Hanuman Movie Review: తేజ సజ్జా హనుమాన్ ఎలా ఉందంటే?

website 6tvnews template 13 Hanuman Movie Review: తేజ సజ్జా హనుమాన్ ఎలా ఉందంటే?

Hanuman Movie Review: సంక్రాతి బరిలోకి సీనియర్ హీరోలు మహేష్ బాబు(Maheshbabu), వెంకటేష్9Venkatesh), నాగార్జున(Nagarjuna) వంటి అగ్రతారలు వస్తున్నప్పటికీ తమ సినిమా కథ పై ఉన్న నమ్మకంతోనే కుర్ర హీరో తేజ సజ్జ(TejaSajja) నటించిన హనుమాన్ ను ప్రొడ్యూసర్ సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఈ సినిమాను ప్రశాంత్ వర్మ(Prasanth Varma) డైరెక్ట్ చేశాడు. తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఇంతకు మునుపు జాంబీ రెడ్డి(Jombi Reddy) వచ్చి ఆడియన్స్ ను అలరించింది.

దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో ఒక హైప్ క్రియేట్ అయింది. పైగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్లు, ట్రైలర్లు, అందులో వాడిన వైఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ అన్ని కూడా మూవీ పై క్రియేటైంది హైప్ ను పీక్స్ కి తీసుకెళ్లాయి.

మరి జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందా లేదా అని చూద్దాం.

Also read : Hanuman Movie Ticket price

Hanuman Movie Full cast & crew: హనుమాన్ టీమ్ మెంబర్:

ముఖ్య తారాగణంతేజ సజ్జా(TejaSajja),
అమృత అయ్యర్‌9Amrutha Aiyar),
వరలక్ష్మీ శరత్‌కుమార్‌(Varalakshmi Sarath Kumar),
వినయ్‌ రాయ్‌(Vinay Rai),
రాజ్‌ దీపక్‌ శెట్టి(Raj Deepak Setty),
వెన్నెల కిషోర్‌(Vennela Kishor),
సత్య(Satya),
గెటప్‌ శ్రీను(Getup Srinu)
తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
నిర్మాతనిరంజన్‌రెడ్డి(NiranjanReddy)
సంగీతంఅనుదీప్‌ దేవ్‌(Anudeep Dev),
గౌరా హరి(Gowra hari),
కృష్ణ సౌరభ్‌(Krishna Sowrabh)
దర్శకత్వంప్రశాంత్‌ వర్మ(Prashanth Varma)
కెమెరాదాశరథి శివేంద్ర(Dasharadhi sivendra)

కథ ఏంటంటే : Hanuman Movie Full Story:

Hanuman 1 Hanuman Movie Review: తేజ సజ్జా హనుమాన్ ఎలా ఉందంటే?

అంజనాద్రి అనే ఊరిలో హనుమంతు అనే కుర్రాడు ఉంటాడు, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే తన అక్కే అంజమ్మ పెంచుతుంది. హనుమంతు పాత్రలో హీరో తేజ సజ్జ(TejaSajja) కనిపిస్తాడు.

(Hanuman movie Review)హనుమంతు అక్కగా వరలక్ష్మి శరత్ కుమార్(Vara lakshmi Sarath Kumar) నటించింది. అయితే అంజనాద్రిలో ఒక పాలెగాడు గజపతి ఉంటాడు. ఊరిలో ఎవరైనా అతడిని ఎదిరిస్తే కుస్తీపోటీ పెట్టి వారిని అంతం చేస్తాడు.

పాలెగాడి పాత్రను దీపక్ శెట్టి(Deepak Shetty) పోషించాడు. ఇక హనుమంతుకి మీనాక్షి అంటే ప్రాణం, కానీ మీనాక్షి(Amruta Aiyar) ఒక రోజు గజపతి ఎదిరిస్తుంది. దీంతో గజపతి తన ముఠా తోకలిసి ఆమె పై దాడి చేస్తాడు. మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు బాగా గాయపడతాడు. గాయపడిన హనుమంతును బందిపోటు ముఠా నీళ్లలో పడేస్తుంది.

అక్కడ నీళ్లలో ఆంజనేయస్వామి రక్తం తో తయారైన రుధిరమణి హనుమంతు కంటపడింది. ఆ మణి హనుమంతు చేతికి రావడంతో అతడు హనుమ్యాన్ గా మారిపోతాడు. ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే ఈ సినిమా లో వినయ్ రాయ్(Vinay Rai) మనకి మైఖేల్ పాత్రలో కనిపిస్తాడు. సూపర్ హీరో కావాలన్నది అతని డ్రీమ్. అందుకు అండ్డొచ్చిన అతని పేరెంట్స్ ను కూడా చిన్నతనంలోనే చంపేస్తాడు.

