2022-06-04News Desk కాన్పూర్ లో సెక్యూరిటీ టైట్ చేశారు. ఘర్షణలు చెలరేగిన సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు. ఇప్పటివరకు 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. టీవీ డిబేట్ లో ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇరువర్గాల మధ్య ఘర్షణలకు కారణమయ్యాయి. View more
2022-06-03News Desk ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి టెన్షన్ తీరింది. చంపావత్ ఉప ఎన్నికలో ఆయన ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. 54 వేల ఓట్లకు పైగా మెజార్టీతో సీఎం విజయం సాధించారు. View more
2022-06-03News Desk అన్ని పార్టీలది ఒకదారి అయితే ఏపీ బీజేపీది మరోదారి.బై పోల్స్ లో ఓటమి తప్పదని తెలిసినా తగ్గేదేలే అంటోంది. బద్వేలు టు తిరుపతి ఉప ఎన్నిక దాకా అదే జరిగింది. అయినా ఆత్మకూరు బై పోల్ లో సవారీకి సై అంటోంది. అంతా కేడర్ ఉన్న చంద్రబాబుయే తగ్గారు. మరి సోమువీర్రాజు స్ట్రాటజీ ఏంటో.. View more
2022-06-03News Desk నరేంద్ర మోడీ సర్కారు దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకేలా చూస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఏ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమను చూపించడంలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతు ఇచ్చిన బీజేపీ.. అభివృద్ధికి కూడా అంతే సపోర్టు చేస్తుందన్నారు. View more
2022-06-03News Desk తెలంగాణలో అధికారంలోకి ఈసారి రావడం ఖాయమని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలే దీనికి నిదర్శనం. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను అమిత్ షా ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో అధికారంలో వచ్చి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేశారు. View more
2022-06-02News Desk గత ఎనిమిదేళ్ల కాలంగా ప్రతియేటా జరుపుకుంటూ వస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఈ ఏడాది ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రతియేటా ఈ వేడుకలను జరపడం సర్వసాధారణం కాగా, ఈసారి ఢిల్లీలో బీజేపీ సర్కార్ అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించడం విశేషం. ఢిల్లీలో సాయంత్రం అత్యంత వైభవంగా ఈ వేడుకలను డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహించనున్నారు. View more
2022-06-02News Desk ఈ నెల 10 న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాజస్థాన్ కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ఉదయ్ పూర్ లోని లగ్జరీ హోటల్ కి తరలించడం ప్రారంభించింది. పాలక కాంగ్రెస్ కి మద్దతునిస్తున్న ఇండిపెండెంట్ సభ్యులు, ఇతర పార్టీలవారు కూడా వీరిలో ఉన్నారు. View more
2022-06-02News Desk కులగణనపై త్వరలో రాష్ట్ర వ్యాప్త సర్వే చేపడతామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. పాట్నాలో నిన్న నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన.. అన్ని మతాలు, కులాలు, ఆయా వర్గాల ఆర్ధిక పరిస్థితులపై ఈ సర్వే జరుగుతుందని చెప్పారు. View more
2022-06-01News Desk చాలా కాలంగా సౌత్ తో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీకి.. కర్నాటక మినహా మరే రాష్ట్రంలోనూ పెద్దగా పట్టు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయమైన బలాన్ని పెంచుకునేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటుంది. అందులో భాగంగానే త్వరలో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను వేదికగా మార్చుకుంది. View more
2022-06-01News Desk కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎప్పుడో పాతకాలం నాటి నేషనల్ హెరాల్డ్ కేసులో వీరికి వీటిని జారీ చేశారు. జూన్ 8 న సోనియా, జూన్ 2 న రాహుల్ తమ ముందు హాజరు కావాలని వీటిలో పేర్కొన్నారు. అయితే తాను విదేశాల్లో ఉన్నందున తనకు మరికొంత వ్యవధి కావాలని రాహుల్ గాంధీ కోరారని పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా తెలిపారు. View more
2022-06-01News Desk ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి.. బిజెపి యేతర ప్రత్యామ్నాయ శక్తులను ఏకం చేసే పనిలో కేసీఆర్ చురుకు గా వ్యవహరిస్తున్నారు. ఇంతకాలం దీనిని తేలికగా తీసుకున్నా, ఇప్పుడిప్పుడే భారతీయ జనతా పార్టీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే గత ఎనిమిది ఏళ్ళ కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అధికారికంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. View more
2022-05-31News Desk పశ్చిమ బెంగాల్ లోని కానింగ్ వెస్ట్ టిఎంసి ఎమ్మెల్యే పరేష్ రామ్ దాస్ ను హత్య చేసేందుకు కుట్ర చేశాడన్న ఆరోపణపై చిరంజిత్ హల్దార్ అలియాస్ చిరన్ అనే నేరస్థుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy