PrajaPalana website: ప్రజాపాలన వెబ్ సైట్ లాంచ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy will launch the Prajapalana website.

CM Revanth Reddy launch Praja Palana websit: సీఎం రేవంత్ చేతుల మీదుగా వెబ్ సైట్ లాంచ్
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఎన్నికలకి ముందు బాగా వినిపించిన మాట ఆరు గ్యారంటీలు,

ఈ నినాదంతోనే తెలంగాణ కాంగ్రెస్(Congress) ప్రజల్లోకి వెళ్ళింది. ఈ నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో అధికారాన్ని కైవశం చేసుకుంది.

కాబట్టి ఈ ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023 డిసెంబర్ 28వ తేదీ నుండి 2024 జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన9Prajapalana)

కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామగ్రాలలో అలాగే పట్టణాల్లోని వార్డుల్లో కూడా ప్రజాపాలనను చేపట్టారు.

Also read: Asara pension: పెరగని ఆసరా – వివరణ ఇచ్చిన కాంగ్రెస్

ఇక ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. కాగా ఈ కార్యక్రమం యొక్క ఫ్యూచర్ ప్లాన్ పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సమావేశం నిర్వహించనున్నారు,

ఈ సమావేశంలో మంత్రులు(Ministers) ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఇందులో భాగంగా ప్రజాపాలన కోసం Prajapalana.telangaana.gov.in పేరిట ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ ను లాంచ్ చేయనున్నారు.

ఎక్కువ దరఖాస్తులు వచ్చింది ఏ జిల్లాలో తెలుసా : Do you know from which district more applications received ?

రాష్ట్ర వ్యాప్తంగా గడువు తేదీ లోగా వచ్చిన దరఖాస్తులను చూసి అధికారులు విస్తుపోయారు. ఊహించిన దానికన్నా ప్రజలనుండి అధికసంఖ్యలో దరఖాస్తులు రావడంతో అవాక్కయ్యారు.

డిసెంబర్ 28 నుండి జనవరి 6వతేదీ లోపు చేపట్టిన ఈ ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమానికి మధ్యలో నూతనసంవత్సరం కారణంగా సెలవు దినాలు వచ్చినప్పటికీ మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,24,85,383 కి చేరుకుంది.

dtrdtr 1 PrajaPalana website: ప్రజాపాలన వెబ్ సైట్ లాంచ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.

ఈ మొత్తం దరఖాస్తుల్లో రేషన్ కార్డు(Ration Card) అలాగే ఇతర అంశాల కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య 19,92,747 గా ఉంది. ఇక ఈ ప్రజా పాలనా కార్యక్రమాన్ని

16,392 గ్రామ పంచాయితీలు, 710 వార్డుల్లో నిర్వహించినట్టు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే, అత్యధికంగా దరఖాస్తులు అందిన జిల్లాల్లో రంగారెడ్డి(Rangareddy), మేడ్చల్ మల్కాజ్ గిరి(Medchal Malkajgiri) జిల్లాలు ఉన్నాయి.

రంగారెడ్డి నుండి 10.2 లక్షలు, మేడ్చల్ మల్కాజ్ గిరి నుండి 9.2 లక్షల దరఖాస్తులు అందాయి. ఇక తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాలు చూసుకుంటే, ములుగు(Mulugu)

జిల్లా 1.10 లక్షలు, జయశంకర్ భూపాలపల్లి(Jayasankar Bhupalapalli) జిల్లా 1.46 లక్షలు, కుమురం భీం ఆసిఫాబాద్(Komaram Bheem Asifabad) జిల్లా 1.82 లక్షలు అందాయి.

ప్రజల నుండి అందిన దరఖాస్తులలోని డేటా మొత్తాన్ని ఈనెల 17వ తేదీలోగా కంప్యూటరైజ్ చేస్తారు. ఆధార్ కార్డు(Adhar Card), రేషన్ కార్డు నెంబర్ల ఆధారంగా నిజమైన లబ్దిదారులను ఎంపిక చేస్తారు.

ఆలా ఎంపిక చేసిన లబ్దిదారులకు సంక్షేమ పధకాలను అమలు చేయాలంటే ఎంత మేర నిధులు అవసరం అవుతాయి అన్నదానిపై ఒక అంచనా వేస్తారు.

ఏయే అంశాలపై చర్చిస్తారంటే :

నేటి సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు, అలాగే రాష్ట్రానికి అవసరమున్న అభివృద్ధి పనులు కొనసాగించేందుకు అప్పుల ఎలా సమీకరించుకోవాలి అనే అంశాలను ప్రస్తావించనున్నారు.

CM Sri A. Revanth Reddy Deputy CM Sri Bhatti Vikramarka and Ministers unveiled the Prajapalana logo and application 27 12 2023 7 PrajaPalana website: ప్రజాపాలన వెబ్ సైట్ లాంచ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.

వీటితోపాటుగా ఎన్నికల హామీల్లో ప్రస్తావించిన రైతుబంధు(Raithu Bandhu) నిధుల విడుదల, పింఛన్ ను 4వేలకు పెంచడం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తూ,

500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, పధకాల అమలు పై చర్చిస్తారు. కేవలం సంక్షేమ పధకాల అమలు విషయమే కాకుండా, అవినీతి ప్రక్షాళన అంశాలను సృశించనున్నారు.

వాటిలో ప్రధానమైనవి టిఎస్పిఎస్సీ(TSPSC) ని ప్రక్షాళించడం ఎలా అనేది ఒకటైతే, కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) పై న్యాయ విచారణ జరిపించడం మొరొకటి.

Leave a Comment