Jyothika-Surya Divorce: సూర్యతో డివోర్స్..ఒక్క పోస్ట్‎తో క్లారిటీ ఇచ్చిన జ్యోతిక

website 6tvnews template 2024 01 30T151745.505 Jyothika-Surya Divorce: సూర్యతో డివోర్స్..ఒక్క పోస్ట్‎తో క్లారిటీ ఇచ్చిన జ్యోతిక

కోలీవుడ్ సూపర్ క్యూట్ సెలబ్రిటీ జంట సూర్య(Surya)-జ్యోతిక (Jyothika)లు డివోర్స్ తీసుకోబోతున్నారనే ఊహాగానాలు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత సెప్టెంబర్ 11, 2006న పెళ్లి బంధంతో తమ లైఫ్ జర్నీని స్టార్ట్ చేశారు ఈ క్యూట్ కపుల్. వీరిద్దరికీ దియా (Diya), దేవ్ (Dev) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ జంట వ్యక్తిగతంగా, వృత్తిపరమైన ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ కొనసాగిస్తున్నారు.వేడుకలైనా, సినిమా ఫంక్షన్స్‌ అయినా ఇద్దరు సతీసమేతంగా అటెంట్ అవుతారు.

తమ ఫ్యాన్స్ ను అలరిస్తుంటారు. అంతే కాదు ఎప్పుడూ ఒకరిపై ఒకరు ప్రేమను గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే తాజాగా జ్యోతిక ముంబై (Mumbai)కి తన మకాం మార్చడంతో, భర్త సూర్య నుంచి విడిపోయిందనే పుకార్లు ఇండస్ట్రీలో ఊపందుకున్నాయి. ఆ రూమర్స్ కు ఆజ్యం పోసేలా జ్యోతిక కూడా ముంబైలోనే గత కొంతకాలంగా ఉంటున్నట్లు ఈ మధ్యనే తెలిపింది. అయితే జ్యోతిక తన పిల్లలతో పాటు ప్రస్తుతం ముంబైలో ఉండటం, సూర్య అక్కడ లేకపోవడంతో వీరిద్దరి డివోర్స్ తీసుకోబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు జ్యోతిక కానీ, సూర్యా కానీ స్పందించలేదు. అయితే తాజాగా జ్యోతిక ఊహాగానాలకు ఒక్క పోస్టుతో యాన్సర్ చెప్పేసింది. డివోర్స్ (Divorce)రూమర్ కు ఓ క్లారిటీ ఇచ్చింది.

Surya-Jyotika in Vacation:వెకెషన్‏లో సూర్య-జ్యోతిక

సూర్య (Surya)-జ్యోతిక (Jyotika)డివోర్స్ తీసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకే జ్యోతిక ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి పిల్లలతో పాటే ముంబైలో సెటిల్ అయ్యిందని సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. సూర్యకు , జ్యోతికకు మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఆ గొడవలే డివోర్స్ వరకు వెళ్లాయని ఇల రకరకాల కథనాలు నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ విషయాన్ని కపుల్స్ ఇద్దరూ కొట్టిపాడేసినప్పటికీ వీరి డివోర్స్ రూమర్స్ కు మాత్రం ఇంకా బ్రేక్ పడటం లేదు. నిజానికి జ్యోతిక ముంబైలో ఉండటానికి కారణం లేకపోలేదు. కానీ కొంత మంది కావాలని రేటింగ్స్ కోసం ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్టుగా జ్యోతిక ఈ రూమర్స్ కు ఓ ఆసక్తికరమైన పోస్ట్ తో చెక్ పెట్టింది. తన ఇన్‎స్టాగ్రామ్‎లో భర్త సూర్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందరి నోళ్లు మూయించింది.

Jyothika post gave Clarity on divorce : పోస్టుతో డివోర్స్‎పై క్లారిటీ ఇచ్చిన జ్యోతిక

ప్రస్తుతం జ్యోతిక (Jyothika)-సూర్య (Surya)వెకెషన్ లో ఉన్నారు. ఈ క్యూట్ కపుల్ ఫిన్‌ల్లాండ్‌ (Finland)లో మంచు కొండల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. మంచులో హాయిగా ఫిన్‏లాండ్ మొత్తం చుట్టేసి రిలాక్స్ అవుతున్న వీడియోను తాజాగా జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోతోనే డివోర్స్ రూమర్స్ కు క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైనా గాసిప్‌ రాయుళ్లు తమ రాతలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఫ్యాన్స్‌ కౌంటర్‌ ఇస్తున్నారు.

I shifted to Mumbai for a reason : అందుకే ముంబైకి షిఫ్ట్ అయ్యాను

ఈ మధ్యనే ఓ షోలో జ్యోతిక (Jyothika) మొదటిసారి డివోర్స్ న్యూస్ పై స్పందించింది. ” నాకు సూర్య (Surya)తో ఎలాంటి మనస్పర్థలు లేవు. పిల్లల స్టడీస్ తో పాటు బాలీవుడ్ లో నేను ఇప్పటికే కమిటైన మూవీస్ పూర్తి చేసేందుకు నా పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల ముంబైకి వచ్చాను. సూర్య తమిళంలో సినిమాలు చేస్తున్నారు. అందుకే మాతో రాలేదు అక్కడే ఉండిపోయారు. కానీ వీలుకుదిరినప్పుడల్లా మమ్మల్ని కలుస్తున్నారు. అయినా డివోర్స్ అంటూ రూమర్స్ వ్యాపిస్తున్నారు. ఈ వార్తల వల్ల ఏం వస్తుందో నాకు అర్ధం కావడం లేదు. నా భర్త సూర్య చాలా మంచి మనిషి. పిల్లల చదువు.. నా హిందీ మూవీస్ పూర్తి కాగానే చెన్నై వెళ్లిపోతాం” అంటూ జ్యోతిక డివోర్స్ పై రియాక్ట్ అయ్యింది.

Leave a Comment