6tvnews

Header - Ramky
collapse
...
Home / బిజినెస్ / టెక్నాలజీ / హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ రంగంలోకి ఎలాన్ మస్క్

హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ రంగంలోకి ఎలాన్ మస్క్

2021-11-20  Business Desk
venus

elon musk starlink
 

అపర కుబేరుడు మస్క్ సొంతంగా అంతరిక్షంలోకి శాటిలైట్‌ పంపించారు.  భారతదేశంలో బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ రంగంలోకి కూడా ఆయన ప్రవేశించనున్నారు. ఈ మేరకు సంస్థను రిజష్టర్‌ కూడా చేశారు. దాని పేరు స్టార్‌లింక్‌ . అది టాప్‌ లెవెల్‌ ఎగ్జిక్యూటివ్‌ల  రిక్రూట్‌మెంట్‌లను కూడా ప్రారంభించింది. ఇక దేశవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్‌ సర్వీసులకు శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యంగా గ్రామీణ భారత్‌పై  ఫోకస్‌ పెట్టబోతోంది. 

కొన్నినెలల క్రితం స్పెస్ ఎక్స్ స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరు తో భారత్ లో రిజిష్టర్‌ చేసుకుంది. ఇక స్గార్‌లింక్ చేయల్సింది ప్రభుత్వానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడమే. లైసెన్సు దక్కిన వెంటనే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు ప్రారంభిస్తుంది. 

స్టార్‌లింక్‌ ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే సెల్ నెట్‌వర్క్ లేదో ఆ ప్రాంతాల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు అందించడం.  భారత్ ప్రాజెక్టు కోసం స్పెస్ ఎక్స్ రెండు శాటిలైట్లను భూకక్ష్యకు దగ్గరగా ఉండేలా ప్రవేశపెట్టింది.  దీనివల్ల  స్టార్ లింక్ కనెక్షన్ తీసుకున్న వారికి ఇంటర్నెట్‌ కనెక్టివిటి బలంగా ఉంటుంది.  

ఇళ్లకు టీవీ కనెక్షన్ల కోసం డీటిహెచ్‌ ఎలా వినియోగిస్తామో అలానే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కావాలనుకునే వారు డిష్‌ ఎంటెన్నాతో పాటు దానికి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్టార్‌లింక్‌ దీనికి సంబంధించిన కిట్‌ను అందిస్తుంది. దీనికి సంబంధించి ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలలను ఎంపిక చేసు కుంటుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ చుట్టు పక్కల సుమారు వంద పరికరాలతో ట్రయల్స్‌ నిర్వహిస్తుంది. అటు తర్వాత కంపెనీ క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తుంది. 

ఈ ఏడాది ప్రారంభంలోనే స్టార్‌ లింక్‌ ముందస్తు ఆర్డర్‌ల బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. స్టార్‌లింక్‌ కనెక్షన్‌ కావాలనుకునే వారు ముందుగా ఏడు వేల రూపాయలను చెల్లించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  మొత్తానికి మస్క్‌ రాకతో దేశంలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ వ్యాపారంవేడెక్కడం ఖాయం. కాకపోతే కిట్ రేటు ఎక్కువగా ఉండడం, సేవలకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావడం వంటి అంశాలు ప్రభావం కనబర్చనున్నాయి. వాటిని మస్క్ ఎలా అధిగమిస్తారో వేచిచూడాల్సిందే. 


 


2021-11-20  Business Desk

rajapush