6tvnews

collapse
...
Home / తెలంగాణ / యాదాద్రి / అన్విత రెడ్డి శిఖర పర్యటన

అన్విత రెడ్డి శిఖర పర్యటన

2021-11-27  News Desk

ANVITHA 5
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్విత రెడ్డి రష్యా దేశంలో ఎత్తైయిన శిఖరం మౌంట్ ఎల్ బ్రూస్ శిఖరాన్ని అధిరోహించటానికి రష్యాకి బయలు దేరింది. ఈ శిఖరాన్ని చలికాలంలో అధిరోహించటానికి వెళ్తున్న మొదటి దక్షిణాది రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా రికార్డు కెక్కనుంది. అక్కడ మైనస్  40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని వాతావరణ ప్రతికూలతల మధ్య శిఖరాన్ని అధిరోహించటం అతి పెద్ద సవాలుతో కూడుకున్న విషయమని అన్విత రెడ్డి తెలిపింది.

నవంబర్ 30న ప్రారంభం 

ఈ నెల  30 నుంచి మౌంట్ ఎల్ బ్రూస్ పర్వతాన్ని అధిరోహించటం ప్రారంభిస్తానని సుమారు డిసెంబర్ 3 లేదా 4వ తేదీల్లో శిఖరాగ్రానికి చేరుకుంటాన్నని అన్విత రెడ్డి ధీమా వ్యక్తం చేసింది. మౌంట్ ఎల్ బ్రూస్ పర్వతారోహణ చేయటానికి బిజెపి నాయకులు గూడూరు నారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగభూషణం భువనగిరి పురపాలిక కౌన్సిలర్ చిన్నస్వాతి మహేష్ ఆర్ధిక సహాయం చేశారని అన్విత రెడ్డి వెల్లడించింది. తనను ప్రోత్సహించి, ఆర్ధిక సాయం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. 

గతంలో కిలిమంజారో అధిరోహణ 

ఆఫ్రికాలోని ఎత్తైయిన శిఖరం కిలిమంజారో కూడా అన్వితా రెడ్డి అధిరోహించింది. కిలిమంజారో అధిరోహించటానికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకరించారని అన్విత వెల్లడించింది.


2021-11-27  News Desk