Salaar Telugu Trailer: సలార్ థియేట్రికల్ ట్రైలర్.. Trailer లో అదిరిపోయే ట్విస్ట్.
Salaar Telugu Trailer: బాహుబలి సినిమా Prabhas ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అయితే ఆ సినిమా తరువాత సరైన హిట్టు కోసం Prabhas ఎంత ఎదురు చూస్తున్నాడో ఏమో కానీ Prabhas ఫాన్స్ మాత్రం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
డార్లింగ్ ఫాన్స్ నీరిక్షణ ఫలించే రోజు వచ్చేస్తోందేమో అని అనిపిస్తోంది సలార్ సీజ్ ఫైర్ Trailer చూస్తుంటే. డిసెంబర్ 22 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కి సంబంధించి చిత్ర యూనిట్ Trailer ను వదిలింది.
ఇప్పటికే రిలీజ్ కావలసిన ఈ Trailer అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి థియేట్రికల్ Trailer ఆడియన్స్ ముందుకి వచ్చేసింది.
ఈ Trailer Prabhas ఫాన్స్ ను మాత్రమే కాదు సాధారణ సినీ అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ ను బట్టి చుస్తే, Salaar అనే సినిమా ‘ఖాన్సార్’ అనే కాల్పనిక నగరం నేపథ్యంలో సాగినట్టు తెలుస్తోంది.
Salaar సీజ్ ఫైర్ Trailer ఇంకా ఇప్పటి వరకు వచ్చిన అప్ డేట్స్ ను బట్టి చుస్తే ఈ సినిమాలో హింసాత్మక దృశ్యాలు, రక్తపాతం, తారాస్థాయిలో ఉంటుందన్న విషయం తేటతెల్లం అయిపోతోంది.
Salaar సినిమా మాత్రమే చుస్తే ఇది అత్యంత దారుణమైన హింసగా అనిపిస్తుంది కానీ, Prashanth Neel, director of Salaar – హీరో యష్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలు చుసిన వారికి ఇదేమంత కొత్తగా అనిపించదు.
అయితే యష్ కన్నా Prabhas కి తెలుగు, హిందీ లో ఫాన్స్ ఫాలోంగ్ అధికంగా ఉంటుంది, పైగా Prashanth Neel కన్నడ దర్శకుడు కాబట్టి అక్కడ కూడా Salaar సినిమాకు మంచి ఆదరణే ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అంచనాలు కూడా అందుకు తగ్గితే ఉంటాయి.
మరి ఇప్పుడు తాజాగా రిలీజైన Salaar సీజ్ ఫైర్ Trailer చూస్తే Prabhas క్యారెక్టర్ చుస్తే ఫాన్స్ కి ఆడియన్స్ కి ఒక విషయంలో మాత్రం కాస్త క్లారిటీ వచ్చింది.
ఈ సినిమాలో ఇందులో ఒక మెకానిక్ గా కనిపించబోతున్నాడు అని అర్ధమైంది. ఈ Trailer లో కొందరు Prabhas కి రెంచీలు తిప్పడమే వచ్చని తుపాకీ కాల్చడం రాదనీ అంటారు.
గన్ ఫైరింగ్ అంత తేలికైన పని కాదని ఎగతాళి చేస్తుంటారు. అయితే తనకు రెండిం తిప్పడంతోపాటు తుపాకీ కాల్చడం, కత్తులను వాయువేగంతో తిప్పడం,
వీరోచితంగా పోరాడటం కూడా వచ్చని వారు తెలుసుకునేలా చేస్తాడు. Prabhas లోని హీరోయిజాన్నిDirector Prashanth Neel చాలా చక్కగా హైలైట్ చేశాడు ఆ సీన్ లో.
ఈ Trailer ఆధ్యంతం హీరో Prabhas పృథ్వి రాజ్ సుకుమారన్ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడని క్యారెక్టర్ అన్నట్టు చూపెడతారు. కానీ Trailer ఎండింగ్ లో మాత్రం ఒక ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్.
ఇద్దరు ప్రాణస్నేహితులు బద్ధశత్రువులుగా ఖాన్సార్ కథ మారిపోయిందని ఒక బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. ఈ ఒక్క మాటతో ఈ చిత్రంపై ఆసక్తి పెంచేశారు.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని బాహుబలి మొదటి పార్టీ రిలీజ్ అయినప్పుడు వేసిన ప్రశ్న మాదిరిగా ఇది కూడా ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా ఎలా మారారు అన్నది ఆశక్తిని పెంచేసింది.
Prabhas, శ్రుతిహాసన్ ఈ సినిమా కోసం మొదటిసారిగా జోడి కట్టారు. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి A సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఇందులో అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయని A సర్టిఫికెట్ ఇవ్వలేదట.
ఈ సినిమాలో హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి A సర్టిఫికెట్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత విజయ్ కిర్గందుర్ వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో జగపతి బాబు, టినూ ఆనంద్, ఈశ్వరీరావు, శ్రియా రెడ్డి, గరుడ రామ్ వంటి ప్రఖ్యాత నటులు, ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.