collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఇంటీరియర్ / హోం డెకరేషన్ చేయాలనుకుంటున్నారా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News...

హోం డెకరేషన్ చేయాలనుకుంటున్నారా?

2021-12-06  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

interior-designers
 

పెళ్లి చేసి చూడు ఇళ్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. నిజమే మరి ఒక పెళ్లి చేయాలన్నా...ఇళ్లు కట్టాలన్నా...సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇంటి విషయానికి వస్తే మన ఇష్టానికి అనుగుణంగా...బడ్జెట్‌కు తగ్గట్లుగా ఇంటిని నిర్మించుకోవడం అంత తేలికైన పని కాదు. అందులోనూ పాత ఇంటికి సరికొత్తగా తీర్చిదిద్దాలనుకుంటే చాలా సమయాన్నిశక్తిని  వెచ్చించాల్సి ఉంటుంది. ఆ రిస్క్ మీకు తగ్గించి  మీ ఇంటిని అద్భుతంగా  తిరిగి నిర్మించుకునేందుకు కొన్ని సులభమైన గృహాలంకరణ ఆలోచనలను ఇప్పుడు చూద్దాం.
1. మీ ఇంట్లో రీడింగ్ రూమ్‌ లేదాఅయినా నో ప్రాబ్లమ్. మీ లాంజ్ గదినే అదేనండి లివింగ్ రూమ్‌నే రెండు విధాలుగా డిజైన్ చేసుకోవచ్చు...హాయిగా కూర్చుని చదువుకునే రీడింగ్ రూమ్‌గాను రిలాక్స్ అయ్యే లివింగ్ రూమ్‌గాను అప్‌డేట్ చేసుకోవచ్చు.  దీని కోసం హెడీ కైలియర్ డిజైన్స్ బెస్ట్ ఆప్షన్‌.ఎంతో వ్యూహాత్మకంగా అధునాతనమైన మరియు ఇంటిలో ఉండే బట్టలు ఆకృతులతో కూడిన ఫర్నిచర్‌ ఇది. వినోదంతో పాటు  విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైనది.
2. ఇక ఇంట్లోని బెడ్‌రూమ్‌ని సాఫ్ట్ బ్లాక్ కలర్ తో కూల్ గా పెయింట్ వేయించండి. అందులో ఎలక్ట్రిక్ ఫర్నీచర్నీచర్‌ను ఏర్పాటు చేసుకోవాలి..ఇలా పడకగదిని తేలికైన రంగుతో అట్రాక్టివ్ ఫర్నీచర్ తో డిజైన్ చేసుకుంటే  ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రత్యేకమైన షేడ్‌ను ఫారో&బాల్ రెయిలింగ్స్ అని అంటారు.
3. ఇంకా అదనపు సిట్టింగ్ ఏరియా ఉంటే...ఆ గదిలో ఓ గ్యాలరీని ఏర్పాటు చేసి అందులో వివిధ ఆకృతుల్లో ఉన్న డిజైనర్ కుండలను మరియు ఆర్ట్‌ వర్క్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఇది మనలోని మానసిక అశాంతి దూరం చేస్తుంది.
4అలసిపోయిన శరీరం కాస్త విశ్రాంత సమయాన్ని గడిపేది బెడ్ రూమ్‌లోనే...ఈ పడకగదిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజైన్స్‌తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా కలరింగ్ విషయానికి వస్తే...బెడ్‌రూమ్‌ను లైట్ పింక్ కలర్ తో  కలరింగ్ చేసుకోవాలి. అదే విధంగా స్వచ్ఛమైన గాలి రూమ్‌లోకి వచ్చే విధంగా ఓ చిన్న కిటికీ ఉండే విధంగా చూసుకుంటే చక్కటి అనుభూతిని పొందడంతో పాటు కళలను కనవచ్చు. ఇందుకోసం రోమన్ షేడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
5.  బాత్‌ రూమ్‌లోనూ స్లైట్ స్టూల్‌ను ఏర్పాటుచ చేసుకోవడం వల్ల స్థలాభావం తగ్గడంతో పాటు కాస్త లక్జరీ ఫీల్ కలుగుతుంది. ఇందుకసం అన్నీ ష్లెక్టర్ ఫర్నీచర్ బెస్ట్ ఆప్షన్
6. మీ పడకగదిని ఓ రాజభవనం లాగారాజసం ఉట్టి పడే విధంగా రీ మోడల్ చేయాలనుకుంటే కానోపీ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచం చుట్టూ పొడవాట తెల్లటి పరదాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల పడకగదికి సుందర రూపాన్నీ తీసుకురావచ్చు.
7. ఇక బాత్‌రూమ్‌ కూడా లేటెస్ట్ ట్రెండ్స్‌ తో కొత్త లుక్ తీసుకురావచ్చు. గోడలకు తెల్లటి పెయింట్‌తో తాజా కోటు ఇవ్వడం ద్వారా బాత్రూమ్‌  ఫ్రెష్  లుక్ లో ఆకర్షనీయంగా కనిపిస్తుంది. ఇక గోడలకు చిన్ని చిన్న కాస్త ఫన్ కోటెడ్ ఫ్రేమ్‌లను...ఆర్ట్ గ్యాలరీలను ఉర్పాటు చేసుకోవచ్చు. అలెగ్జాండర్ ఎం.రీడ్ డిజైన్ చేసిన ఈ బాత్‌రూమ్ అమేజింగ్‌గా ఉంది కదూ.
8. చక్కటి పూలతో గదిని అలంకరించడం వల్ల గది మొత్తం అందంగా సువాసబరితంగా ఉంటుంది. లివింగ్ రూమ్‌ డిజైనర్ ఫ్లవర్ వాజ్ పెట్టి అందులో ప్రతీ రోజు పూలను మారుస్తూ ఉంటే..ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
9ఇక ఎప్పటిలాగే కాఫీ టేబుల్‌ను ఉంచకుండా..కొత్తగా దాన్ని ఆర్గనైజ్ చేసేందుకు చూడాలి. ఒకవేళ మీ ఇంట్లో గ్లాస్ మార్బుల్ టాప్ కాఫీ టేబుల్ ఉన్నట్లైతే..దానిని స్టాండ్ నుంచి తీసి కిందే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రూమ్‌కు కొత్త లుక్ వస్తుంది.
10డైనింగ్ రూమ్‌లోనూ కుర్చీలు ఒకే విధంగా ఒకే రంగుతో ఫార్మల్ గా ఉండకుండా వివిధ రంగులతో...కాజువల్ గా ఉండే విధంగా చూసుకోవాలి. మెటల్ లో బ్లూ, గ్రీన్ రంగులతో ఉండే కుర్చీలు కొత్త ఫీల్‌ను తీసుకువస్తాయి.

 

 



2021-12-06  Lifestyle Desk