Hanuman Advance Booking collections: సంక్రాంతి పండుగ సినిమాల సందడి మామూలుగా లేదు బడా హీరోల సినిమాలన్నీ ఈ సంక్రాంతికే థియేటర్ల వద్ద సందడి చేయబోతున్నాయి. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న గుంటూరు కారం Guntur Karam తో పాటు యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న హనుమాన్ Hanuman మూవీ కూడా శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. దీంతో తేజ సజ్జా (Tej sajja) సంక్రాంతి బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
టఫ్ కాంపిటీషన్ ఉన్నా మేకర్స్ సినిమాను రిలీజ్ చేసే సాహసం చేస్తున్నారు. ముఖ్యంగా దేశమంతా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ మూడ్‌లో ఉన్న నేపథ్యంలో ఇదే కరెక్ట్ సమయం అని భావిస్తున్నారు. హనుమాన్ మూవీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగలాంటి బడా స్టార్ల సినిమాలు వరుసగా విడుదలకు ఉన్నా హనుమాన్ విడుదల కాబోతోంది.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీ రిలీజ్ కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. జనవరి 12న సినిమా విడుదల కానుండగా జనవరి 11న అంటే గురువారం సాయంత్రం నుంచే ఈ ప్రీమియర్స్ వేయనున్నారు.
ఇకపోతే అడ్వాన్స్ బుకింగ్స్ (Advance Bookings)విషయంలో హనుమాన్ గురువారం ఉదయం నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది గుంటూరు కర్రం కంటే తక్కువే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 2.5 కోట్ల గ్రాస్ దాటింది. ఇక ఒక్క హైదరాబాద్‌లోనే కోటి గ్రాస్ వసూలు చేసింది హనుమాన్. ఏపీ ,తెలంగాణలో 2 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే పెయిడ్ ప్రీమియర్స్ 90 లక్షలు గ్రాస్ వసూలు చేసింది.
Hanuman movie star cast : హనుమాన్ సినిమా స్టార్ కాస్ట్
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘హనుమాన్’ (Hanuman).సోషియోఫాంటసీ స్టోరీతో సూపర్ హీరో మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యంగ్ హీరో తేజ సజ్జ (Tej Sajja)ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఈ మూవీలో హీరోయిన్ గా అమృతా అయ్యర్ (Amrutha ayyar), తేజ సజ్జా అక్క పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalakshmi Sharath Kumar)లతో పాటు వినయ్ రాయ్ (Vinay Roy), సముద్రఖని (Samudrakhani), రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Hanuman movie director: హనుమాన్ దర్శకుడు
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ల కాంబినేషన్ లో ఇప్పటికే ‘జాంబిరెడ్డి’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అదే హిట్ ఫార్ములాతో ఇప్పుడు ‘హనుమాన్’ (Hanuman) ను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఈ డైరెక్టర్ తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి అందిస్తున్న ఫస్ట్ మూవీ హనుమాన్.
ఇదొక్కటే కాదు ఇలాంటివి మొత్తం 12 సినిమాలు తీయనున్నాడట ప్రశాంత్. ఈ సిరీస్ లో ప్రధానంగా దేవుళ్లే సూపర్ హీరోలని ఇదివరకే తెలిపాడు. ఈ సినిమా విజయంపై ఆధారపడి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మిగతా మూవీస్ రానున్నాయి. హనుమాన్ లో టాలెంటెడ్ నటీనటులతో పాటు అదిరిపోయే గ్రాఫిక్స్ జోడించారు డైరెక్టర్.
తనదైన మార్క్ ఈ సినిమాతో చూపించాలన్న కసితో ఉన్నాడు ప్రశాంత్. ఇప్పటికే మూవీకి సంబంధించిన అప్ డేట్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సంక్రాంతి బరిలో ప్రశాంత్ హిట్ కొట్టడం ఖాయంగా తెలుస్తోంది.
Hanuman movie budget : హనుమాన్ మూవీ బడ్జెట్
రూ.60 కోట్ల బడ్జెట్ తో హనుమాన్ మూవీని తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే నాన్ థియేట్రికల్, థియేట్రికల్ రైట్స్ రూపంలో 80 శాతం బడ్జెట్ తిరిగొచ్చేసినట్లు తెలుస్తోంది.
ఇక మూవీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సుమారు 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. మొదటి రోజు సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోవడం ఖాయంగా తెలుస్తోంది.
Hanuman movie release date : హనుమాన్ రిలీజ్ డేట్
ప్రశాంత్ వర్మ (Prashanth Varma), తేజ సజ్జా (Tej Sajja) కాంబోలో వస్తున్న హనుమాన్ (Hanuman) జనవరి 12న విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11 భాషల్లో మూవీ రిలీజ్ కాబోతోంది.
కానీ కొన్ని చోట్ల గురువారం ప్రీమియర్లు పడుతున్నాయి. జనవరి 11న వేస్తోన్న ప్రీమియర్లకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇంకా డిమాండ్ పెరుగుతుండటంతో ప్రీమియర్ షోల సంఖ్య ను మేకర్స్ పెంచుతున్నారు. ఎన్ని షోలు వేసినా కూడా హనుమాన్ టికెట్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.
దీంతో హనుమాన్ క్రేజ్ మామూలుగా లేదని తెలుస్తోంది. ఇదే క్రమంలో నార్త్‌లో కాస్త పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల విషయంలో ఇక తిరుగుండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే బాలీవుడ్ లో హనుమాన్‌కు సరైన పోటీగా ఏ మూవీ లేదు. దీంతో అక్కడి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశం బాగానే ఉంది.