Vijay Rashmika Engagement: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ Vijay Deverakonda, నేషనల్ క్రష్ రష్మిక మందన్న Rashmika Mandanna లు సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో ఉంటారు.
ఈ స్టార్స్ కలిసి నటించింది రెండు సినిమాలే అయినప్పటికీ వీరిద్దరి అన్స్క్రీన్ కెమిస్ట్రీ అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ కపుల్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలా మంది పండుగ చేసుకుంటారు.
Also Read: Family Star Release Date: ఎన్టీఆర్ ‘దేవర’ పైనే కన్నేసిన విజయ్ దేవరకొండ, ఎందుకంటే
రియల్ లైఫ్ లోనూ వీరిద్దరూ ఒక్కటవ్వాలంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. నెటిజన్స్ కోరికకు తగ్గట్లుగానే ఈ జోడీ కలిసి తరచుగా హాలిడే ట్రిన్స్ కు వెళ్తూ కెమెరా కళ్లకు చిక్కుతారు. ఇదే క్రమంలో పండుగల సమయంలో రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్తోందనే న్యూస్ కూడా ఇండస్ట్రీ మొత్తం పాకిపోయింది.
ఇది చాలాదన్నట్లు గత కొంత కాలంగా విజయ్, రష్మికలు పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటికి విజయ్ టీం అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇస్తూనే ఉంటోంది.
ఇప్పుడేమో ఫిబ్రవరీలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ (Engagement) అనే వార్త నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఇక ఈ రూమర్ కాస్త బాగా వైరల్ అయ్యి విజయ్ వద్దకు వచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రష్మికకు తనకు మధ్య ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యాడు రౌడీ బాయ్.
Vijay reaction about engagement : ఎంగేజ్మెంట్ గురించి విజయ్ ఏమన్నాడంటే
నిజానికి రియల్ లైఫ్ లో రష్మిక ( Rashmika), విజయ్ (Vijay Devarakonda)లు మంచి ఫ్రెండ్స్. అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేకపోయినా వీరిద్దరికీ పెళ్లి అంటూ రూమర్స్ రోజు రోజుకు సోషల్ మీడియాలో ఎక్కువైపోతున్నాయి.
సోషల్ మీడియాలో వీరుపెట్టే ఫోటోలే అందుకు కారణం అని చాలా మంది భావిస్తున్నారు. ఈ రూమర్ కు తగ్గట్లుగానే వీరిద్దరు నెట్టింట్లో పోస్ట్ చేసిన ఫోటోలు ఒకే దగ్గర దిగినవంటూ నెటిజన్లు ఎప్పటికప్పుడు వారి రిలేషన్ గురించి తేల్చి చెప్తున్నారు.
వీరిద్దరి మధ్యన ప్రేమ ఉందని, ఫిబ్రవరీలో ఎంగేజ్మెంట్ అని రూమర్స్ ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో వినిపిస్తున్నారు. తాజాగా తన నిశ్చితార్థం గురించి స్వయంగా విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నాకు రష్మికకు ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్ అన్నీ కూడా ఫేకే. ఫిబ్రవరిలో నాకు ఎంగేజ్మెంట్ జరగడం లేదు.
పెళ్లి కూడా చేసుకోవడం లేదు. అదేంటో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా నాకు పెళ్లి చేయాలనుకుంటుంది. ప్రతి ఏడాది ఈ రూమర్స్ వింటూనే ఉన్నాను. మీడియా నాకు ఎప్పుడు పెళ్లి చేద్దామా? అని వెయిట్ చేస్తోంది.
అందుకే మరి నాకు తెలియకుండా ఫిబ్రవరీలో నా ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. కానీ ఈ న్యూస్ లో అసలు నిజం లేదు” అని విజయ్ క్లారిటీ ఇచ్చాడు.
Vijay-Rashmika focused on career : కెరీర్ మీద దృష్టి పెట్టిన విజయ్-రష్మిక
ప్రస్తుతం విజయ్ రష్మికలు వారి కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. వారిద్దరూ ఎంగేజ్మెంట్ , వివాహం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతానికి సింగిల్ గా ఎవరి లైఫ్ లో వారు హ్యాపీగా ఉన్నారు. విజయ్ ఈ మధ్యనే విడుదలైన ఖుషీ (Kushi) మూవీ హిట్ తో పలు ప్రాజెక్ట్స్ కు సైన్ చేశాడు.
పరుశురామ్(Parushuram) డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్ (Family Star) చేస్తున్నాడు విజయ్. ఈ మూవీ పూర్తి కాగానే జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanoori)తో మరో సినిమాకు ఓకే చెప్పాడు.
ఇక రష్మిక యానిమల్ (Animal) సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు పుష్ప2 (Pushpa) షూటింగ్ లో బిజీ ఉంది. ఇది పూర్తి కాగానే రెయిన్ బో (Rainbow), ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend), ఛావ (Chawa)వంటి సినిమాల్లోనూ నటిస్తోంది.
ఇలా ఎటు చూసినా వీరిద్దరి చేతుల్లో రెండు మూడు చిత్రాలు ఉన్నాయి. ఒకవేళ పెళ్లి చేసుకోవాలన్నా మరో రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.