ISRO Captured Ram mandir photo from space : ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ నామ స్మరణే వినిపిస్తోంది, శ్రీరామా నీ నామమెంతో మధురం అని జనులంతా వేనోళ్ళ కీర్తిస్తున్నారు.
అయితే రామ నామ జపం ఇస్రో కి కూడా పాకింది. అందుకే ఇస్రో ISRO శాస్త్రవేత్తలు శాటిలైట్ ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ఫోటోలు తీసి పంపించారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫొటోల్లో రామ మందిరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఇస్రో ఈ ఫోటోలను ఇండియన్ రిమోట్ సెన్సింగ్ (Indian Remote Sensing) అనే టెక్నాలజీని వినియోగించి తీసింది.
డిసెంబర్ తరవాత ఇప్పుడే : After December Again Now
ఇస్రో(ISRO) రామ మందిర ఫోటోలను తీయడం ఇది కొత్తేమి కాదు, డిసెంబర్ నెలలో కూడా రామ మందిరం నిర్మాణ దశలో ఉండగా ఫోటోలు తీసింది.
కానీ అప్పటి నుండి ఇప్పటివరకు మరో సారి ఫోటోలు తీయలేకపోవడానికి ముఖ్య కారణం మంచు. దట్టమైన మంచు కమ్మేయడం వాల్ల రెండవసారి ఫోటోలు తీయలేకపోయింది. కానీ నివాతావరణం అనుకూలించడం వల్ల ఇప్పుడు మరో మారు ఫోటో తీసింది.
ఈ ఫొటోలో 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయం మనకి అగుపిస్తుంది. ఇక ఈ ఫొటోలో రామ మందిరం తో పాటు దశరథ్ మహల్(Dasaradh Mahal) అలాగే మందిరానికి సమీపంలో ప్రవహించే సరయు నది (Sarayu River) కూడా గోచరిస్తుంది.
ఇక ఈ ఫోటోను హైదరాబాద్(Hyderabad) లో గల నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(National Remote Sensing Center) ప్రాసెస్ చేసినట్టు చెబుతున్నారు.
ఇస్రో సహకారం మొదటినుండి : ISRO Helping From Beginning
ఇస్రో కేవలం అంతరిక్షం నుండి ఫోటోలు తీయడానికి మాత్రమే కాదు, రామ్ లల్లా Ram lalla విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్టించాలో కూడా తెలియజెప్పింది.
బాల రాముడి విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్టించాలి అన్న మీమాంశ కొనసాగుతున్న సమయంలో ఇస్రో టెక్నాలజీ సహకారాన్ని అందిపుచ్చుకుని సరైన స్థానాన్ని ఎంచుకున్నారు.
navigation with Indian Constellation సహకారం తో రామచంద్రుడు సరిగ్గా ఎక్కడైతే జన్మించాడో అదే ప్రదేశాన్ని గుర్తించి బాల రాముడి విగ్రహాన్ని కూడా అక్కడే ప్రతిష్టించారు.