6tvnews

Header - Ramky
collapse
...
Home / ఆరోగ్యం / వెయిట్ లాస్ / అధిక శరీర బరువు ... తగ్గించుకోవడం ఎలా?

అధిక శరీర బరువు ... తగ్గించుకోవడం ఎలా?

2021-11-21  Health Desk
venus

weight loss1
 

నేటి యువతలో అధిక శరీర బరువు అనేది పెద్దసమస్యగా మారింది. శరీరం బరువు అదుపు చేసుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిలో కొన్ని సమస్యను పెంచేవి కూడా. ఇక్కడ శరీరం బరువు తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలు తెలుసుకుందాం.   

వైవిధ్యంతో కూడిన ఆహారం ముఖ్యమైనది. పోషక విలువలు ఉండేలా చూసుకోవడం అందులో అతి ముఖ్యమైన అంశం. ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారం – అది భోజనమైనా, అల్పాహారమైనా – మానవ జీవన గమనంలో అతి ముఖ్యమైనది. రోజూ మనం తీసుకునే ఆహారంలో సగభాగం పండ్లు, కూరగాయలు వంటివి ఉండాలి. మరో 25 శాతం హోల్ గ్రెయిన్స్ ఉండాసి. మరో 25 శాతం ప్రొటీన్లు ఉండాలి. మొత్తం ఆహారంలో ఫైబర్ భాగం రోజుకు కనీసంగా 25 నుంచి 30 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. ట్రాన్స్ ఫాట్స్ కోటా చాలా తక్కువగా ఉండాలి. శాచురేటెడ్ ఫాట్స్ వల్ల గుండె జబ్బులకు అవకాశాలు ఎక్కువ. వాటికి బదులుగా మోనో అన్ శాచురేటెడ్ (MUFA) లేదా పోలీఅన్ శాచురేటెడ్ యాసిడ్స్ (PUFA) వంటివి ఉపయోగించాలి.  

ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలలో ముందుగా చెప్పుకోవలసినవి – తాజా కూరలు, పండ్లు, చేపలు, దుంపలు (లెగూమ్స్), గింజలు (నట్స్), సీడ్స్, హోల్ గ్రెయిన్స్ (బ్రౌన్ రైస్, ఓట్ మీల్ వంటివి) మంచిది.  

నిషేధించవలసిన ఆహార పదార్ధాలు – నూనె చేర్చిన వంటకాలు, వెన్న, మీగడ, చక్కెర, ఫాటీ రెడ్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం, బేక్ డ్ ఫుడ్స్ అంటే ఒక రకం రొట్టెలు, వైట్ బ్రెడ్, ప్రాసెస్ చేసిన పదార్ధాలు 

కొన్ని ఆహార పదార్ధాలను ఆహారంలో భాగంగా తీసుకోకపోతే నష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరానికి అత్యవసరమైన విటమిన్లు, మినరల్స్ లభించవు. ఈ విషయం ఆహార నిపుణులు వివరించగలరు. 

స్వయం నియంత్రణ చాలా కీలకం. తీసుకుంటున్న ఆహారం – శరీరం బరువు లెక్కలను రోజూ నమోదు చేసుకోవాలి. అంటే ఆహారంలో భాగంగా తీసుకుంటున్న పదార్థాల చిట్టా, బరువు తీరును వారానికి ఒకసారి నమోదుచేసుకోవాలి. అందుకు అనువైన యాప్స్ లేదా వెబ్ సైట్ సాయం తీసుకోవచ్చు. ఇలా జాగ్రత్తగా పరిశీలించుకునే వారు సరైన ఆహారం ఎంపికచేసుకోగలుగుతారు. అప్పుడప్పు బాడీ మాస్ ఇండెక్స్ (BMI) గమనిస్తూ ఉంటే ఇంకా మంచిది. 

వ్యాయామం చాలా కీలకం. ప్రతి రోజూ క్రమపద్ధతిలో శారీరిక వ్యాయమం చేస్తూ ఉండాలి. ఇలా రోజూ వ్యాయమం చేయడం వల్ల శరీరానికి, మానసిక స్వస్థతకు కూడా ఉపయోగకరం. వ్యాయామం సమయం పెంచుతూ పోతే అధిక బరువు అదుపులోకి వస్తుంది. రోజుకి ఓ గంట తీవ్ర స్థాయిలో వ్యాయామం లేదా చురుకుగా కదిలే నడక లాభదాయకం. రోజూ గంట సేపు సాధ్యం కాకపోతే వారంలో 150 నిముషాలు ఇలా తీవ్ర స్థాయి వ్యాయామం మంచిదని మయో క్లినిక్ నిపుణులు సూచిస్తుంటారు. ప్రారంభంలో నెమ్మదిగా ప్రారంభించి ఉధృత స్థాయికి తీసుకెళ్లాలి. ఆ విధంగా దినచర్యలో భాగంగా మార్చుకోవాలి. వ్యాయామం నేరుగా ప్రారంభించడం ఇబ్బందిగా ఉంటే ముందుగా మెట్లు మీదుగా ఎక్కడం, ఆకులు అలములు ఏరివేయడం, కుక్కను తీసుకుని వాకింగ్ చేయడం, తోట పనులు చేయడం, డాన్సింగ్, అవుట్ డోర్ గేమ్స్ ఆడడం, వాహనాలకు గమ్యంలో దూరంగా పార్కింగ్ చేయడం మొదలైనవి చేపట్టవచ్చు. 

పానీయాలు – కేలరీలు – కొన్ని పానీయాలు కేలరీలను పెంచుతాయి. ఇలాంటివి మంచిది కాదు. షుగర్ కలిసిన సోడా, టీ, జ్యూస్, లేదా ఆల్కహాల్  వాటిలో కొన్ని. ఇవి ఎలాంటి పోషకాలు లేకున్నా శరీరంలోకి కేలరీలను జమచేస్తాయి. దాహం కోసం తాగాలని పిస్తే మంచినీరు లేదా నిమ్మ, ఆరెంజ్ రసం కలిపిన నీరు, షుగర్ చేర్చకుండా కాఫీ, టీ తీసుకోవచ్చు. డీహైడ్రేషన్ సమస్యను ఆకలిగా పొరపడరాదు. షెడ్యూల్డ్ భోజన సమయాల మధ్య ఆకలిగా అనిపిస్తే నీరు తాగితే సరిపోతుంది. 

అధికంగా ఆహారం తీసుకోవడం సరికాదు. ఎంత తక్కువ కాలరీలు ఉన్న కూరగాయల వంటి పదార్ధాలైనా సరే మంచిది కాదు. ఇవి శరీరం మరింత బరువు పెరగడానికి కారణమవుతాయి. ఇలాంటి వాటిని పరిమితంగానే ఒక కొలత మేరకే తీసుకోవాలి. ఈ సందర్భంలో సరదాకి ఒక లెక్క చూద్దాం. కప్పులో ¾ వంతు అంటే గోల్ఫ్ బాల్ సైజు అయితే, అర కప్పు అంటే టెన్నిస్ బాల్ అనీ, ఫుల్ కప్పు అంటే బేస్ బాల్ సైజు అనీ అర్థం చేసుకోవాలి. 


2021-11-21  Health Desk

rajapush