Prabhas donated 50 crores to ayodhya ram mandir?: సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. కొంత మంది ప్రభాస్‌ను ట్రోల్స్ చేస్తుంటే మరికొంత మంది ఆయనపై అభిమానం చూపిస్తుంటారు. పాజిటివ్ గానో లేదా నెగిటివ్ గానో ఏదో ఒక చర్చ డార్లింగ్ పై జరుగుతూనే ఉంటుంది.
లేటెస్టుగా నెట్టింట్లో ప్రభాస్ అయోధ్య రాములోరి ఆలయానికి భారీ డొనేషన్ ఇచ్చాడన్న వార్త వైరల్ అవుతోంది. అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌కు ప్రభాస్ 50 కోట్ల విరాళం ఇచ్చాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి ప్రభాస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఏపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడంతా ‘డార్లింగ్’ గురించే తెగ మాట్లాడుకుంటున్నారు.
ఎందుకుంటే ఈ విరాళం గురించి ప్రభాస్ కానీ ఆయన టీం కానీ ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన విరాళం ఇచ్చినట్లు అధికారిక ప్రకటన లేదు. దీంతో డార్లింగ్ విరాళం ఇచ్చాడా? లేదా? అన్నది ఇప్పుడు అందరిలో నెలకొన్న డౌట్. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ టీమ్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. అసలు విషయం బయటపడింది.
MLA’s Chirla Jaggireddy comments viral : ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్ వైరల్
జనవరి 22న దేశం మొత్తం ఎంతో భక్తి పారవశ్యంతో ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ దైవిక కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ లతో పాటు ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు.
అదే విధంగా ఆలయ ట్రస్ట్ ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు 7 వేల మందికి పైగా ఆహ్వానాలను పంపించింది. సినీ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికే ఈ దైవ కార్యక్రమానికి ఆహ్వానాలు అందాయి.
ఈ క్రమంలో రామ మందిరానికి టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ భారీ విరాళం అందించారని గత కొంత కాలంగా నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కోనమసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో భాగంగా అక్కడికి వచ్చే భక్తులకు భోజనం ఖర్చులను ప్రభాస్ పెట్టుకుంటున్నారని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో పలు మీడియా సంస్థల్లోనూ ఇదే న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఈ రూమర్ నేపథ్యంలో ప్రభాస్ టీమ్ ను సంప్రదించగా ఇందులో ఎలాంటి వాస్తవం లేదని హీరో టీం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఫేక్ న్యూస్ అని తేల్చేసింది.
Prabhas did’t receive the invitation : ప్రభాస్‌కు అందని ఆహ్వానం
ఎంతో వైభవంగా జరిగే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. దక్షిణాది ప్రముఖ హీరోలకు రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, ధనుష్‌లతో పాటు కొందరు సెలబ్రిటీలకు రామ మందిరం నుంచి ఆహ్వానం అందింది.
Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రతిష్టాపనకు ప్రభాస్ కి ఆహ్వానం.
అయితే ఈ లిస్టులో మాత్రం ప్రభాస్ పేరు లేకపోవడంతో గమనార్హం. తమ అభిమాన నటుడి పేరు లేకపోవడంతో అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది. చివరివరకైనా ప్రభాస్‌కు ఆహ్వానం అందుతుందో లేదో చూడాలి.
Kalki will be Released on summer : సమ్మర్ కానుకగా రాబోతోన్న కల్కీ
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సాలార్ మూవీ హిట్ తో ప్రభాస్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మూవీ చేయనున్నాడు ప్రభాస్, అలాగే నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు.
Also read: Kalki Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, కల్కీ రిలీజ్ అప్పుడే
తాజాగా మారుతి ‘రాజా సాబ్’ నుంచి ఫస్ట్‌లుక్ ను రిలీజ్ చేశాడు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ హారర్ అండ్ కామెడీ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న కల్కి AD 2898 మూవీ సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది.