6tvnews

Header - Ramky
collapse
...
Home / వినోదం / తెలుగు / అత్తారింటికి వ‌చ్చిన స‌మంత‌?

అత్తారింటికి వ‌చ్చిన స‌మంత‌?

2021-11-25  Entertainment Desk
venus

samantha prabhu
Picture Courtesy : Instagram / Samanthaprabhuworld

స‌మంత రూత్ ప్ర‌భు... స్యామ్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఇక ఈమె టాలెంట్ గురించి మ‌న తెలుగు ఆడియ‌న్స్‌ కి  ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎటువంటి పాత్రనైనా స‌రే ఉతికి ఆరేస్త‌ది అంతే... స‌మంత అక్కినేని అని పిల‌వాల్సింది.. కాస్త మ‌ళ్ళీ స‌మంత రూత్ ప్ర‌భుగా అయిపోయింది. నాగ చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత స‌మంత త‌న కెరీర్‌పై ఫోక‌స్ పెట్టింది. ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో చెమ‌టోడుస్తుంది. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ కుర్ర హీరోయిన్స్‌కు కూడా షాకులిచ్చేలా రెఢీ అవుతుంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో అయితే స‌మంత వ‌రుస పోస్ట్‌ల‌ను చేస్తూ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. సాధార‌ణంగానే కాకుండా హాట్ డ్రెస్సుల‌తో అద‌ర‌గొట్టేస్తోంది. రీసెంట్‌గా రెడ్ డ్రెస్సులో స‌మంత హాటు ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేసేస్తున్నాయి. ఇదంతా చూసిన కొంద‌రు దీని వెనుక స‌మంతకు బ‌ల‌మైన కార‌ణ‌ముంద‌ని అంటున్నారు. అస‌లు స‌మంత డిఫ‌రెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌తో, హాట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేస్తూ రావ‌డాన్ని గ‌మ‌నించిన కొంద‌రు దీన్ని రివేంజ్ డ్రెస్సింగ్ అంటార‌ని కూడా అంటున్నారు.  

ల‌వ్ బ్రేక‌ప్‌, భ‌ర్త నుంచి విడిపోయిన త‌ర్వాత స‌ద‌రు మ‌గ‌వాడు అసూయ ఫీల‌య్యేలా.. తాను ఏం కోల్పోయానో తెలియ‌జేసేలా అమ్మాయి అలా డ్రెస్సింగ్ చేసుకుంటార‌ని నెట్టింట వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే... స‌మంత మ‌ళ్ళీ అత్తారింటికి వ‌చ్చిందంట ఎప్పుడా అనుకుంటున్నారా.. చైతో విడిపోయిన త‌ర్వాత మ‌ళ్ళీ తిరిగి నిన్న‌నే స్యామ్ అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి వెళ్ళింద‌ట‌. ఇదేంటి... ఆమెకు అక్క‌డేం ప‌ని అనుకుంటున్నారా.. మ‌ళ్ళీ తిరిగి అత్తారింటికి వ‌చ్చేసింది అనుకుంటే మీరంతా ప‌ప్పులో కాలేసిన‌ట్లే... స్యామ్ న‌టిస్తున్న శాకుంత‌లం చిత్రం త‌న పార్ట్ వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక దానికి సంబంధించిన డ‌బ్బింగ్ కోసం అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి రావ‌డం జ‌రిగింది. దీంతో అక్క‌డున్న‌వారంద‌రూ స్యామ్ మ‌ళ్ళీ అత్తారింటికి వ‌చ్చేసింది అని చెప్పి గుస‌గుస‌లాడుకున్నారు.  ఇక ఇదే నిజ‌మైతే ఎంత బావుండు అని అభిమానులంతా ఎంతో ఆశ‌క్తిగా చెవులుకొరుక్కున్నారు. కానీ ఇక అది జ‌ర‌గ‌ని ప‌ని అని మ‌రికొంత‌మంది నిరాశ‌ను వ్య‌క్తం చేశారు. 


 


2021-11-25  Entertainment Desk

rajapush