మార్గశిరమాసం (05-12-2021 నుండి 02-01-2022 వరకు)
మేషం
వ్యాపారమందు అభివృద్ధి , మంచి ఆరోగ్యం , ఇంటియందు శుభకార్యములు చేయుట , గృహనిర్మాణం , నూతన వాహన , ఆభరణాలు కొనుట , ప్రయాణ లాభాలు , విద్యార్థులకు మంచిర్యాంకులు , మంచి ఉద్యోగాలు , ప్రమోషన్లు , ఇంక్రిమెంట్లు , విదేశీ ప్రయాణాలు , బంధువులతో , స్నేహితులతో కలయిక , సంతోషం , గృహమందు ఆరోగ్యములు , అన్ని వ్యాపారాలలో మంచి లాభం.
వృషభం
గురువు వల్ల నూతన వ్యాపారం ఆరంభించుట. వ్యాపారమందు లాభాలు , విద్య యందు ఉత్తీర్ణత , మంచి ఉద్యోగం , ఉద్యోగమార్పు కలుగును. శుభ కార్యములు చేయుట , బంధుమిత్రుల కలయిక , మృష్టాన్న భోజనం , వాహనసౌఖ్యం , ఇష్టమైనవి సిద్ధించుట , దీర్ఘకాలిక వ్యవహారములో జయం , భార్యపుత్రులతో దైవపూజలు , తీర్థయాత్రలు చేయుట , శనివల్ల అకారణ కలహములు , చెడుఫలితములు కలుగును. మీరు ప్రతినిత్యం దేవతాదర్శనం చేయుదురు.
మిథునం
గురువు వల్ల మంచి ఉద్యోగం , ప్రమోషన్లు , ఇంక్రిమెంట్లు , గణిత సంబంధ లాభములు , శనివల్ల దుబారా తిరుగుట , మాన సిక ఆందోళన , భయం , ప్రయాణ ప్రమాదములు కలుగును. దేవత దర్శనములు , తీర్థయాత్రలు చేస్తారు. మీరు విష్ణు సహస్ర నామ స్తోత్రం చేయగలరు .
కర్కాటకం
చేయు వృత్తి వ్యాపారము నందు విశేషమైన ఆటంకములు , ప్రయాణ నష్టములు , వృధా తిరుగుట , స్థానచలనములు , మనస్సు నందు భయము. ఇష్టమైన వసువులు ఏదో అమ్ముట , ఉద్యోగభంగము , తీర్థయాత్ర చేయుట , దేవతా దర్శనములు కలుగును. మీరు నవగ్రహ స్తోత్రము చేయగలరు .
సింహం
అన్ని రంగాల వారికి విశేషించి లాభములు. నూతన వస్తువాహన అభరణములు కొనుట. శుభకార్యములు చేయుట , బంధుమిత్రులుకలయిక , అన్నదమ్ములతో కూడి యుండుట , విద్యాలాభములు , మంచి ఉద్యోగము , శత్రుజయము , అనుకొన్న పనులు నెరవేరును. కుటుంబము నందు సంతోషము , శ్రమకు తగ్గపనులు , చేసి ఆనందము పొందుట. ఈ మాసమంతయు శుభపరిణామములే ఎక్కువగా ఉండును .
కన్య
ఇంటియందు శుభకార్యములు చేయుటచే డబ్బునిల్వలు పోవుట , అన్ని రంగాల వారికి అన్ని ఆటంకములే ఎక్కువ. ప్రయాణ ప్రమాదములు , శస్త్ర చికిత్సలు , ధైర్యము లేకుండుట , ఇంటియందు కలహములు , శ్రమకు మించిన పనులు చేసి ఇబ్బందులు పడుట , అకాల కలహములు , మంచిచేయబోతే చెడు అగుట , అసందర్భ ప్రేలాపణ , అధికమైన కోపం , అధికారుల నుండి చివాట్లు పడుట. మీరు నిత్యము నవగ్రహస్తోత్రము చేయగలరు.
