ABVP : మైనారిటీ మహిళలు. హెచ్.సి.యూ ఎన్నికలు రసవత్తరం,

ezgif 4 26e980c240 ABVP : మైనారిటీ మహిళలు. హెచ్.సి.యూ ఎన్నికలు రసవత్తరం,

ABVP : మొదటిసారి మైనారిటీ మహిళ..హెచ్.సి.యూ ఎన్నికలు రసవత్తరం. తలపడబోయే అభ్యర్థులు ఇద్దరూ మైనారిటీలే.

విశ్వ విద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరగడం అనేది ఎప్పటి నుండో వస్తోంది. వివిధ రకాల సంఘాలు ఈ ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను నిలబెడతాయి.

ఈ ఎన్నికల్లో నెగ్గిన వారు ఆయా విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘం నాయకులుగా కొనసాగుతారు. అయితే ఈ ఏడాది హైదరాబాద్ యునివేర్సిటి విద్యార్థి సంఘం ఎన్నికలు ఈనెల 9వ తేదీన నిర్వహించనున్నారు.

అయితే మునుపటి కన్నా ఈ ఏడాది జరగబోయే హెచ్ సీ యూ ఎన్నికలు కాస్త ప్రత్యేకంగా నిలువనున్నాయి. ఎందుకంటే SFI-ASA-TSF కూటమి తరుపున మైనారిటీ కి చెందిన అభ్యర్థి పోటీలోకి దిగుతుండగా, ఏబీవీపీ ఇంకాస్త తెలివిగా ఆలోచించింది.

తమ తరుపున ముస్లిం మైనారిటికి చెందిన మహిళా అభ్యర్థిని బరిలోకి దించనుంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఓ ముస్లిం విద్యార్థిని వర్సిటీ ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధమైంది.

ఆమె పేరు షేక్ ఆయేషా ఈమె విశాఖపట్నానికి చెందిన మహిళ, కెమిస్ట్రీ విభాగంలో ప్రస్తుతం ఈమె హెచ్.సి.యూ లో పిహెచ్.డి చేస్తున్నారు. ఈ విషయమై ఆయేషా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు.

అందుకే విద్యార్థి దశ నుండి ఎన్నికల బరిలో నిలవడానికి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్నారు. పైగా తాను ముందు నుండి ఏబీవీపీ వైపు ఆకర్షితురాలినయ్యానన్నారు.

2019 నుంచి తాను ఏబీవీపీలో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. తాను సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలో ఎంఎస్సీ చేస్తున్నప్పటి నుంచి ఏబీవీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నానని చెప్పారు.

అప్పట్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఏబీవీపీ కి తన సేవలు అందించానని అన్నారు.

ఇక అయేషా ABVP గురించి మాట్లాడుతూ ABVP ఎప్పుడు కూడా మైనార్టీలకు వ్యతిరేకం కాదని అన్నారు. అయితే కేవలం ఆ సందేశాన్ని విద్యార్థుల్లోకి ప్రజల్లోకి పంపించేందుకే సదరు సంస్థ తనను ఎన్నికల బరిలోకి దింపిందనే ప్రచారాన్ని మాత్రం ఆమె ఖండించారు.

ABVP మైనారిటీలకు మాత్రమే కాక భారతదేశానికి సైతం అనుకూలమైందని చెప్పారు అయేషా. దేశానికి మద్దతు తెలిపే మైనారిటీలందిరికి ఎబివిపి తన మద్దతు ఇస్తుందని ఆమె అన్నారు.

ఇక ఈ ఎన్నికల్లో అయేషాకి పోటీగా SFI-ASA-TSF కూటమికి చెందిన మహ్మద్ అతీక్ అహ్మద్‌ అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. ఇతను హైదరాబాదీ వ్యక్తి.

ఇతను కూడా హెచ్.సి.యు లో పిహెచ్.డి చేస్తున్నాడు. ఈ దఫా హెచ్.సి.యు ఎన్నికల్లో, ముస్లిం మహిళ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక ఎత్తయితే, పోటీకి నిలిచిన అభ్యర్థులు ఇద్దరు కూడా మైనారిటీలే కావడం తొలిసారి.

కాబట్టి ఈ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల సంక్షేమం కోసం పాటు పడతానని అయేషా చెబుతున్నారు. అంతేకాక సామాజిక సామరస్యత తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

Leave a Comment