Will BRS Again Changes As TRS?: మరలా టీ ఆర్ ఎస్ గా మారబోతోందా ?

website 6tvnews template 2 1 Will BRS Again Changes As TRS?: మరలా టీ ఆర్ ఎస్ గా మారబోతోందా ?

Will BRS Again Changes As TRS?: భారతీయ రాష్ట్ర సమితి పార్టీ(Bharateeya Rahtra Samiti) పేరు మరోసారి మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అదేమిటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే 2022 సంవత్సరం లోనే కదా తెలంగాణ రాష్ట్ర సమితిగా(Telangana Rashtra Samiti) ఉన్న పార్టీ పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు, మరలా ఇప్పుడు పార్టీ పేరు మారుస్తున్నారా ? కొత్తపేరు ఏమైనా పెడుతున్నారా ? అని ఖంగారు పడకండి. బి.ఆర్.ఎస్ కు మరల పాత పేరే పెట్టాలని యోచిస్తున్నారట.

అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా మారోబోతోంది, భారతీయ రాష్ట్రసమితి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయినా ఉన్నట్టుండి భారతీయ రాష్ట్ర సమితి పేరుని ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చబోతున్నారు అని చాల మంది సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు.

పోరాటంతో పుట్టిన పార్టీ : TRS Born From Telangana Fight

తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఈ వేర్పాటు వాదంలో నుండి పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలనీ భావించి గులాబీ బాస్ కేసీఆర్ స్థాపించుకున్న పార్టీ.

ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. పైగా ప్రజల ఆశీర్వాదంతో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్య మంత్రి అయ్యారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం లో అధికార పార్టీ అయింది. అంటే ఉద్యమ నేపధ్యం ఉన్న పార్టీ కాబట్టి ప్రజల హృదయాలను గెలుచుకోగలిగింది టి.ఆర్.ఎస్. ఈ కారణాలతోనే 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఘానా విజయాన్ని నమోదుచేసుకోగలిగింది అని చెప్పొచ్చు.

దేశ రాజకీయాల్లోకి వెళ్లాలన్న కేసీఆర్ : KCR Decided To Enter In To National Politics

Will BRS Again Changes As TRS?:

రాష్ట్ర రాజకీయాల్లో టి.ఆర్.ఎస్ పార్టీ తిరుగులేని విధంగా దూసుకెళుతున్న నేపథ్యంలో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) తన పార్టీ విషయంలో అలాగే, తన రాజకీయ భవితవ్యం విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారతీయ రాష్ట్ర సమితిగా(Bhartiya Rashtra Samithi) మార్చాలని, ఇప్పటి వరకు కేవలం తెలంగాణ లో మాత్రమే పోటీ చేసిన టిఆర్.ఎస్ జాతీయ పార్టీగా మారి దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని ఎన్నికల బరిలోకి దిగుతుందని ప్రకటించారు.

ఇక తమను రాబోయే కాలంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, చక్రం తిప్పాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. ఆ క్రమం లోనే దేశ రాజధాని ఢిల్లి(Delhi) లో బిఆర్.ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఢిల్లో తోపాటు మహా రాష్ట్రలో(Maharashtra) కూడా పార్టీని స్థాపించిన గులాబీ పార్టీ, ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో కూడా పార్టీ కార్యాలయాన్ని కూడా స్థాపిస్తుందని చెప్పుకొచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల కేసీఆర్ ఎక్కువగా మహారాష్ట్ర లోనే పర్యటించారు కానీ ఎపిలోకి అడుగుపెట్టింది లేదు.

పార్టీ పేరు మార్పు ఓటమికి కారణమా : Party Name Change Leads To Defeat ?

అయితే టిఆర్.ఎస్(TRS) కాస్తా బిఆర్.ఎస్(BRS) గా మారి పోయింది. పార్టీ అధినేత పేరు మార్పుకి ప్రతిపాదన తీసుకురావడంతో పార్టీ లోని ముఖ్య నేతలు, కార్యకర్తలు అంతా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. సంబరంగా పేరు మార్పు కార్యక్రమాన్ని చేపట్టారు.

2022 అక్టోబర్ నెలలో ఆ ప్రక్రియ పూర్తయింది. ఇక ఆనాటి నుండి కేసీఆర్ దేశ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టారు. కానీ 2023 సంవత్సరం రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress) ఘన విజయం సాధించింది.

బిఆర్.ఎస్ ను ఓటమి పలుకరించింది. ఈ ఓటమికి కారణం పేరు మార్పు అని బిఆర్.ఎస్ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గా ఉన్నప్పుడు పార్టీ అంటే మనది అని తెలంగాణ ప్రజలు అనుకున్నారని, బిఆర్.ఎస్ అనే సరికి వారి మనసుల నుండి ఎక్కడో ఎడబాటు మొదలైందని అదే ఈ ఓటమికి కారణమైందని వసిలెషించుకోవడం మొదలు పెట్టారు.

పార్లమెంట్ ఎన్నికల తరవాత అవ్వచ్చు : Name Change Might Be After Parliament Elections

Will BRS Again Changes As TRS?:

పేరు మార్పు పై కార్యకర్తలు నాయకులతో సమాలోచన చేసుకోవడంతో ఇది పార్టీ అధినాయకత్వం వరకు వెళ్ళింది. బిఆర్.ఎస్(BRS) పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి(Kadiyam Srihari) వాటి వారు కూడా ఈ విషయంలో కార్యకర్తల మాటకే జై కొట్టినట్టు తెలుస్తోంది.

బిఆర్.ఎస్ గా ఉన్న పేరును మరలా టిఆర్.ఎస్(TRS) గా మారిస్తే పార్టీకి మరలా తిరిగి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్త పరుస్తున్నారు. విషయం అధినాయకుడు కేసీఆర్(KCR) వరకు వెళ్ళింది కాబట్టి అయన సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు.

పార్టీ లోని సీనియర్ నేతల నుండి కార్యకర్తల వరకు అనేక మంది కోరుకుంటున్న విషయం ఇది. అయితే పార్టీ పేరును మరల టిఆర్.ఎస్(TRS) గా మారిస్తే అది పార్లమెంట్ ఎన్నికల(Parliament) అనంతరం ఉండొచ్చని తెలుస్తోంది.

కేసీఆర్ అంటే పట్టువదలని విక్రమార్కుడు : KCR Is Real Fighter

అయితే బిఆర్.ఎస్ మరలా మునుపటి మాదిరిగా టిఆర్.ఎస్(TRS) అయిపోతుందని, కేసీఆర్ పార్టీ పేరును మార్చేస్తారని అంత తేలికగా అనుకోలేము అంటున్నారు కొందరు పొలిటికల్ ఎనలిస్టులు. కేసీఆర్(KCR) ఏదైనా అనుకున్నారంటే సాధించే వరకు విశ్రమించరని చెబుతున్నారు.

సమైఖ్యఆంధ్ర సమయంలో వై.ఎస్ ఆర్(YSR) వంటి మహామహులు ఉన్న సమయంలోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేస్తున్నారు. ఒక వేళ కేసీఆర్ వెనకడుగు వేసే వ్యక్తి అయితే ఆనాడే పార్టీని కాంగ్రెస్(Congress) లో విలీనం చేసి ఏ మంత్రి పదవో తీసుకుని ఉండేవారని అంటారు.

కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి తెలంగాణను(Telangana) సాధించారని, అదే విధంగా జాతీయ రాజకీయాల్లో బిఆర్.ఎస్(BRS) పేరుతోనే పోరాటం సలిపి జండా ఎగురవేస్తారని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తునానరు.

Leave a Comment