Gunturu karam Ticket Price: స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వాటిలో స్టార్ కాస్ట్ ఏంటి ? డైరెక్టర్ ఎవరు ? ఇలాంటి విషయాల కన్నా టికెట్ ఎంత అని అడగాలి.
ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలను కోట్లు ఖర్చుపెట్టి తీస్తారు, పెట్టిన పెట్టుబడి మొత్తం వారం రోజుల్లోనే రాబట్టుకోవాలి, ఆలా జరగాలంటే ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసుకోవడమే కాదు, సినిమా టికెట్ రేటును కూడా పెంచుకునే వెసులుబాటు ఉండాలి.
ప్రస్తుతం సంక్రాంతికి మహేష్ బాబు(Mahesh Babu) నటించిన గుంటూరు కారం సినిమా విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లో శ్రీ లీల నాయిక, మహేష్ ఊర మాస్ గెటప్ లో కనిపించడమే కాక, డైలాగులు కూడా అదే రేంజ్ లో చెబుతున్నాడు.
తెలంగాణాలో టికెట్ ధర పెంపు పైగా అదనపు షోలు : Ticket Price Hike And Extra Shows In Telangana
అయితే ఈ సినిమా జనవరి 12 వతేదీన విడుదల కానుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యాన్ని అలాగే షోలను కూడా పెంచుకునే వీలును కల్పించింది.
మహేష్ సినిమా గుంటూరు కారం(Gunturu kaaram) కి తెలంగాణ లో సింగల్ స్క్రీన్ లో 65 రూపాయలు పెంచుకోవడానికి మల్టిప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకోవడానికి వీలు కల్పించింది తెలంగాణ సర్కారు(Telangana Government).
ఇక రిలీజైన నాటి నుండి 18వ తేదీ వరకు తెల్లవారుఝామున 4 గంటలకు షో వేసుకునే వీలు కూడా కల్పించింది.
ఆంధ్ర లో ప్రతి టికెట్ పై 50 : 50 Rupees On Every Ticket In Andhra Pradesh
ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో పరిస్థితి చుస్తే జగన్ సర్కారు(jagan Government) ధరల విషయంలో గుంటూరు కారానికి వెసులుబాటు కల్పించింది. అయితే షోలు పెంచుకునే విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది.
టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం 50 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ జీవో ను జారీ చేసింది. హాసిని, హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్(SSThaman) సంగీతాన్ని అందించాడు.
ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) మరో నాయిక. జగపతిబాబు(Jagapathibabu), రమ్యకృష్ణ(Ramyakrishna), ఈశ్వరి రావు(Eswarirao), ప్రకాష్ రాజ్(Prakashraj) కీలక పాత్రలు పోషించారు.