6tvnews

Header - Ramky
collapse
...
Home / ఆరోగ్యం / చర్మ సంరక్షణ / చర్మ సంరక్షణకు చిట్కాలు

చర్మ సంరక్షణకు చిట్కాలు

2021-11-21  Health Desk
venus

anti ageing
 

ఆథునిక కాలంలో చర్మ సౌందర్యం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అయితే వాతావరణ మార్పులు, కాలుష్యంతో చిన్న వయసులోనే చర్మం పలుమార్పులకు లోనవుతూ వృద్ధాప్య ఛాయలు కనబడుతూ ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో పలు రసాయనపూరిత పదార్ధాల వాడకంతో కాల క్రమంలో అదనపు సమస్యలు తలెత్తే ప్రమాదం పఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నిత్య యవ్వనంతో నిగనిగలాడే చర్మానికి హానికలిగించని పదార్ధాలను, మందునే వాడాలని నిపుణులు సూస్తున్నారు. డాక్టర్ గీతికా మిట్లల్ చర్మ సౌందర్యానికి సంబంధించి కొన్ని చిట్కాలు అందిస్తున్నారు. అవి ఏంటో ప్పుు చూద్దాం.   


చర్మ సంరక్షణ విషయంలో వాణిజ్య ఉత్పత్తుల కోసం గుడ్డిగా వెంపర్లాడకుండా ఉండటం మంచిది. చర్మవ్యాధి నిపుణుడి సూచనలు పాటించడం మంచిది. చర్మంలో మార్పులు సాధారణంగా  ఇరవైల మధ్య మయసులో ప్రారంభమవుతుంది. పెద్దయ్యాక అభివృద్ధి చెందుతుంది. ప్రతి పదేళ్ళకోసారి  చర్మ లక్షణానికి అనుగుణంగా  సరైన పదార్థాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. 


ఇరవై ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు, లాక్టిక్ యాసిడ్ వంటి సున్నితమైన ఎక్స్‌ఫోలియెంట్‌లను మాత్రమే ఉపయోగించాలి.  ఈ వయస్సులో విటమిన్ సి, ఎస్ పీఎఫ్ ఉపయోగించాలని డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా సిఫార్సు చేస్తున్నారు. ఎస్ పీఎఫ్ ని ఎంత త్వరగా ఉపయోగించడం ప్రారంభిస్తే అంత మంచిదని ఆమె సూచిస్తున్నారు. మరియు దానిని ఎప్పటికీ ఉపయోగించడం మంచిదంటున్నారు. 


ముప్పై  ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తులకు వృద్ధాప్య ప్రభావాలను నివారించడానికి ఇతర పదార్థాలు అవసరం.  ఆ సమయంలో "రెటినోల్ మీ బెస్ట్ ఫ్రెండ్ గా ఉపయోగపడుతుందని ఆమె చెబుతుపన్నారు. అలాగే, ఫెరులిక్ యాసిడ్ వంటి రసాయన ఎక్స్‌ఫోలియెంట్‌లకు మారాలని చెప్పారు. 40 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తులకు, యాంటీ ఏజింగ్ స్కిన్ రొటీన్ వారి 30 ఏళ్లలో కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. కానీ వారు పెప్టైడ్స్, విటమిన్ ఇ తో పాటు మరిన్ని యాంటీఆక్సిడెంట్లను కూడా వాడాల్సి ఉంటుందన్నారు.   


చర్మ సంరక్షణ కోసం దినచర్యలో ప్రధానంగా 3 పద్ధతులను మరింత ప్రభావవంతంగా మార్చుకోవాలని సూచించింది. వీటిలో ఫిజికల్ ఎక్స్‌ఫోలియేటర్‌ను కెమికల్‌తో, రోజ్‌వాటర్‌ను ఎక్స్‌ఫోలియేటింగ్ మిస్ట్‌తో మార్చుకోవడం మరియు మేకప్ వైబ్‌లకు బదులుగా డబుల్ క్లీన్సింగ్‌కు వెళ్లాలని ఆమె సూచించింది.  


చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి నాణ్యమైన స్క్రబ్‌లను ఉపయోగించాలని ఆమె సూచించారు. మార్పులు ఏమైనా గమనిస్తే తప్పకుండా వారి వైద్యులను సంప్రదించి, వారికి ఉత్తమంగా పనిచేసే దినచర్యను రూపొందించుకోవాలని కూడా చెప్పింది.  


కాబట్టి, చర్మ సంరక్షణ కోసం సరైన రకమైన ఉత్పత్తులను ఎంచుకోవడం మొదటి అడుగు. మీ వయస్సులో కూడా ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడంలో ఇది అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. అంటే వయసు మీరిన తర్వాతనుంచి కాక వయసులో ఉన్నప్పటి నుంచే చర్మ సంరక్షణకుయ తగు జాగ్రత్తలు తీసుకవాలని ఆమె సూచించారు 


 


2021-11-21  Health Desk

rajapush