Good news for Pawan Kalyan fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్. ఓజీ గురించి తమన్ క్రేజీ అప్డేట్

website 6tvnews template 34 Good news for Pawan Kalyan fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్. ఓజీ గురించి తమన్ క్రేజీ అప్డేట్

Good news for Pawan Kalyan fans: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‏గా చూపిస్తానంటూ ‘సాహో’ (Sahoo)ఫేమ్ డైరెక్టర్ సుజిత్ (Sujith) అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుంచి అందరి దృష్టి ‘ఓజీ’ (OG)పైనే ఉంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీపై జనాల్లో హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకి తగ్గట్లుగానే ‘ఓజీ’ ఉంటుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొదట ఈ మూవీకి తమిళ రాక్ స్టార్ అనిరుధ్ (Anirudh)మ్యూజిక్ అందిస్తారని అనుకున్నారు.

కానీ ఆ లక్కీ ఛాన్స్‎ను తమన్ (Thaman)కొట్టేశాడు. ప్రస్తుతం తమన్ టాలీవుడ్‎లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ యువ మ్యూజిక్ డైరెక్టరక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన చిత్రాలన్నీ మ్యూజిక్ పరంగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

సినీ లవర్స్‎ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తమన్ చేసిన సినిమాల్లోని సీన్ కాస్త వీక్ గా ఉన్నా, ఆయన స్వరపరిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అవి ఎలివేట్ అయ్యాయని చెప్పక తప్పదు. తాజాగా తమన్ గుంటూరు కారం Guntur Kaaram కు మ్యూజిక్ అందించాడు.

ఈ సినిమాలోని కుర్చీ పాట ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించింది. ఇదిలా ఉంటే తమన్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak), వకీల్ సాబ్ (Vakeel Saab)చిత్రాలకు మ్యుూజిక్ అందించాడు. ఈ రెండు సినిమాలకు తమన్ అందించిన బీజీఎంకి అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు మూడోసారి తమన్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీకి’ మ్యూజిక్ ఇస్తున్నాడు. తాజాగా తమన్ ఓజీ గురించ ఓ అప్డేట్ అందించాడు.

Pawan Kalyan will be singing a song in ‘OG’ : ‘ఓజీ’లో పాట పాడనున్న పవన్ కళ్యాణ్

1577430 pawan kalyan og Good news for Pawan Kalyan fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్. ఓజీ గురించి తమన్ క్రేజీ అప్డేట్


ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పవర్ స్టార్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అందుకే సినిమా షూటింగులకు టెంపరరీగా బ్రేక్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)షూటింగ్ లేకపోయినప్పటికీ ఆయనతో సినిమాలు చేస్తున్న మేకర్స్ మాత్రం గ్రౌండ్ వర్క్ చేయడం ఆపడంలేదు. తాజాగా తమన్ (Thaman)’ఓజీ’ (OG)లో పవన్ కళ్యాణ్ తో ఓ పాట పాడించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం ఇప్పటికీ మంచి ట్యూన్‎లను రెడీ చేసి పెట్టాడట.

పవన్ కనుక ఊ అంటే ఓజీలో ఆయన పాటను ఫ్యాన్స్ వినొచ్చు. పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే కాదు. ఆయన మంచి సింగర్ కూడా. అందుకే ఆయనతో పాట పాడించాలని ప్లాన్ చేస్తున్నామని తమన్ తాజాగా తెలిపి పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందించారు.

పవన్ పాట పాడటం ఇది మొదటిసారి కాదు. అప్పట్లో ఆయన నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు'(Thammudu) లో ‘ఏం పిల్ల మాటాడవా’ పాటతో ఇరగదీశాడు. అదే మూవీలో ‘తాటి చెట్టు’ పాట పాడి పిచ్చెక్కించాడు. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘ఖుషి’ (Kushi)సినిమాలో ‘బై బయ్యే బంగారు రవణమ్మ…’, పాటతో పాటు ‘జానీ’ (Jhonny) సినిమాలో ‘నువ్వు సారా తాగకు’, ‘రావోయి మా ఇంటికి’ వంటి పాటలను తనదైన స్టైల్ లో పాడి అలరించారు. ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daredi) సినిమాలోనూ ‘కామటరాయుడు’, ‘అజ్ఞాతవాసి’ (Agnathavasi) లో ‘కొడకా కోటేశ్వర్ రావు’ వంటి జానపద పాటలు పాడి తన ఫ్యాన్స్ ను అలరించారు. మరి ఓజీలో పవన్ కనుక పాట పాడితే అది ఏ లెవెల్ లో ఉంటుందోనని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

Pawan Kalyan ‘OG’ casting : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కాస్టింగ్

100671073 Good news for Pawan Kalyan fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్. ఓజీ గురించి తమన్ క్రేజీ అప్డేట్


డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment ) బ్యానెర్ లో డీవీవీ దానయ్య (Danaiah)’ఓజీ’ మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేతగా నిలిచిన ‘ఆర్ఆర్ఆర్ ‘ (RRR) సినిమా తర్వాత దానయ్య తీస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా ఆయనకు జోడీగా కోలీవుడ్ క్యూట్ హీరోయిన్ ప్రియాంక అరుల్ (Priyanka Arul) కనిపించనుంది.

ఇక ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) కనిపించనున్నాడు. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ (Prakash Raj), వెంకట్ (Venkat), హరీష్ ఉత్తమన్ (Harish Uttaman)లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘Hungry Cheetah’ raised expectations : అంచనాలు పెంచిన ‘హంగ్రీ చీతా’


ఓజీ (OG) నుంచి ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది. ‘హంగ్రీ చీతా’ (Hungry Cheetah)కు తమన్ అదిరిపోయే ట్యూన్ అందించాడు. ఈ వీడియో సినీ లవర్స్, పవన్ ఫ్యాన్స్ లో అంచనాలను భారీగా పెంచేశాయి.

పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ అభిమానులకి పూనకాలు తెప్పించింది. డైరెక్టర్ సుజిత్ (Sujith)పవన్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అంతకుమించి చూపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Leave a Comment