Pawan kalyan reached to Ayodhya mandir: శ్రీరాముడు జన్మించిన దివ్య స్థలం అయోధ్య Ayodhya .ఆ రాములోరి ఆలయాన్ని జన్మభూమిలో ఏర్పాటు చేయడం వందల ఏళ్లుగా నిర్విరామ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ Narendra Modi చొరవతో ఆ మహోన్నతమైన కార్యక్రమం ఇశాళ జరగబోతోంది.
అయోధ్యలో రామ మందిరం(Ram Mandir) ప్రారంభంతో పాటు బలరాముడి విగ్రహానికి కేంద్ర సర్కార్ ప్రాణ ప్రతిష్ట చేయబోతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కన్నులారా చూసేందుకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమా రంగ ప్రముఖులు అయోధ్య తరలివస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యకులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేన(Janasena) అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ Pawan Kalyan రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
Pawan kalyan Tweet on Reached to Ayodhya ram mandir:
500 year old dream has come true : 500 ఏళ్ల కల నెరవేరింది
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రమే ఆయన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)రాష్ట్రంలోని లక్నో(Lucknow)కు చేరుకున్నారు.
అయోధ్య చేరుకున్న పవన్ జాతీయ మీడియాతో మాట్లాడారు.”500 సంవత్సరాలుగా దేశ ప్రజలు ఎదురుచూస్తున్న కల సాకారం కాబోతోంది.
రామ్‌లల్లా(Ram lalla) ప్రతిష్టాపన కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది”.అని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు.
ఇదిలా ఉంటే దేశ నలుమూలల నుంచి సుమారు 4వేలకు పైగా ప్రముఖులు, స్వామిజీలు, ఆధ్యాత్మిక వేత్తలు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి చేరుకున్నారు.
వీరితో పాటే ప్రభుత్వ పాలకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు.
అయోధ్య ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఘట్టం సందర్భంగా దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది అయోధ్యలోనే కాదు ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు కోట్లాది మంది ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు.