6tvnews

Header - Ramky
collapse
...
Home / చదువు / సాటిలేని సాయుధ కొలువులు

సాటిలేని సాయుధ కొలువులు

2021-11-02  Education Desk
venus

nda exam
 

 

పదోతరగతి నుంచి ఉన్నత విద్యార్హతల వరకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా త్రివిధ దళాల్లో ఉద్యోగ ప్రకటనలు వెలువడుతూంటాయి. అయితే, అన్నికంటే ప్రధానంగా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ద్వారా లభించే ఉద్యోగాలకు యువతలో చాలా క్రేజ్‌ ఉంటుంది.  

త్రివిధ దళాలు ఉమ్మడిగా ఎన్‌డీఏ:   

 

ప్రపంచ వ్యాప్తంగా సైనిక శిక్షణలో మంచి గుర్తింపు కలిగిన సంస్థగా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ). ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో  చేరాలనే యువకుల చక్కని మార్గం ఎన్‌డీఏ. ఇంటర్‌ విద్యార్హతతో ఎన్‌డీఏకుకు దరఖాస్తు చేసుకోవచ్చు..రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్, మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేసి ఆయా విభాగాల్లో శిక్షణను అందించి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. యూపీఎస్సీ ఆ«ధ్వర్యంలో  ఏడాదికి  రెండు సార్లు(జనవరి /జూన్‌) అర్హత పరీక్షలను నిర్వహించి దీనిలో ప్రవేశాలను కల్పిస్తారు.   


– అర్హతలు : అవివాహితులైన పురుష అభ్యర్థులు మాత్రమే ఎన్‌డీఏ దరఖాస్తుకు అర్హులు, వయసు 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి.   

– ఎన్‌డీఏ ఆర్మీ విభాగానికి దరఖాస్తుకు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసినవారై ఉండాలి.  

– ఎయిర్‌ ఫోర్స్, నావల్‌ విభాగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు  మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులుగా ఉండి  ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన (10+2) విద్యలో ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి.   

–  మూడు విభాగాలకు సంబంధించి ఆఖరు ఏడాది చదివే వారు కూడా దరఖాస్తుకు అర్హులే.  


ఎన్‌డీఏ పరీక్ష విధానం:  

 

ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్, జనరల్‌ ఎబిలిటీ పేపర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ అబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి. ఒక్కొ పేరర్‌కు 2.30 గంటల చొప్పున రెండు పేపర్లను ఒకే రోజు నిర్వహిస్తారు. దీంట్లో నెగిటివ్‌ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కులో నుంచి 33శాతం కోతగా విధిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఉంటుంది.  

– ఇంటర్వ్యూ: ఎన్‌డీఏ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూ కూడా స్టేజ్‌–1,2 అనే రెండు దశలుంటాయి. మొత్తం 900 మార్కులకు దీనిని నిర్వహిస్తారు. స్టేజ్‌–1కు అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే స్టేజ్‌–2క అనుమతిస్తారు.   

స్టేజ్‌–1 :   

ఈ ఇంటర్వ్యూలో ఆఫీసర్‌ ఇంటలిజెన్స్‌ రేటింగ్‌ (ఓఐఆర్‌), పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్క్రిప్షన్‌ టెస్ట్‌ (పీపీ అండ్‌ డీటీ) పరీక్షలు నిర్వహిస్తారు.   

స్టేజ్‌–2 : ఈ ఇంటర్వ్యూలో గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ టాస్క్‌లు, సైకాలజీ టెస్ట్‌లు, కాన్షరెన్స్‌ ఉంటాయి.  

– పైన రెండు స్టేజ్‌ల్లో అర్హత సాధించిన వారికి మెడికల్‌ టెస్టులు నిర్వహించి మెరిట్‌ కమ్‌ ప్రిఫరెన్స్‌ ఆధారంగా ఆయా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.  


శిక్షణ: ఎన్‌డీఏ పరీక్షల్లో అర్హత సా«ధించిన వారికి ఎడ్యుకేషనల్, ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఆర్మీ, నేవీ,ఎయిర్‌ఫోర్స్‌ విభాగాలకు సంబంధించిన అందరికి ఒకే రకమైన శిక్షణను అందిస్తారు. అలాగే ఇందులో శిక్షణను పూర్తి చేసుకున్న వారికి విభాగాల వారిగా..  

ఆర్మీ : బీఎస్సీ /బీఎస్సీ  (కంప్యూటర్‌) /బీఏ డిగ్రీ  

నేవీ : బీటీక్‌ డిగ్రీ  

ఎయిర్‌ ఫోర్స్‌ : బీటెక్‌ / బీఎస్సీ / బీఎస్సీ (కంప్యూటర్‌)   

పైన తెలిపిన మూడు విభాగాలకు సంబంధించిన డిగ్రీల పట్టాలను ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ(జేఎన్‌యూ)  యూనివర్సిటీ ప్రధానం చేస్తుంది.  


శిక్షణ అనంతరం:  

 

ఎన్‌డీఏ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆర్మీ విభాగం వారిని డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీకి, నేవీ అభ్యర్థులను ఎజిమాలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీకి, ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి హైదరాబాద్, బెంగళూర్‌ల్లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ టెక్నికల్‌ కాలేజీలకు వెళతారు. శిక్షణ అనంతరం ఆయా అకాడమీల్లో లెఫ్టినెంట్‌ హోదా కోసం మరో ఏడాది శిక్షణను అందిస్తారు.   


 


2021-11-02  Education Desk

rajapush