తుల
రవి-గురులు శుభులు. ఏ పని చేసినా అవలీలగా నెరవేరును. వ్యాపారమందు విశేషించి లాభములు. ఇంటియందు శుభ కార్యములు చేయుట , మంచి విద్య , మంచి ఉద్యోగము , ఇతరులకు సహాయము చేయుట , ప్రయత్నించిన పనుల నెరవేరుటచే ఆనందం , శ్రమకు తగిన పనులు జేయుట , ఇంటియందు అందరికి ఆరోగ్యం , భార్య పుత్రులతో దేవతా పూజలు , దైవదర్శనములు చేయుదురు.
వృశ్చికం
గురువు వల్ల మంచి ఉద్యోగము ప్రమోషన్లు , ఇంక్రిమెంట్లు ,గణిత సంబంధ లాభములు , శుభ కార్యములు చేయుట , గృహ నిర్మాణం , భూ , గృహ ధన ధాన్య లాభములు , శనివల్ల దుబారాగా తిరుగుట , మానసిక ఆందోళన , భయం , ప్రయాణ ప్ర మాదములు కలుగును. దేవతా దర్శనములు , తీర్థయాత్రలు సల్పుదురు. మీరు విష్ణుసహస్రనామ స్తోత్రము చేయగల రు.
ధనస్సు
చేయు వృత్తులందు ఆటంకములు. విద్యా-ఉద్యోగభంగము. పై అధికారుల నుండి వత్తిడి , అధిక ధనవ్యయం , అధిక శ్రమ , వ్యాపారమందు నష్టాలు , మనో విచారం , వ్యవహారమందు చికాకులు , వ్యర్ధ సంచారం , అనవసరపు తగాదాలు , విలువైన వస్తువులు అమ్ముట , అనారోగ్యం , పరాధీనత , ఔషదసేవ , శక్తికి మించిన పనులు చేసి ఆపదలు పొందుట , ఇంటి యందు సఖ్యత లేకుండుట , రుణబాధలు , చికాకులు , మితిమీరిన కోపము ఉండును. కావున మీరు దైవదర్శనములు చేయగలరు.
మకరం
గురువు వల్ల ఇంటియందు శుభకార్యములు చేయుట , గృహనిర్మాణము , వ్యాపారమందు లాభములు , భూ , గృహ , ధన , ధాన్యలాభములు , మంచి ఉద్యోగం , పదోన్నతి , ఉద్యోగ మార్పు ప్రయాణ లాభములు , మంచి కార్యసాధన ఉండును. సాడెసాత్ శనివల్ల అనారోగ్యము , చేయు పనులందు ఆటంకములు , మానసిక వ్యధ , ఇష్టమైన వస్తువులు అమ్ముట , మనస్సునందు అశాంతి కలుగును. ప్రతినిత్యము శనిస్తోత్రం చేయగలరు.
కుంభం
రవి-కుజులు శుభులు. ప్రయత్నపూర్వకంగా తలచిన పనులు నెరవేరును. గృహనిర్మాణం , శుభకార్యములు చేయుట , ప్రయాణ లాభములు , మానసిక ఉల్లాసం , వినోదవిలాస కార్యక్రమమునకు వస్తుసేకరణ , ఉద్యోగమార్పు , మృష్ఠాన్న భో జనం , ఇంటి యందు బంధుమిత్రుల సమాగమం , తీర్ధయాత్రలు సల్పుట , భార్య పుత్రులతో దేవతాపూజలు , సత్పురు షుల దర్శనం , గురు - శని వల్ల జాగ్రత్త అవసరం , దైవదర్శనం చేయుము.
మీనం
అన్ని రంగాల వారికి విశేషించి లాభములు. నూతన వస్తువాహన ఆభరణములు కొనుట , శుభకార్యములు చేయుట , బంధుమిత్రులు కలయిక , అన్నదమ్ములతో కూడియుండుట , విద్యాలాభములు , మంచి ఉద్యోగం , శత్రుజయం , అను కొన్న పనులు నెరవేరును. కుటుంబం నందు సంతోషం , శ్రమకు తగ్గపనులు చేసి ఆనందము పొందుట. ఈ మాస మంతయు శుభపరిణామములే ఎక్కువగా ఉండును.
ఓరుగంటి నాగరాజశర్మ సిద్ధాంతి పుష్పగిరి పీఠ మహాసంస్థాన ఆస్థాన జ్యోతిష్య విద్వాంసులు
Phone Number: 90008 32323