6tvnews

Header - Ramky
collapse
...
Home / ఆరోగ్యం / డైట్ & న్యూట్రిషన్ / ప్రఖ్యాత పోషక నిపుణురాలు పూజా మఖిజాతో వర్చువల్ సెషన్ నిర్వహించిన వైఎఫ్ఎల్ఒ

ప్రఖ్యాత పోషక నిపుణురాలు పూజా మఖిజాతో వర్చువల్ సెషన్ నిర్వహించిన వైఎఫ్ఎల్ఒ

2021-10-28  Lifestyle Desk
venus

healthy food
 

 

ఆహారపు అలవాట్లు, డైట్ ప్లాన్   అనే అంశంపైన YFLO( యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) ఒక వర్చువల్ సెషన్ నిర్వహించింది.  చైర్‌పర్సన్ దీప్తి రెడ్డి, వైఎఫ్ఎల్ఒ కమిటీ, సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ నోరిష్ జెనీ పూజా మఖిజాతో కలిసి ఈ వర్చువల్ సెషన్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పోషక నిపుణురాలు పూజా మఖిజా మాట్లాడుతూ ప్రపంచంలోనే  భారతీయ ఆహారం ఎంతో అత్యుత్తమమైనది.  భారతీయ ఆహారం  రుచికరంగా ఉంటుందని, దానితో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా, ఆహారం,వ్యాయామం, నీరు, సరిపడినంత నిద్ర, తెలివైన విధంగా తినడం మన శరీరాన్ని ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు తోడ్పడుతాయని తెలిపారు.


‘‘మన జీవనశైలి ఆధారంగా ఆహారాన్ని తీసుకోవాలి.   ఒక వ్యాధిని సమూలంగా తొలగించేందుకు గాను మనం  తీసుకునే  ఆహారం పై నియంత్రణ ఉండాలి.  మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా  మన అనుభూతులను కూడా మార్చుకోవచ్చు. ఏ విధమైన పదార్థాలను ఎంతగా తీసుకోవాలనుకునే నియంత్రణ ఇక్కడ ముఖ్యం. మీ శరీరానికి సరిపోయే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి’’ అని పూజా మఖీజా అన్నారు. 


‘‘ వ్యాయామం అంటే జిమ్‌కి వెళ్లడమే కాదు.  వ్యాయామం అంటే ఏదైనా శారీరక శ్రమ చేయడం. అంటే మీ స్నేహితుల తో కలిసి నడవడం కావొచ్చు లేదా మీ కుక్కను తీసుకొని నడవడం కూడా వ్యాయామమే. వ్యాయామం అనేది  బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఇది మంచి చర్మం, మానసిక దృఢత్వం, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.  అందుకే,ఏదైనామీకు నచ్చిన  వ్యాయామం చేయాలని’’ తెలిపారు.

జీవితంలో నీరు ఎంత ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తుందని పూజా మఖానీ అన్నారు.  నీరే జీవితమని, తగినంత నీరు తాగడం - అంటే రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీటిని తీసుకోవాలని తెలిపారు. ఇది శరీరంలో ఉన్న బ్యాక్టీరియాను బయటకు పంపుతుందని,  జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి సహాయపడుతుందని అన్నారు.
‘‘శరీరాకృతిని కోసం, మానసికంగా,  శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే  రోజుకు  7-8 గంటల నిద్ర తప్పనిసరి.  ఇది మన శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది’’ అని పూజా మఖానీ అన్నారు. 


YFLO చైర్‌పర్సన్ దీప్తి రెడ్డి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్న సమర్థంగా నిర్వహిస్తూ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో సప్లిమెంట్ల అవసరం ఉంది అనే దిశగా  ప్రశ్నలు వేశారు. సమాధానాలను అందిస్తూ, పౌష్టికాహార సప్లిమెంట్ల ఆవశ్యకత,  వాటి ప్రాముఖ్యతను గురించి 


FLO పూర్వ జాతీయ అధ్యక్షురాలు, హైదరాబాద్ శాఖ పూర్వ అధ్యక్షురాలు పింకీ రెడ్డి, హైదరాబాద్ శాఖ పూర్వ అధ్యక్షురాలు రేఖా రెడ్డి పోషకాల సప్లిమెంట్స్ ప్రాధాన్యం గురించి ప్రశ్నించారు. YFLO వైస్ చైర్‌పర్సన్ సోనాలి మోడీ స్పాన్సర్‌లకు  IT బృందానికి  కృతజ్ఞతలు తెలుపుతూ సెషన్‌ను ముగించారు.


2021-10-28  Lifestyle Desk

rajapush