6tvnews

Header - Ramky
collapse
...
Home / చదువు / చౌకగా కృత్రిమ మేథ – క్వాంటమ్ బోధన

చౌకగా కృత్రిమ మేథ – క్వాంటమ్ బోధన

2021-10-25  Education Desk
venus

artificial intelligence course
 

 

సాధారణంగా ఏ పని చేయాలన్నా మానవ మేథ పనిచేయాలి. ఇది మనుషులకు, జంతు కోటికి కూడా ఏదో స్థాయిలో అత్యధిక సహాయకారిగా జీవన గమనంలో సహాయపడుతూ ఉంటుంది. ఇలా మనవ ప్రమేయం లేకుండా యంత్రాలే అనేకానేక కార్యకలాపాలను సొంతంగా నిర్వహించగలిగేలా వాటికి తగిన మార్గనిర్దేశకం చేయడమే కృత్రిమ మేథ పేరుతో వ్యాప్తిలోకి వచ్చింది. ఇక క్వాంటమ్ నైపుణ్యాలు వివిధ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు, విశ్లేషించేందుకు అత్యంత క్లిష్టమైన గణన చేయడానికి విభిన్న రూపాలలో ఉపయోగపడుతుంది. ఈ రెండు రంగాలలోనూ అతి తక్కువ ధరలకే శిక్షణ సామగ్రిని (సెల్ఫ్-పేస్డ్ స్టడీ మెటీరియల్) ఇచ్చేందుకు ముదుకొచ్చింది ఒక సంస్థ దాని పేరు QptAI.  కేవలం రూ. 499 లకే ఈ కోర్సును నేర్చుకునేందుకు, నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఆ సంస్థ బోధన అందిస్తోంది.  

బెంగళూరు కేంద్రంగా శిక్షణ 

కర్నాటకలోని సాంకేతికతకు కేంద్రంగా మారిన బెంగళూరు నగరంలో ( https://www.qpiai-explorer.tech/certification/ ) అందుబాటులోకి వచ్చింది సువర్ణావకాశం. మన దేశంలో 3500 ఇంజనీరింగ్ కాలేజీలు, 3400 పాలిటెక్నిక్ లు, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు 200 వరకు ఉన్నాయి.ఇవి కాక సుమారుగా 10,000 వరకు సైన్స్ కాలేజీలున్నాయి. ఇంజనీరింగ్ పట్టభద్రులు లేదా విద్యార్థులు మన దేశంలో పది లక్షల మంది వరకు ఉన్నారు. ఇక సైన్స్, మాథ్స్ విద్యార్థుల సంఖ్య 30 లక్షలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న వారి సంఖ్య అయితే 43 లక్షల మంది. మొత్తం ప్రపంచం మీద (స్టెమ్ –STEM –సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్) రంగంలో ఉన్న వారి సంఖ్య 80 లక్షలకు పైమాటే. వీరి సంఖ్య మన దేశంలో 26 లక్షలు కాగా చైనాలో 43 లక్షలు. ఇలాంటి స్టెమ్ రంగంలోని వాళ్లందరికీ (ప్రొఫెషనల్స్ కూడా కలిపి) కృత్రిమ మేథ, క్వాంటమ్ రంగాలలో శిక్షణ ఇవ్వడమే ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. వారికి మరిన్ని నైపుణ్యాలు సంతరింపజేయడడం ముఖ్యమైన ఉద్దేశం. ఈ రకంగా అతి తక్కువ ఖర్చుతో (రూ. 499) కనీసం 120 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని ఆశిస్తోంది. 

ఇందుకు అవసరమైన సాంకేతికత, సాధనాలు సిద్ధం చేసుకుంది. సమీప భవిష్యత్తులో QpiAiప్రొ ఆటోమేటిక్ ప్లాట్ ఫారమ్, QPIక్లౌడ్ సీపీలు (కొలాబరేషన్)ప్లాట్ ఫారమ్, QPIక్లౌడ్, QpiAi క్వాంటమ్, QpiAi లాజిస్టిక్స్ అందుబాటులోకి రానున్నాయి. వాటికంటే ముందు, ప్రపంచంలోనే అతి పెద్దదైన డేటా సెంటర్ అందుబాటులోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు నుంచి 12 నెలల వ్యవధిలో 2,50,000 మంది ఈ శిక్షణకు పేర్లు నమోదు చేసుకుంటారని అంచనా. ప్రస్తుతానికి కేవలం 10,000 మంది మాత్రమే రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు మూడు నెలలు, ఆరు నెలల వ్యవధి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.  


 


2021-10-25  Education Desk

rajapush