6tvnews

Header - Ramky
collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / టెస్టుల్లో శ్రేయాస్ అయ్యర్ అరంగేట్రం

టెస్టుల్లో శ్రేయాస్ అయ్యర్ అరంగేట్రం

2021-11-24  Sports Desk
venus

India Vs New_zealand
 

టీ20 సిరీస్ గ్రాండ్ విక్టరీ అనంతరం టీమిండియా మంచి ఊపుమీద ఉంది. న్యూజిలాండ్ జట్టుతో టెస్టు సిరీస్ కు సిద్ధమయింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అజింక్యా రహానే స్పందించాడు. కివీస్ జట్టును భారత్ ఎలా ఎదుర్కోనుందో తెలిపాడు. శ్రేయాస్ అయ్యర్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించాడు. కాన్పూర్ నగరంలో జరిగే తొలి టెస్టు తుదిజట్టులో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడని తెలిపాడు. టీ 20లు, వన్డే మ్యాచుల్లో మంచి ప్రతిభ చూపిన శ్రేయాస్ అయ్యర్ టెస్టుల్లో ఏ విధంగా రాణిస్తాడో త్వరలోనే తేలనుంది.

భారత జట్టు టీ 20 జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ కూడా తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అజింక్యా రహానే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. కాన్పూర్ నగరంలో జరిగే తొలి టెస్టులో భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్ సలహాలతో తొలి టెస్టులో విజయం సాధించేందుకు సిద్ధమయ్యాడు.

జట్టు విజయమే కీలకం 

2021 రహానే ఆడిన 11 మ్యాచుల్లో కేవలం 372 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ టూర్ లో తన ప్రతభను చాటలేకపోయాడు. తన ఫామ్ లేమిపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు రహానే చాలా ధృడంగా సమాధానం ఇచ్చాడు. ఆడిన ప్రతి గేమ్ లోనూ సెంచరీ సాధించడమే ప్రతిభకు కొలమానం కాదని రహానే స్పష్టం చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో 30, 40 పరుగులు చేసినా అది సరిపోతుందని సమర్ధించుకున్నాడు. జట్టు విజయమే తనకు ప్రధానమని తేల్చి చెప్పాడు. తన ఫామ్ గురించి ఆందోళన చెందడం లేదని తెలిపాడు. 

రాహుల్ ద్రావిడ్ సూచనలు, సలహాలు 

కివీస్ జట్టుతో జరిగిన టీ 20 సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ కాంబినేషన్ మంచి ఫలితాలు సాధించింది. టెస్టు సిరీస్ ప్రారంభ మ్యాచ్ రహానేకు సవాలుగా మారింది. రాహుల్ ద్రావిడ్ సలహాలతో మంచి గేమ్ ప్లాన్ సిద్ధం చేశామని.. ఆ ప్రకారం ముందుకు వెళతామని రహానే తెలిపాడు. తమపై తాము గట్టి నమ్మకం పెట్టుకోవాలని, ఇతర విషయాలను అస్సలు పట్టించుకోవద్దని రాహుల్ ద్రావిడ్ తమకు సలహా ఇచ్చాడని రహానే వివరించాడు. 

 


2021-11-24  Sports Desk

rajapush