collapse
...
Home / లైఫ్ స్టైల్ / కళలు & సంస్కృతి / వివాహాలపై ఒమిక్రాన్ వేరియెంట్ నీడ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | New...

వివాహాలపై ఒమిక్రాన్ వేరియెంట్ నీడ

2021-12-06  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

MARRIAGES
కొవిడ్-19 వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ ప్రభావం తాజాగా వివాహ వేడుకలపై పడింది. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో తాజాగా వివాహ వేడుకల్లో కొవిడ్ మార్గదర్శకాలు పాటించాల్సి వస్తోంది. కొవిడ్ పరిమితులతో వివాహ వేడుకల్లో అతిథుల సంఖ్య తగ్గించాల్సి వస్తోంది.పెళ్లిళ్ల సీజనులో బ్యాండ్బాజాబారాత్‌లకు ఏటా రూ.3 లక్షల కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. మళ్లీ వ్యాప్తిచెందుతున్న ఒమిక్రాన్ వేరియెంట్ వల్ల విధించిన ఆంక్షల వల్ల మధ్యతరగతి కుటుంబాలకు వివాహ ఖర్చులు తగ్గాయి. కరోనా తగ్గుముఖం పట్టాకకొన్నాళ్లు వివాహ వేడుకలు ఘనంగా సాగినా ఒమిక్రాన్ ప్రభావం వల్ల మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. వివాహ వేడుకల ఖర్చు తగ్గడంతోఆ డబ్బును వధూవరుల దుస్తుల కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. సగటు మధ్యతరగతి వధువు తన పెళ్లికి సవ్యసాచి డిజైన్ డ్రెస్కోచర్ లెహంగా ధరించాలనే కల ఒమిక్రాన్ వేరియెంట్ వల్ల అతిథుల సంఖ్య తగ్గించడంతో సాకారం కానుంది.

వచ్చే ఏడాది వివాహాలపై అనిశ్చితి

ఒమిక్రాన్ వేరియెంట్ వల్ల వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే వివాహ వేడుకలపై అనిశ్చితి ఏర్పడింది. ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి వల్ల వివాహ ప్రణాళికలుబడ్జెట్లపై ప్రజల్లో పునరాలోచన ఏర్పడింది.ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటం వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగే వివాహాలపై సందేహం ఏర్పడిందని చండీగడ్‌కు చెందిన డిజైనర్ శ్రుతి సింగ్లా చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి వల్ల ఇటీవల కాలంలో 200 కంటే ఎక్కువమంది అతిథులతో వివాహాలను జరపలేదని జలందర్ నగరానికి చెందిన సెనోరిటా ఈవెంట్స్‌కు చెందిన రమేష్ లఖన్ పాల్ చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో వివాహ పరిశ్రమ ఇప్పటికే చాలా నష్టపోయిందని అమృత్‌సర్ నగరానికి చెందిన వెడ్డింగ్ ప్లానర్ మెహుల్ అరోరా పేర్కొన్నారు. 

మళ్లీ కష్టాల్లో వివాహరంగ పరిశ్రమ

కొవిడ్ టీకాల పూర్తితో వైరస్ తగ్గుముఖం పట్టాక నిబంధనల సడలింపులతో వివాహ ప్యాలెస్‌లుహోటళ్లు వివాహాల కోసం పూర్తిస్థాయిలో బుక్ అయ్యాయి. అయితే మళ్లీ వివాహ సీజన్ మధ్యలో ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియెంట్ వ్యాప్తి చెందుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వివాహ పరిశ్రమ ఊపందుకున్న పరిస్థితుల్లో వివాహాలకు అతిథుల సంఖ్య 500 నుంచి 700 మంది దాకా అతిథులకు పెరిగింది. ఒమిక్రాన్ వేరియెంట్ వల్ల మళ్లీ సాధారణ జీవితానికి ముప్పు ఏర్పడటంతో వివాహ రంగ పరిశ్రమ మళ్లీ కష్టాల్లో పడింది. గత ఏడాదితో పోలిస్తే నవంబరు నెలలో వివాహాలు దాదాపు 50 శాతం పెరిగాయి. కరోనా సీజన్ తర్వాత ప్రతి ఒక్కరూ ఘనంగా తమ పెళ్లి జరుపుకోవాలని వధూవరులు కోరుకుంటున్నారని ఫెస్టిన్ పలైస్ డైరెక్టర్ శిఖా సరీన్ చెప్పారు. కరోనా వైరస్ వల్ల రెండు సంవత్సరాల విరామం అనంతరం జరుగుతున్న వివాహాల్లో కొత్త ట్రెండ్ కు దారితీసింది. రంగురంగుల బాంబులు పేల్చడంమాలిక్యులర్ బార్‌లువధూవరులు ఆడంబరంగా ఎంట్రీ ఇవ్వడంవిలాసవంతమైన వంటకాలుటాప్ డెకరేషన్లైవ్ బ్యాండ్‌లతో వివాహాలు కోలాహలంగా సాగాయి.

