collapse
...
Home / లైఫ్ స్టైల్ / పర్యాటకం / పల్లె సీమల అందాలకు నెలవు - ఎల్లా - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News...

పల్లె సీమల అందాలకు నెలవు - ఎల్లా

2021-12-05  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

 

srilanka Ella
శ్రీలంకలో అనేక ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఎల్లా ప్రాంతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. కొండ సానువులకు చేరువుగా ఉండే ఈ చిన్న పట్టణం ప్రకృతి ప్రసాదించిన సహజ సుందరమైన దృశ్యాలకు కేంద్రం. చుట్టూ నీలి మేఘాలలోకి చొచ్చుకుపోయినట్లు కనిపించే కొండలు,వాటిపై పరచినట్లు కనిపించే పచ్చని చెట్లు, ఒకక పక్క ఎత్తుగా కనిపించే కొండలు, మరో పక్క లోతుగా అగాధాలు అనిపించే లోయలతో ఎటు చూసినా అందాలను విరజిమ్మే ఎల్లా సందర్శన ఒక విచిత్రమైన అనుభూతిని, మధుర స్మృతులను మిగులుస్తుంది. ఎల్లా రాక్ పైకి వెళ్లి, అక్కడి నుంచి నైన్ ఆర్చి బ్రిడ్జిని చూడడం అద్భుతమైన వింత అనుభూతినిస్తుంది. అందులోనూ మొట్ట మొదటి సారిగా ఇలా రాక్ పై భాగం నుంచి బ్రిడ్జి సందర్శన కలిగించే ఆనందాన్ని వర్ణించడం సాధ్యం కాదు. మరో పక్కన దేశంలో అత్యంత ఎత్తైన జలపాతాలలో రెండవదిగా గుర్తింపు పొందిన దియాలుమా చూడముచ్చటగా ఉంటుంది. మధ్య మధ్యలో పచ్చని టీ తోటలు, హరిత వనాలు కనువిందు చేస్తాయి.       

ఎటు చూసినా అందాలే   

సుప్రసిద్ధమైన కాండీ ప్రాంతం నుంచి ఎల్లా వరకు సాగే రైలు ప్రయాణం మరెన్నో అందాలను కళ్ల ముందుకు తీసుకువస్తుంది. ఆ రైలు ప్రయాణంలో కొండలు, లోయలు, టీ తోటలు ఎటు చూసినా అందాలే. ఎల్లా పర్యటనలో కలిగే మానసిక ఆహ్లాదం ఎన్ని ఏండ్లయినా నిత్యం మనసును మైమరిపిస్తూనే ఉంటుంది. ఇక్కడి వాతావరణం ఇతర ప్రాంతాలకు విరుద్ధంగా చల్లగా ఆనందదాయకంగా ఉంటుంది. ఒక పక్కన శ్రీ లంక సాంస్కృతిక ఔన్నత్యం, మరో పక్కన వలసవాద పాలన చిహ్నాలు కలగలిసిపోయి కొత్త ప్రపంచం చూపిస్తుందీ ప్రాంతం. ఇక ఇక్కడి ఆహారం రుచుల తీరే వేరు. మరెక్కడా లభించవు.కాలం ఇక్కడ కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. అయిదేళ్ల నాటి వాతావరణం ఇప్పుడు కనిపించకపోవచ్చు. ఇప్పుడు కాంక్రీటు అరణ్యంలాగే మారింది. జనాభా పెరిగింది. ఆ నాటి పల్లె వాసనలు అంతగా కనిపించకపోవచ్చు. అయినా ఎల్లా అందాలు సాటిలేనివే. అందరితో పాటు సందర్శించే సౌందర్యంతో పాటు చొరవ తీసుకుని మరింత లోతట్టు ప్రాంతాలకు వెళ్లగలిగితే కలిగే ఆనందం అపూర్వంగా ఉంటుంది.   



2021-12-05  Lifestyle Desk