Kalki Poster release: దీపికా పదుకొనే కల్కి లుక్ వావ్.

Deepika Padukone's Kalki look is wow.

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)38వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యింది. ఈ భామ పుట్టినరోజును పురస్కరించుకుని కల్కి 2898AD(Kalki 2898AD) మూవీ మేకర్స్ ఆమె లుక్ ను రిలీవ్ చేశారు.

దీపికా పదుకొణె బర్త్ డే గిఫ్ట్ గా కథానాయిక కల్కీ మూవీ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

Also read: Is Prabhas next movie kalki 2898 AD?: కల్కి సినిమా పై కొత్త అప్ డేట్.

అయితే కల్కీలో దీపిక ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తోంది అన్న విషయాన్ని మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. పోస్టర్ ని బట్టి ఆమె లుక్ భీకరంగా ఉంటుందని అర్థమవుతోంది.

పోస్టర్ తో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్‎ను మేకర్స్ జోడించారు. “మా బ్యూటిఫుల్ దీపికకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ నిరీక్షణ ఎక్కువ కాలం ఉండవచ్చు, కానీ కల్కి 2898 ADలో మీ కాంతి ప్రకాశిస్తుంది అని మేకర్స్ ఆమెకు విషెస్ తెలిపారు.

మేకర్స్ తో పాటు దీపిక కో యాక్టర్ డార్లింగ్ ప్రభాస్ (Prabhas)కూడా తన హీరోయిన్ కు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపిక లుక్స్ పైన పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అన్నదానిపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Kalki 2898AD raising expectations : అంచనాలు పెంచుతున్న

మహానటి (Mahanati) సినిమా తర్వాత సూపర్ హిట్ డైరెక్టర్ గా ఫేమ్ సంపాదించుకున్న నాగ్ అశ్విన్ (Nag Ashwin)పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)

Also read: Kalki 2898 AD: ప్రేక్షకుల ముందుకి రానున్న..కల్కి 2898 AD.

హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న మూవీ కల్కి 2898AD(Kalki 2898AD).వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మంగా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్.

2ff4f4cecf6d5a1c0366edb1f9cd8fd0 Kalki Poster release: దీపికా పదుకొనే కల్కి లుక్ వావ్.

ఈ చిత్రంలో భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉండబోతోందో ఎవరి ఊహలకు అందకుండా ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తోన్న ఫిక్షనల్ గ్లోబల్ ఫిల్మ్ ఇది. ఈ ప్యాన్ ఇండియన్ మూవీలో సౌత్ నుంచి నార్త్ వరకు ఉన్న సూపర్ స్టార్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitab Bachhan), కమల్ హాసన్ (Kamal Haasan), దీపికా పదుకొణె (Deepika Padukone),

దిశా పటానీ (Disha Patani) ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ గ్లింప్స్‌ను ఈ మధ్యనే శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను దృష్టిని ఆకర్షించారు నాగ్ అశ్విన్.

దీంతో నాగ్ అశ్విన్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నారని అందరూ ఎంతో ఆసక్తిగా సినిమా రిలీజ్ కోసం చూస్తున్నారు.రోజు రోజుకు కల్కి

2898 ADపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు లేటెస్టుగా విడుదలైన దీపిక్ పోస్టర్ కూడా ఆమె ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

Nag Ashwin going to do magic : మ్యాజిక్ చేయబోతున్న నాగ్ అశ్విన్

భారతీయ సినిమాలో సైన్ ఫిక్షన్ కథలు ఎక్కువ లేవు. కొన్ని టైమ్ ట్రావెల్ చిత్రాలు మాత్రమే వచ్చాయి . అయితే, నాగ్ అశ్విన్ (Nag Ashwin) రూపొందిస్తున్న కల్కి మూవీ మాత్రం వాటన్నింటికన్నా భాన్నం.

kalki289811697102155 Kalki Poster release: దీపికా పదుకొనే కల్కి లుక్ వావ్.

ఇదివరకు ఎన్నడూ చూడని చిత్రం. ఇదొక ప్రత్యేక ప్రపంచం. ఇప్పటి వరకు హాలీవుడ్ లో అక్కడి సిటీలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో చూశాం, అయితే నాగ్ అశ్విన్ కల్కి(Kalki)

ఇండియన్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ఎలా ఉంటాయో చూస్తారని ఇప్పటికే డైరెక్టర్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు.

మేకర్స్ దాదాపు ఐదేళ్లుగా ఈ మూవీ కోసం శ్రమిస్తున్నారు. ప్రతి అంశంపై లోతుగా అన్వేషించి కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నామని, అందరికీ ఈ ప్రపంచం నచ్చితీరుతుందని చెప్పారు డైరెక్టర్.

ఈ మూవీలో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ అన్నీకూడా భారతీయ మూలాలతో ముడిపడినవే ఉన్నాయట. దీంతో ప్రపంచం మొత్తం ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Leave a Comment