Guntur kaaram v/s hanuman movie: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ గుంటూరు కారం Guntur Kaaram. భారీ అంచనాల నడుమ సంక్రాంతి బరిలోకి దిగిన ఈ మూవీ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పాలి.
సినిమా విడుదలైన మొదటి రోజే మిశ్రమ స్పందన రావడంతో మహేష్ అభిమానుల్లో కాస్తంత అసంతృప్తి నెలకొంది. ఇదే క్రమంలో చిన్న హీరో అయినా బిగ్ స్క్రీన్ మీద అదరగొట్టాడు తేజ్ సజ్జా (Tej Sajja). కంటెంట్ ఉంటే హిట్ పక్కా అని హనుమాన్ Hanuman మూవీతో నిరూపించాడు. దీంతో సంక్రాంతి విన్నర్ గా హనుమాన్కే ప్రేక్షకులు ఓటేశారు.
ఐఎండీబీ రేటింగ్సైనా, బుక్ మై షోలో క్రేజ్ చూసినా గుంటూరు కారం కంటే హనుమాన్ కే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గుంటూరు కారం సినిమాకి ఐఎండీబీలో 6.8 రేటింగ్ రాగా.. హనుమాన్ కి మాత్రం 8.2 రేటింగ్ రావడంతో బాక్సాఫీస్ బరిలో ఈ మూవీ దూసుకెళ్తోంది.
Trolling on Trivikram : త్రివిక్రమ్‌పై ట్రోలింగ్
మహేష్ (Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram)కాంబోలో వచ్చిన గుంటూరు కారం ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. మహేష్ అభిమానులకు తప్ప ఇంకెవరికీ ఈ మూవీ నచ్చలేదనే టాక్ సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వినిపిస్తోంది. మహేష్ కోసమే ఒక్కసారైనా సినిమా చూడాలని అభిమానులు థియేటర్లకు వెళ్తున్నారు.
నిజానికి మాటల మాంత్రికుడి మ్యాజిక్ మాత్రం గుంటూరు కారం సినిమాలో ఎక్కడా కనిపించలేదు. దీంతో త్రివిక్రమ్ ను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై మీమ్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.
అజ్ఞాతవాసి2 (Agnathavasi)అంటూ మూవీ విడుదలైన ఫస్ట్ డేనే నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో సంక్రాంతికి సెన్సేషనల్ హిట్ సాధిస్తుందని భావిస్తే బాక్సాఫీస్ రేసులో గుంటూరు కారం(Guntur Kaaram) వెనుకబడి పోయింది. స్టోరీ లేకుండా మాస్ మసాలాను నమ్ముకొని త్రివిక్రమ్ సినిమా తీయడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమాకు వచ్చిన రేటింగ్స్ చూసి షాక్ అవుతున్నారు.
Huge Demand for Hanuman at North : నార్త్‌లోనూ హనుమాన్కు భారీ డిమాండ్
సంక్రాంతి బరిలో బడా స్టార్స్ సినిమాలు ఉన్నాయని భయపెట్టిన వెనకడుగు వేయలేదు హనుమాన్ (Hanuman )దర్శకుడు ప్రశాంత వర్మ (Prashanth Varma). ఓ రకంగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా తన కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో పెద్ద రిస్క్ చేసి సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేశాడు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
సినిమా రిలీజ్ ముందే వంద ప్రీమియర్ షోలు ఫుల్ హౌస్ కావడమే ఇందుకు నిదర్శనం అని చెప్పక తప్పదు. ఆడియన్స్ ఊహించినట్లే హనుమాన్ ఉండటంతో ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. వాస్తవానికి గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాతో పోలిస్తే హనుమాన్ కి చాలా తక్కువ థియేటర్లే దక్కాయి. అయినా రిస్క్ చేశారు మేకర్స్.
కానీ ఒక్క రోజులోనే రిజల్ట్ తారుమారైంది. హనుమాన్ మూవీకి అమేజింగ్ టాక్ వస్తోంది. దీంతో శనివారం షోలు పెరిగాయి. అంతే కాదు గుంటూరు కారంకి వచ్చిన నెగటివ్ టాక్ కూడా హనుమాన్ కు బాగా వర్కౌట్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా సూపర్ హీరో వైపే చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు నార్త్ లోనూ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు హనుమాన్.
బాలీవుడ్ లో లేటెస్టుగా స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif), తహిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన మెర్రీ క్రిస్మస్ మూవీ విడుదలైనా హనుమాన్ కు పాజిటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో తొలి రోజు హనుమాన్ విజేతగా నిలిచినట్లైంది.
Guntur Kaaram theaters to Hanuman : ‘గుంటూరు కారం’ థియేటర్లన్నీ హనుమాన్ కే!
వరల్డ్ వైడ్ గా గుంటూరు కారం విడుదలైనప్పటికీ మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. తన నటనతో సినిమాను లేపాలని మహేష్ ప్రయత్నించినా పెద్దగా వర్కౌట్ కావడం లేదని అర్థమవుతోంది. స్టార్ హీరో పెర్ఫార్మెన్స్ బాగున్నా అసలు మ్యారట్ ఉంటేనే కదా సినిమా బాక్సాఫీస్ లో హిట్ అయ్యేది.
అసలు కథే లేకపోవడం, త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్స్, స్క్రీన్ ప్లే వర్కౌట్ కాకపోవడంతో గుంటూరు కారం ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఈ క్రమంలో గుంటూరు కారంతో పాటు విడుదలైన ‘హనుమాన్’ మూవీకి మంచి టాక్ వచ్చింది.
దీని ఎఫెక్ట్ గుంటూరు కారంపై పడింది. ఇప్పటి వరకు గుంటూరు కారంకు టికెట్లు కొనుగోలు చేసినవారంతా వాటిని క్యాన్సర్ చేసుకుని మరీ హనుమాన్ మూవీకి టికెట్లను బుక్ చేస్తున్నారు. బుక్ మై షోలో ఏకంగా ‘హనుమాన్’ మూవీకి గంటకు 20 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి.
ఈ క్రమంలో దీంతో ఇవాళ్టి నుంచి గుంటూరు కారంకు కేటాయించిన థియేటర్లన్నింటినీ హనుమాన్‌కి ఇచ్చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.