e-KYC for Ration card holders: రేషన్ కార్డు హోల్డర్స్ కి అలర్ట్ ఆధార్ కేద్రాలకి పరుగులు.

Alert to ration card holders and runs to Aadhaar centers.

Big Alert for Ration card holders: తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో ముఖ్యమైనది ఆరు గ్యారంటీలు, ఈ హామీని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు(CM Revanth Reddy) శరవేగంగా అడుగులు వేస్తోంది.

ఈ కార్యచరణ కోసం తెలంగాణ సర్కారు వందరోజులను టార్గెట్ గా పెట్టుకుంది. అధికారాన్ని చేపట్టిన రెండు రోజుల వ్యవధిలోనే ఆరింటిలో రెండు గ్యారంటీలను రేవంత్ ప్రభుత్వం అమలు చేసింది.

Also read: Ration card Application: తెలంగాణ లో రేషన్ కార్డు లొల్లి..పథకాలకు రేషన్ తప్పనిసరి.

మిలిగిన నాలుగు గ్యారంటీల అమలును దృష్టి లో పెట్టుకుని ‘ప్రజాపాలన’(Prajapalana) ను తెరపైకి తెచ్చింది. ఈ హామీల అమలు కోసం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించింది.

ఇది ఇలా కొనసాగుతుండగా. రేషన్ కార్డు(Ration Card) ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు.

ఆధార్ అప్డేషన్ తప్పనిసరి : Aadhaar updation is mandatory

రేషన్ కార్డుల కోసం ఈ-కేవైసీ(E KYC) చేసుకోవాలని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిచేసుకోవడానికి ప్రజలకు 2024 జనవరి 31వ తేదీ వరకు గడువు ను ఇచ్చారు.

రేషన్ కార్డు లేదంటే ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతీ సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.

దీని కోసం లబ్ధిదారులు సమీప రేషన్ డీలర్(Ration Dealer) వద్ద మాత్రమే ఈ పాస్ మెషీన్(E Pass Machine) ద్వారా వేలి ముద్రలు ఇవ్వాలని తెలిపారు.

అయితే ఇక్కడ మరొక చిక్కొచ్చిపడింది. ఆధార్ అప్‌డేషన్ చేసుకోని వారు ఎవరైతే ఉంటారో వారి రేషన్ కార్డు ఈ-కేవైసీలు త్వరలోనే నిలిచిపోతాయని హెచ్చరించారు.

దీంతో ఎవరైతే ఆధార్ ను అప్డేట్ చేసుకోలేదో వారంతా ఆధార్ కేంద్రాలకు 9 Adhar Centers పరుగులు పెడుతున్నారు.

Leave a Comment