Fighter Movie Review : ‘ఫైటర్’ ట్విట్టర్ రివ్యూ… సిద్ధార్థ్ హ్యాట్రిక్ కొట్టాడా?

website 6tvnews template 98 Fighter Movie Review : 'ఫైటర్' ట్విట్టర్ రివ్యూ… సిద్ధార్థ్ హ్యాట్రిక్ కొట్టాడా?

Fighter Movie Review : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ Hrithik Roshan ,బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే Deepika Padukone కాంబోలో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ (Siddarth Anand)రూపొందించిన మూవీ ఫైటర్ (Fighter). ఈ మూవీలో అనిల్ కపూర్ (Anil Kapoor), కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ మూవీ రిపబ్లిక్ డే (Republic Day) కానుకగా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఫైటర్ కు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ బ్లాక్‌బస్టర్ అంటూ ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నారు. విమర్శకుల ప్రశంసలను సైతం ఫైటర్ అందుకుంటోంది.

అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడంతో ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. #FighterReview అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జోడీ అదుర్స్ అంటూ కితాబిస్తున్నారు. ‘వార్ (War)’, ‘పఠాన్’ (Pataan)వరుస హిట్స్ తర్వాత డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన మూవీ ‘ఫైటర్’.

ఇండో పాక్ మధ్య వార్, టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూ చూద్దాం.

Fighter Story : ఫైటర్ స్టోరీ ఇదే?

హృతిక్ రోషన్ (Hrithik Roshan)ఈ మూవీలో పైలట్ పాత్రను పోషించాడు. ప్యాటీ అలియాస్ షంషేర్ పఠానియాగా కనిపిస్తాడు.

తన వృత్తి పైలట్ అయినప్పటికీ ప్యాటీ ఫైటర్ అని భావిస్తాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) మినల్ రాథోర్ పాత్రలో కనిపిస్తుంది.

ప్యాటీతో పాటే మిన్ని ఉంటుంది. సర్తాజ్ గిల్ గా కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover),బషీర్ ఖాన్ గా అక్షయ్ ఒబెరాయ్ (Akshay Oberoi) నటించారు. వీరంతా బెస్ట్ పైలట్స్ టీమ్.

పుల్వామా (Pulvama)లో అటాక్ తర్వాత పాక్ టెర్రరిస్ట్ క్యాంపుపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. ఈ క్రమంలో సర్తాజ్ గిల్, బషీర్ ఖాన్ పాకిస్థాన్ (Pakishthan) ఆర్మీకి చిక్కుతారు.

వాళ్లను ప్రాణాలతో రక్షించి వెనక్కి తీసుకు వచ్చేందుకు భారతీయ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది? ఈ క్రమంలో ప్యాటీని హైదరాబాద్(Hyderabad) ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి ఎందుకు పంపించారు?ప్యాటీ, రాకీ మధ్య ఉన్న గొడవలేంటి? ప్యాటీ, మిన్ని మధ్య ఏం జరిగింది? చివరకు పాక్ చెరలో ఉన్న సర్తాజ్, బషీర్ సురక్షితంగా భారత్ చేరుతారా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Fighter Twitter Review : ఫైటర్ ట్విట్టర్ రివ్యూ

106447930 Fighter Movie Review : 'ఫైటర్' ట్విట్టర్ రివ్యూ… సిద్ధార్థ్ హ్యాట్రిక్ కొట్టాడా?

ఫైటర్ మూవీని డైరెక్టర్ ఎంతో స్మార్ట్ గా రూపొందించారు తరణ్ ఆదర్శ ట్విట్టర్ రివ్యూ (Twitter Review) ఇచ్చారు. సినిమాలోని కొన్ని విజువల్స్ విస్మయానికి గురిచేస్తాయి.

వైమానిక పోరాట భాగాలు, కొన్ని డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయి. సెకెండ్ హాఫ్ ను చాలా అద్భుతంగా తీశారు. మంచి స్క్రీన్ ఎక్సపీరియన్స్ ను అందిస్తుంది.

మరీ ముఖ్యంగా, ఫైటర్ మూవీ మన దేశాన్ని నిస్వార్థంగా కాపాడే ధైర్యవంతులకు రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చిన నివాళి అని తెలిపారు. నిస్సందేహంగా హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఈ మూవీ షో స్టాపర్. తన అద్భుతమైన నటనతో అందరినీ ఫిదా చేశాడు.

ప్రతి సీక్వెన్స్‌లో హృతిక్ పెర్ఫార్మెన్స్ గూస్ బంమ్స్ తెప్పిస్తాయి. హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) తన పాత్రకు న్యాయం చేసింది. కీలకమైన సన్నివేశాల్లో తన నటనతో అలరించింది.

ఆన్-స్క్రీన్ మీద వీరిద్దరి జోడి మూవీకి అదనపు మెరుపునిస్తుందని తెలిపారు తరణ్.

ఇది తప్పక చూడవలసి సినిమా డోంట్ మిస్ అంటూ మూవీ హబ్ రివ్యూ ఇచ్చింది. అంతే కాదు ఫైటర్ మూవీకి 4.5 రేటింగ్ కూడా ఇచ్చింది.

సెకండాఫ్ అద్భుతంగా ఉందని డైరెక్టర్ ఆనంద్ (Siddarth Anand)క్రియేషన్ కి ఫిదా అవుతారని తెలిపారు పఠాన్, వార్ తర్వాత ఫైటర్ తో దర్శకుడు హ్యాట్రిక్ సాధించాడని రివ్యూ ఇచ్చారు.

ఇక నితేష్ నవీన్ ఈ మూవీకి బ్లాక్‌బస్టర్ ఏరియల్ యాక్షనర్ అని మూడు పదాల్లో రివ్యూ ఇచ్చేశాడు. ‘ఫైటర్’ కంటే ముందు సిద్ధార్థ్ ఆనంద్ విడుదల చేసి ‘వార్’, ‘పఠాన్’ సినిమాలు ఇండో – పాక్ & టెర్రరిస్ట్ నేపథ్యంలో తీసిన మూవీలే. ఆ రెండిటిలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి.

ఈసారీ అదే బ్యాక్‌డ్రాప్ తీసుకుని ఫైటర్ తీశాడు. అయితే గతంలో లాగా కాకుండా ఈసారి సిద్ధార్థ్ ఆనంద్ కథ, కథనంలో హ్యూమన్ ఎమోషన్స్ ను జోడించారు. తన మేకింగ్ లో మార్పు చూపించారు.అందుకే ఫైటర్ లో యాక్షన్ కంటే ఎక్కువ డ్రామా కనిపిస్తుందని తెలుస్తోంది.

Hrithik Roshan is perfect in pilot Role : పైలట్ పాత్రలోహృతిక్ రోషన్ పర్ఫెక్ట్

హృతిక్ రోషన్ (Hrithik Roshan)ఈ సినిమాకు షో స్టాపర్ అని రివ్యూ ఇచ్చేశారు. అందుకు తగ్గట్లుగానే ఆయన స్వాగ్ చాలా సీన్స్ ను నిలబెట్టాయి.

పైలట్ పాత్రలో హృతిక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఆయన ‘ప్లీజ్’ అని చెప్పే డైలాగ్ లో ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించారు. స్మైలీ లుక్ కూడా ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.

భావోద్వేగమైన సీన్స్ లో హృతిక్ యాక్టింగ్ అదుర్స్. ప్రతి సీన్ లో హృతిక్ రోషన్ ఆకర్షిస్తారు. హృతిక్ తో పాటు మిగితా నటీనటులు అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. ‘ఫైటర్’ (Fighter) గురించి క్లుప్తంగా చెప్పాలంటే… కమర్షియల్ ప్యాకేజ్డ్ పేట్రియాటిక్ మూవీ.

Hrithik Roshan Fighter Twitter Review

Leave a Comment