6tvnews

Header - Ramky
collapse
...
Home / న్యూస్ / అంతర్జాతీయం / బ్రిటన్ మహిళకు అనుకూలంగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పు

బ్రిటన్ మహిళకు అనుకూలంగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పు

2021-11-05  News Desk
venus

australia
 

 

ఆస్ట్రేలియాలో తీవ్ర వివాదాస్పదంగా ఉన్న బ్యాక్ ప్యాకర్ ట్యాక్స్ పై బ్రిటీష్ వెయిట్రెస్ విజయం సాధించారు. బ్యాక్ ప్యాకర్ ట్యాక్స్ ను ఆస్ట్రేలియాలో పనిచేసే విదేశీయుల నుంచి వివక్షాపూరితంగా ఈ పన్ను వసూలుచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వర్కింగ్ హాలిడేస్ వీసాల మీద పనిచేసేవారిపై పన్ను రూపంలో వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆస్ట్రేలియా అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. బ్యాక్ ప్యాకర్ ట్యాక్స్ కు వ్యతిరేకంగా కాథరిన్ అడ్డీ అనే బ్రిటిష్ మహిళ కోర్టును ఆశ్రయించారు. ఆమె 2017 నుంచి సిడ్నీలో వర్కింగ్ హాలిడే వీసా మీద సీజనల్ లేబర్ గా పనిచేస్తున్నారు. ఆమె సంపాదించే ప్రతి డాలర్ మీద 15శాతం  పన్ను వసూలుచేస్తున్నారు.  వార్షిక ఆదాయం 18,200 ఆస్ట్రేలియా డాలర్లు లేదా 13,500 అమెరికా డాలర్లు దాటితే ఆస్ట్రేలియా పన్ను వసూలు చేస్తుంది. అయితే వర్కింగ్ హాలిడే వీసాపై పనిచేస్తున్నవారిపై వసూలు చేస్తున్న  ఈ పన్ను విధానాన్ని రెండేళ్ల క్రితం బ్రిస్బేన్ కోర్టు తప్పుపట్టింది. ఆస్ట్రేలియా, బ్రిటన్ మధ్య ఉన్న ద్వంద్వ పన్నుల విధానం వల్ల అడ్డీకి బ్యాక్ ప్యాకర్ ట్యాక్స్ వర్తించదని తెలిపింది. ఇది కనిపించకుండా ప్రదర్శిస్తున్న వివక్ష అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే బ్రిస్బేన్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆస్ట్రేలియా  ఫెడరల్ కోర్ట్ కొట్టివేసింది. ఆస్ట్రేలియా ట్యాక్స్ విధానాన్ని సమర్థించింది.    

దీంతో అడ్డీ లాయర్ ఆస్ట్రేలియా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అడ్డీ ఆస్ట్రేలియాకు చెందిన మహిళ కాదని..ఆమెపై పన్నుల భారం మోపారని ఆస్ట్రేలియా హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే వివిధ దేశాల నుంచి సెలవుదినాల్లో పనిచేసేందుకు వస్తున్న వారిపై ఈ విధానం ప్రభావం చూపిస్తుందని ఆస్ట్రేలియా పన్నుల వసూలు కార్యాలయం వాదించింది. బ్రిటన్, జపాన్, జర్మనీ, చిలీ, టర్కీ, ఫిన్ లాండ్, నార్వే నుంచి వచ్చిన దేశాల వారిని కూడా ఆస్ట్రేలియా పౌరులుగా భావించాల్సి వస్తుందని కోర్టుకు వివరించింది. సెలవుదినాల్లో పనిచేసేవాళ్లలో ఎక్కువమంది ఆస్ట్రేలియన్లు కాదని, వారు సెలవుల కోసం ఆస్ట్రేలియా వచ్చారని, సెలవురోజుల్లో ఆదాయం పొందేందుకు పనిచేస్తున్నారని వాదించింది. కోర్టు నిర్ణయం వల్ల హాలిడే మేకర్స్ పన్నురేట్లపై ప్రభావం పడుతుందని అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అడ్డీ సిడ్నీలో నివిస్తున్నారని, న్యూ సౌత్ వేల్స్ లో ఎక్కువ సమయం గడుపుతారని, దీనర్ధం ఆమె ఆస్ట్రేలియా నివాసేనని కోర్టు వ్యాఖ్యానించింది. అడ్డీ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుతో అనేకమందికి లాభం కలగనుంది. ఇప్పటికే ట్యాక్స్ రూపంలో హాలిడే మేకర్లు చెల్లించిన మొత్తం..తిరిగి వారికి అందించాల్సిన అవసరం ఏర్పడింది.    


 


2021-11-05  News Desk

rajapush