6tvnews

Header - Ramky
collapse
...
Home / వినోదం / తెలుగు / పెద్ద‌న్న‌కి ఎనిమీగా మారిన విశాల్‌

పెద్ద‌న్న‌కి ఎనిమీగా మారిన విశాల్‌

2021-11-05  Entertainment Desk
venus

peddanna enemy
 

 

సూపర్ స్టార్ రజనీకాంత్, శివ ల కాంబినేషన్ లో వచ్చిన  తాజా చిత్రం పెద్దన్న. భారీ ఎత్తున విడుద‌ల‌యిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు కొత్త‌గా అనిపించ‌క‌పోయినా ర‌జ‌నీ ఫ్యాన్స్ కి  స్టఫ్ సినిమాలో ఉందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. కథ పరంగా చాలా రొటీన్ కథ అని ట్రైల‌ర్‌లోనే తెలుస్తుంది. అయినా ఆ రొటీన్ కథని డైరెక్టర్  ప్రేక్ష‌కుడిని థియేట‌ర్‌లో ఎంత ఎంగేజ్ చేశాడా అని ఎదురు చూసిన ప్రేక్ష‌కుల‌కు నిరాశే ఎదుర‌యింద‌ని చెప్పాలి.   

హీరో కి తన చెల్లె ప్రపంచం, తనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేడు, చదువు కంప్లీట్ చేసుకుని ఊరికి వచ్చిన చెల్లికి…పెళ్లి చేయాలనీ సంబంధాలు చూస్తాడు. ఇలా చెల్లె కాన్సెప్ట్‌ లో క‌థ మొత్తం కొన‌సాగుతుంది. చెల్లెలికి త‌న జీవితంలో ఎదుర‌యే ఇబ్బందుల‌న్నీ కూడా పెద్దన్న త‌న బాధ్య‌త‌గా తీసుకుని చెల్లెను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాడు.  ఇలాంటి స్టోరీ పాయింట్ తో గత 20-25 ఏళ్లలో ఎన్నో సినిమాలు వచ్చాయి.   

ఇప్పుడు ఇదే పాయింట్ తో రజినీని తీసుకుని మాస్ ఎలివేషన్ సీన్స్ ని పెట్టి పెద్దన్నగా సినిమా తీశాడు ద‌ర్శ‌కుడు శివ‌. అసలు ఏమాత్రం కొత్తదనం లేని ఈ రొటీన్ కథలో సూపర్ స్టార్ రజినీ తన వంతుగా ఎంత కుదిరితే అంత చేశాడు. యాక్షన్ సీన్స్, డైలాగ్స్, తన స్టైల్ అన్నీ ఒకప్పటి ముత్తు, అరుణాచలం సినిమాలను గుర్తు చేస్తాయి. మొత్తానికి ఫ‌స్టాఫ్ అంతా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అన్న‌వ‌రం చిత్రం లాగా సెకండాఫ్ అంతా మ‌హేష్‌బాబు న‌టించిన అర్జున్ సినిమాలాగా అనిపించింది చూసే ప్రేక్ష‌కుడికి.    

తమిళ్ స్టార్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ఎనిమి. యాక్షన్ హీరోగా తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు విశాల్. హిట్లు- ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విశాల్. ఈ సినిమాలో విశాల్ తోపాటు మరో హీరో ఆర్య కూడా నటించారు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. అలాగే ఆర్య నెగిటివ్ రోల్ లో కనిపించాడు. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్లు ఎలా కలుస్తారు? అనే కథను ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ ఆనంద్‌ శంకర్‌. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను పెద్ద పీట వేశారని, విశాల్, ఆర్య ఇద్దరూ సూపర్ పర్‌ఫార్‌మెన్స్ ఇచ్చారు. ఈ పెద్ద‌న్న చిత్రం క‌న్నా మంచి హిట్ టాక్ తెచ్చుకుంద‌నే చెప్పాలి. మొత్తానికి ఈ దీపావ‌ళికి పెద్ద‌న్న‌కి విశాల్ ఎనిమీగా మారాడా అంటే మారాడ‌నే చెప్పాలి.    


 


2021-11-05  Entertainment Desk

rajapush