Ration card Application: తెలంగాణ లో రేషన్ కార్డు లొల్లి..పథకాలకు రేషన్ తప్పనిసరి.

Ration card rollout in Telangana.. Ration is mandatory for schemes.

Ration card Application: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఎన్నికల ప్రచార సమయంలో ప్రముఖంగా వినిపించిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో కసరత్తు చేస్తున్నారు. ఈ హామీల అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్న రేవంత్ సర్కారు

(Revanth Reddy Cabinet) ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుండి పట్టణాల్లోని వార్డుల వరకు ప్రజాపాలన పేరిట కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన(Prajapalana) కేంద్రాలలో అర్హత ఉన్న లబ్ధిదారులు హామీల కోసం అప్లికేషన్లు పూర్తి చేసి సమర్పించాలి.

Read also: Telangana New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీపై అప్డేట్.. ఈ 28 నెల నుంచి దరఖాస్తుల స్వీకరణ!

అయితే ఇక్కడే అసలు మతలబు ఉంది. సాధారణంగా సంక్షేమ పధకాలను పేద ప్రజలకు అందిస్తారు. వారికి చేయూత అందించేందుకు ఆహార ధాన్యాల నుండి నిత్యావసరమైన వైద్యం, విద్య వంటివి అందిస్తారు.

కాబట్టి పేద ప్రజలను గుర్తించి వారికి సంక్షేమ ఫలాలను అందించాలంటే రేషన్ కార్డు(Ration Card) తప్పనిసరి అన్నారు మారింది ప్రస్తుత వ్యవహారం.

Download Ration card Application:

కానీ రేషన్ కార్డు కేవలం సంక్షేమ పధకాల(Well Fare Schemes) కోసమే కాదని, అది మన గుర్తింపు కార్డు మాదిరిగా కూడా వాడుకోవచ్చని చాల తక్కువ మందికి తెలుసు,

ఇక రేషన్ కార్డు అంటే బియ్యం ఉప్పు పప్పులను డీలర్ షిప్ కేంద్రాల వద్ద తెచ్చుకునేందుకు వాడుకునే కార్డు మాత్రమే అనుకొనవసరం లేదు. రేషన్ కార్డులో పలు రకాలు ఉన్నాయి.

Also Read: Alert for Ration cards holders : ఆంధ్ర ప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి ఇది అలెర్ట్.రేషన్ పంపిణి పై సీఎస్ ఏమన్నారంటే.

ఎలా అప్లై చేసుకోవాలి : How to apply

ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో ఏవైతే ఆరోగ్యారంటీల అమలుకోసం ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో, వాటిలో ఓకే కీలకమైన ప్రకటన మొదటి నుండి వినిపించింది.

అదే రేషన్ కార్డు, రేషన్ కార్డు ఉన్నవారికే సంక్షేమ పధకాలు అమలు చేయబడతాయి అని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

ఇక ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్ లో కూడా రేషన్ కార్డు (Ration Card) ఉందా లేదా అని తెలియజేసేందుకు ఒక కలం కూడా ఉందని సమాచారం.

Read also: Praja Palana: ప్రజాపాలన ధరఖాస్తు కోసం ఏమేం అవసరం..ధరఖాస్తు ఎలా చేసుకోవాలి.

ఒక వేళ లబ్ధిదారులు రేషన్ కార్డు లేదని అప్లికేషన్ లో టిక్ మార్క్ చేస్తే వారితో రేషన్ కార్డు కోసం మరో అప్లికేషన్ పూరింపజేస్తున్నారు అధికారులు.

అయితే ఈ రేషన్ కార్డు కోసం ఆన్లైన్ లో కూడా అప్లై చేయొచ్చని అంటున్నారు. దానికోసం అప్లికేషన్ ఫార్మ్ ను డౌన్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది.

Leave a Comment