో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్
Vijay Devarakonda Cameo In Prabhas kalki


ఈ ఇద్దరు ఈ సిమిమలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్టు అధికారికంగా సినిమా యినిట్ చెప్పకపోయినా నెట్టింట ఈ వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ వార్తలకు విజయ్ దేవరకొండ మాటలు మరింత బలాన్నిచ్చాయి. తాను కల్కి సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్ ల బంధం ఈ నాటిది కాదు. ఎవడె సుబ్రహ్మణ్యం(Evade Subramanyam) సినిమా నుండి వీరిద్దరూ మంచి స్నేహితులు.

ఆ కారణంగానే మహానటి(Mahanati) సినిమాలో విజయ్ ఒక కీలక పాత్ర పోషించాడు, అలాగే జాతి రత్నాలు(Jathiratnalu) సినిమాలో గెస్ట్ రోల్ కూడా ప్లే చేశాడు. ఇప్పడు కల్కి కోసం కూడా డేట్స్ ఇచ్చేస్తా అంటున్నాడు. పైగా కల్కి లో దుల్కర్ చేసేది గెస్ట్ రోల్ కాగా, విజయ్ దేవరకొండ చేసేది కొంచం ఇంపార్టెంట్ రోల్ అని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

మే 9వ తేదీన పాన్ వరల్డ్ చిత్రంగా కల్కి 2898 AD ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ VFX పనులు మిగిలిపోయి ఉండటం వల్లనే ఈ సినిమా ఆలస్యం అయినట్టు తెలుస్తోంది.

Leave a Comment