6tvnews

Header - Ramky
collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / డామెన్స్ న్యూ కలెక్షన్

డామెన్స్ న్యూ కలెక్షన్

2021-11-09  Lifestyle Desk
venus

mens fashion
 

ప్రఖ్యాత మెన్స్ వేర్ ఫ్యాషన్ బ్రాండ్ డామెన్స్ పురుషుల కోసం వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించింది. కొత్త రకం టీ షర్ట్స్, పైజమాలు, స్వెట్ షార్ట్స్, జాగర్స్, స్వెట్ షర్ట్స్, హుడీస్ ను మార్కెట్ లో విడుదల చేసింది.  కాటన్ ఎలాస్టిన్ మిశ్రమంతో కూడిన  టీ షర్ట్స్, రాత్రిపూట ఉపయోగించే  పైజమాలు, బహుళ పాకెట్లతో స్లిమ్ ఫిట్ జాగర్స్, స్వెట్ షర్ట్స్, షార్ట్ష్, హుడీస్  కొత్తగా విడుదల చేసిన కలెక్షన్స్ లో ఉన్నాయి. 


ఈ కొత్త రకం టీ షర్ట్స్ 100 శాతం మన్నిక గల కాటన్ తో తయారు చేసారు. ఇవి హెన్లీస్, ఫుల్ స్లీవ్స్ మోడల్ లో లభిస్తాయి. అలాగే సాఫ్ట్గ్  ఫ్రెంచ్ టెర్రీ తో  క్లాసిక్ షేడ్స్ లో తయారు చేసిన  జాగర్స్ ను కూడా డామెన్స్  అందుబాటులోకి తీసుకు వచ్చింది. పూర్తి సౌకర్యవంతంగా, స్టైల్ గా ఉండేలా ప్రీమియం కాటన్ మిశ్రమంతో ఫ్రెంచ్ టెర్రీ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన స్వెట్ షార్ట్స్, స్వెట్ షర్ట్స్, హుడీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. 


ఈ కొత్త కలెక్షన్ష్ విడుదల సందర్భంగా డామెన్స్ సహ వ్యవస్థాపకుడు అనురాగ్ సాబూ మాట్లాడుతూ..గతంలో ఉన్న పురుషుల టీ షర్ట్స్ వల్ల మూడు ప్రధాన సమస్యలు వస్తున్నట్టు గుర్తించామన్నారు. నెక్ లైన్స్ వదులుగా ఉండడం,ఒకటి రెండు ఉతుకులకే  రంగులు వెలిసిపోవడం వంటి లోపాలు గమనించామని ఆయన చెప్పారు. దాంతో  డామెన్స్ కొత్త ఆవిష్కరణ చేపట్టిందన్నారు. మెరుపు, సున్నితత్వంతో పాటు మన్నిక గల వస్త్రంతో తమ ఉత్పత్తులను తయారు చే స్తోందన్నారు. నడుస్తున్న ఫ్యాషన్ పట్ల తమ నిబద్ధతకు నిలకడైన కలెక్షనే నిదర్శనమని అన్నారు. 


సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు గౌరవ్ పుష్కర్  మాట్లాడుతూ, ఆధునిక పురుషప్రపంచానికి అనువైన అవసరమైన విధంగా చక్కటి అనుభూతినిచ్చే ఫ్యాషన్ వస్త్రాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నించామన్నారు. ప్రస్తుతం  ఉన్న స్టీరియో టైప్ దుస్తుల స్థానంలో  మన్నిక గల వస్త్రంతో నూతన ఆవిష్కరణలు తీసుకురావడంపైనే తాము ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామన్నారు.  డామెన్స్ మన్నికకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఎంతో విశ్వాసం ఉందన్నారు. ఈ క్రమంలో నూరు శాతం మన్నిక గల కాటన్ ఫ్యాబ్రిక్ తో ఉత్త్పత్తులను అందించేందుకు తాము ముందడుగు వేస్తున్నామని చెప్పారు.  


ప్రస్తుతం డామెన్స్  వెస్ట్,బ్రీఫ్,ట్రంక్స్,ట్యాంక్ టాప్స్, బాక్సర్స్ వంటి ఇన్నర్ వేర్  ను అందిస్తోంది. వెదురు కలపతో తయారు చేసిన ఫ్యాబ్రిక్, మన్నికైన రంగులు, సుదీర్ఘ కాలం మన్నిక ఇచ్చే వస్తువులతో నూతన సాంకేతిక విధానాలను ఉపయోగించి ఉత్తమ రకం దుస్తులను అందిస్తోంది డామెన్స్ బ్రాండ్  


 


2021-11-09  Lifestyle Desk

rajapush