వివాహాల బడ్జెట్ పెరిగింది...

నగరాల్లో విలాసవంతమైన వివాహాల కోసం సగటు బడ్జెట్ రూ.5 కోట్లు అంతకంటే అధికంగా కూడా వెచ్చిస్తున్నారు.గతంలో కంటే వివాహాలకు అధిక బడ్జెట్ వెచ్చిస్తున్నారు. ప్రయాణ పరిమితులుకొవిడ్ ఆంక్షల వల్ల డెస్టినేషన్ వెడ్డింగ్‌లను నిర్వహించలేని వారు ఆడంబరంగా ఖర్చుకు వెనుకాడకుండా వివాహాలు చేస్తున్నారు. దీంతో నగరాల్లోని పలు వెడ్డింగ్ హాళ్లు వివాహాల సీజన్ కోసం పూర్తిగా బుక్ అయ్యాయి. కరోనా వైరస్ వల్ల అతిథుల సంఖ్య తగ్గించినా ఇతర అంశాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అతిథుల సంఖ్యపై ఉన్న పరిమితి కారణంగా పెళ్లి కూతుళ్లునిశ్చితార్థంమెహందీహల్దీకాక్‌టెయిల్‌లు వంటి కార్యక్రమాలు పెరిగాయని బిగ్ ఫ్యాట్ పంజాబీ వెడ్డింగ్స్ కంపెనీ అధిపతి విమ్మీ సోయిన్ చెప్పారు.అతిథుల పరిమితి వల్ల ప్రతి ఫంక్షనుకు వేర్వేరు ఆహ్వానితుల జాబితాను రూపొందిస్తున్నారు. కరోనాతో అంతర్జాతీయ ప్రయాణాలపై అనిశ్చితి కొనసాగుతుండటంతో స్థానికంగా జరిగే డెస్టినేషన్ వెడ్డింగులు జరుగుతున్నాయి. ప్రజలు అధికంగా ఇష్టపడే ముస్సోరి, గోవారాజస్థాన్ లలో వివాహాలు జరుగుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం డెకరేషన్ కనీస బడ్జెట్ రూ.5 లక్షలతో ప్రారంభం అవుతుంది. దీంతోపాటు   మొత్తం వివాహ ఖర్చు కోట్ల రూపాయల్లోనే ఉంటుంది.డెస్టినేషన్ వెడ్డింగులలో అతిథుల సంఖ్య 1500 నుంచి 100కు తగ్గిస్తున్నారు. ఈ సీజన్ లో నిర్వహిస్తున్న వివాహాల్లో 70 శాతం డెస్టినేషన్ వెడ్డింగులేననిపరిమిత అతిథులతో వివాహ వేడుకను మరచిపోలేని అనుభవంగా మార్చడానికి ఎక్కువ బడ్జెట్ వెచ్చిస్తున్నారు. వివాహ వేడుకల్లో సెలబ్రిటీలతో ఎంటర్ టైనర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

 పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లు

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లాక్‌డౌన్ సమయంలో పెళ్లి చేసుకుని ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు దూరమైన వారు ఇప్పుడు పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లు చేసుకుంటున్నారు.వివాహ ఆహ్వానం లేదా వధువు/వరుడి ప్రవేశం వంటి వివరాలపై దృష్టి సారిస్తున్నారు. భారతదేశం అంతటా ప్రత్యేకమైన వంటకాలను వివాహాల్లో వడ్డిస్తున్నారు. ఢిల్లీలోని దర్యాగంజ్ నుంచి గులాబ్ జామూన్‌లుజమ్మూ నుంచి కుల్చా చనాచండీగఢ్ బేకరీ నుంచి తిరామిసుముంబై నుంచి ఐస్‌క్రీం మొదలైనవాటిని ప్రజలు కోరుకుంటున్నారు. లెబనీస్ షావర్మాజపనీస్ తెప్పన్యాకీసుషీలైవ్ థాయ్ స్టేషన్‌ల వంటి ఫ్యాన్సీయర్ వంటకాలు ఇప్పుడు వివాహ విందుల్లో చాలా సాధారణం అయ్యాయి. వివాహ ఆహ్వానంలో కూడా వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. బడ్జెట్‌ను బట్టి మనసుకు హత్తుకునే రేంజ్ అందుబాటులో ఉంటుంది. మిఠాయిలతో కూడిన బాక్సును ఇచ్చి పెళ్లికి పిలవటం ఆరంభమైంది. దీంతోపాటు ఎంబ్రాయిడరీ బ్యాగ్‌లువెల్వెట్స్వెడ్శాటిన్ ఫ్యాబ్రిక్‌లతో కప్పిన చెక్క పెట్టెలుచాక్లెట్‌లుకేకులుబంగారం లేదా వెండి నాణేలతో వివాహ ఆహ్వానపత్రికలు అందించడం నేడు మొదలైంది.2021-12-06  Lifestyle Desk