Prime Minister Modi celebrated Diwali with soldiers : జవాన్లతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ.ఆర్మీ డ్రస్ లో సైనికులతో కలిసిపోయిన మోదీ..
జై జవాన్ జై కిసాన్ అన్నది మన నినాదం. ఈ దేశం సమర్ధవంతంగా ముందుకి నడిచేందుకు వీరిద్దరి అవసరం ఎక్కువ అన్నది కాదని లేని విషయం. వీరిలో ఆకలి తీర్చేవారు ఒకరైతే అవతలి దేశం నుండి మన దేశాన్ని రక్షించే వారు మరొకరు. కనుక వీరిద్దరికి మనదేశం లో ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో ఉండే జవాన్లు దేశ రక్షణ కోసం తమ ప్రాణాన్ని కూడా పణంగా పెడుతుంటారు. తమ తమ కుటుంబాలను విడిచి పెట్టి మంచును, ఎండను, వానను లెక్కచేయకుండా పహారా కాస్తుంటారు. వీరికి పండుగలు పబ్బాలు కూడా ఉండవు. అందుకే దేశ ప్రధాని అయిన మొదటి సంవత్సరం నుండి నరేంద్ర మోదీ జవాన్లతోనే దీపావళి పండుగను నిర్వహించుకుంటున్నారు.
2014 వ సంవత్సరం నుండి ఒక్కో ఏడాది ఒక్కో సరిహద్దు ప్రాంత సైనికులతో పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అయన ఈ ఏడాది చైనా కి సరిహద్దులో ఉన్న భారత భూ భాగం లెప్చా ఏరియాలోని సైనికులతో పండుగ చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ప్రాంతానికి మోదీ ఉదయాన్నే చేరుకున్నారు. చైనా బార్డర్ కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం అత్యంత కీలకమైన ప్రాంతం గా చెప్పబడుతుంది.
ఆర్మీ యూనిఫాం ధరించిన మోదీ సైనికులతో కలిసిపోయారు. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు మోదీ.