6tvnews

Header - Ramky
collapse
...
Home / క్రీడలు / ఐపిఎల్ / ధోనీ అభిమానులకు శుభవార్త

ధోనీ అభిమానులకు శుభవార్త

2021-11-25  Sports Desk
venus

Dhoni ms
 

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ అభిమానులకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. ధోనీని మరో మూడేళ్లపాటు రిటైన్ చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ధోనీతో పాటు రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ లను కూడా సీఎస్కే జట్టులో కొనసాగించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2021 ఐపీఎల్ టైటిల్ విజేతగా చెన్నై జట్టు నిలవడంలో రుతురాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని రిటైన్ చేయాలని యాజమాన్యం భావిస్తోంది. 

బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రతి ఐపీఎల్ జట్టు నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లతో పాటు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మోయిన్ అలీని కూడ రిటైన్ చేసుకోవాలని భావిస్తోంది. మోయిన్ అలీ రావడం సాధ్యం కాకపోతే మీడియం పేసర్ సామ్ కరన్ ను నాల్గవ ప్లేయర్ గా తీసుకోవాలని  CSK భావిస్తోంది.

2022లో ఐపీఎల్ టోర్నీలో స్వదేశంలోనే జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా ఇటీవలే స్పష్టం చేశారు. దీంతో భారత దేశంలో స్టేడియం పిచ్ ల స్వభావాన్ని బట్టి ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు ఫ్రాంచైజీలు మొగ్గు చూపుతున్నాయి. 

నా చివరి టీ 20 మ్యాచ్ చెన్నైలోనే 

మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవలే చేసిన ఓ వ్యాఖ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నా చివరి టీ 20 మ్యాచ్ చెన్నైలోనే ఆడతానని ధోనీ అనడంతో అభిమానుల్లో ఆందోళన మొదలయింది. ఐపీఎల్ మ్యాచులకు కూడా తమ అభిమాన ప్లేయర్ దూరంగా కానున్నాడా అనే సందేహాలు మొదలయ్యాయి. తాజాగా సీఎస్కే చేసిన ప్రకటన ఆ అనుమానాలను పటాపంచలు చేసింది.

 


2021-11-25  Sports Desk

rajapush