అప్పటి నుండి సూపర్ హీరో అవ్వడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. అయితే మైఖేల్ అంజనాద్రికి ఎలా వచ్చాడు ?, హనుమంతు దగ్గరున్న రుధిరమణి ని దక్కించుకోవడానికి ఎం చేశాడు? అంజనాద్రికి వచ్చిన ముప్పు ఏంటి ? దానిని హనుమంతు ఎలా తొలగించాడు ? ఆపద తొలగించేందుకు విభీషణుడు ఎలా సహాయం చేశాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే : How The Hanuman Movie Is:

Hanu Man Telugu Movie Box Office Hit or Flop Hanuman Movie Review: తేజ సజ్జా హనుమాన్ ఎలా ఉందంటే?

ఒక సామాన్యుడికి, అల్పుడికి దైవశక్తులు వస్తే వాటిని అతడు ఎలా ఉపయోగించుకున్నాడు, విలన్లు ఆ పవర్ ని దక్కించుకోవడానికి ఎం చేశాయి, ప్రజల ప్రాణాలకు ముప్పు తపట్టినప్పడు హీరో ఎలా వారిని కాపాడాడు, ఫైనల్ గా హీరో, విలన్ కి ఎలా బుద్ధి చెప్పాడు, అనే స్టోరీ లైన్ తో టాలీవుడ్(Tollywood)Hanuman Movie Review, బాలీవుడ్(Bollywood) లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.

ఈ సినిమా కూడా అదే స్టోరీ లైన్. కానీ డైరెక్టర్ దీనిని చాలా తెలివిగా మన పురాణాల్లో సూపర్ హీరో అయినా హనుమంతుడికి(Lord Hanuma) లింక్ చేశాడు. మన తెలుగు నేటివిటీ ని టచ్ చేస్తూ ఈ సినిమాను చాల చక్కగా మలిచాడు. పైగా సూపర్ హీరో, సూపర్ నాచురల్ పవర్ అంటే చిన్నపిల్లలు కూడా ఈ తరహా సినిమాలను ఇష్టంగా చూస్తారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని డైరెక్టర్ చాలా చక్కగా మలుచుకున్నారు. ఒక సామాన్యుడికి రుధిరమణి దొరకడం తో జరిగే అద్భుతాలను చాల చక్కగా తెరపై చూపెట్టాడు.

ఆ మణిని దక్కించుకోవడం కోసం విలన్ అంజనాద్రి కి అంజనాద్రి ప్రజలకు హాని తలపెట్టినప్పుడు వారిని కాపాడేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినా, హీరోకి సూపర్ పవర్స్ వచ్చాక మాత్రం కథ పరుగులు పెడుతుంది. పైగా సినిమా లోని చివరి 20 నిముషాలు సినిమాకే హైలైట్ అని చెప్పాలి.

ఎవరు ఎలా చేసారో చూద్దాం : How Actors Performed:


సామాన్య ఆకతాయి కుర్రాడిగా ఉన్నపుడు ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయిన తేజ(Teja Sajja), సూపర్ పవర్స్ వచ్చాక ఆ క్యారెక్టర్ లోకి ఇమిడిపోయి సందడి చేశాడు. యాక్షన్ సన్నివేశాలు, సెంటిమెంట్ సీన్లు, అన్నిటిలోను చక్కగా అలరించాడు.

పల్లటూరు అమ్మాయిగా హీరోయిన్ కనిపించినా, హీరోకి హీరోయిన్ కి మధ్య అంత రొమాంటిక్ సీన్లు, ప్రేమ సన్నివేశాలు ఏమి ఉండవు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పటిమాదిరిగానే తన క్యారెక్టర్ తో చక్కగా ఆకట్టుకుంది. అలానే విలన్ చాల స్టైలిష్ గా కనిపిస్తాడు(Hanuman Movie Review).

గెటప్‌ శ్రీను(GetupSrinu), సత్య, వెన్నెల కిషోర్(Vennela Kishore), రాకేష్‌ మాస్టర్‌(Rakesh Master) వంటి వారు ప్రేక్షకులను నవ్వించారు. హీరో చుస్తే అప్ కమింగ్ హీరో కాబట్టి పరిమిత బడ్జెట్ తో నే చక్కగా గ్రాఫిక్స్ ను డిజైన్ చేసుకుని ఆకట్టుకున్నాడు డైరెక్టర్. ఎక్కడ నేలవిడిచి సాము చేయలేదు.

ఇక ఈ సినిమాకి ముగ్గురు సంగీత దర్శకులు పని చేయడం విశేషం. వారి మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయిందని చెప్పాలి. ఇక ఇలాంటి సినిమాలకు సినిమాటో గ్రఫీ ప్రధాన బలం. దాశరధి తన కెమెరా పనితనాన్ని చక్కగా చూపెట్టాడు.

Hanuman Movie Trailer :

Leave a Comment