6tvnews

collapse
...
Home / లైఫ్ స్టైల్ / కళలు & సంస్కృతి / Bengali culture: సరదాలకు వేదికగా పెళ్లి

Bengali culture: సరదాలకు వేదికగా పెళ్లి

2022-01-12  Lifestyle Desk

bengali marriage
శీతాకాలం వచ్చేసింది. గాలి కరిచేస్తోంది. దీనికి అర్థం ఏమిటో మనందరికీ తెలుసు. ఇది పెళ్లిళ్ల ఆహ్వానాలు మొదలవ డానికి సమయం వచ్చేసిందని అర్థం.  ఈ పెళ్ళిళ్లు ఇద్దరు వ్యక్తులను కలపడం, రెండు కుటుంబాలను ఒకటి చేయడం మాత్రమే కాదు…మరెన్నో సరదాలకు వేదికలుగా కూడా ఉంటాయి. బెంగాలీ వివాహాలు ఎన్నో రకాల సరదాలకు వేదికలుగా ఉంటాయి.   

ఈ ప్రత్యేక ట్రెడిషన్‌ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. వధువు కొయ్య కుర్చీపై (బెంగాలీలో దీన్ని పీరి అంటారు) కూర్చుని ఉంటుంది. తన వదనాన్ని ఆమె రెండు తమలపాకులతో కప్పుకుని ఉంటుంది. ఈ కుర్చీని ఆమె సోదరులు లేదా బాబాయిలు ఎత్తుకుని వరుడు ఆమె కోసం వేచి చూస్తూ ఉండే ప్రత్యేక మండపం చద్నా టోలా వద్దకు తీసుకెళతారు.       

వధువు తన ముఖం మీదినుంచి తమలపాకులను తొలగించే ముందు, ఆమె సోదరులు ఆమెను వరుడి చుట్టూ ఏడుసార్లు తీసుకెళతారు. ఎన్నిసార్లు అనేది ఆమె కుటుంబం, మరియు స్నేహితులు లెక్కిస్తారు (కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా తప్పు లెక్క చెబుతారు. దాంతో వారు ఆమెను మోసుకుంటూ పోవలసి ఉంటుంది.) చివరకు వరుడి ముందు నిలిచేవరకు ఇలా మోసుకెళ్తూ ఉంటారు. ఆ తర్వాత వధువు శుభో దృష్టి అనే సంప్రదాయాన్ని అనుసరించి తమలపాకులను తన ముఖం నుంచి తీసివేస్తుంది.      

ఎవరు ఎత్తుగా ఉంటారో తెలుకోవడం      

చద్నా టోలా అనేది మరొక సరదా సంప్రదాయానికి వేదిక. చూస్తున్నవారంతా పెద్దగా నవ్వడానికి ఇది ఉపకరిస్తుంది. శుభో దృష్టి తర్వాత దండలు మార్చుకునే ముందు, వధూవరులు తమ సొంత పీటలపై కూర్చుంటారు వీరిని బాబాయిలు, స్నేహితులు చాలా పైకి ఎత్తుతారు. వధూవరుల్లో ఎవరు పొడుగో తేల్చుకోవడమే దీని ఉద్దేశం.      

బోరో బోరో నా బౌ బోరో (ఎవరు ఎత్తుగా ఉన్నారు, వరుడా, వధువా) అంటూ అరిచే అరుపుల మధ్య కుటుంబంలోని ఇరు పక్షాల నుంచి ప్రోత్సహిస్తున్న శబ్దాలతో గది దద్దరిల్లుతుంది. వధూవరులు తమకు ఏది కనిపిస్తే దాన్ని (గదిలో ఉన్నవారి జుత్తు, దుస్తులు వగైరా) పట్టుకుని తామే ఎత్తుగా కనబడటానికి ప్రయత్నిస్తారు. తర్వాత పెళ్లి ఫోటోలను చూడడానికి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చున్నప్పుడు, ఈ ప్రత్యేక సంప్రదాయం నుంచి రహస్యంగా తీసే స్నాప్ షాట్‌లు అందరినీ పెద్దగా నవ్వులతో ముంచెత్తుతాయి.       

తప్పిపోయిన  చెప్పులతో సరదా      

ఇది బెంగాలీ పెళ్లిళ్లకు ప్రత్యేకం కాదు. కానీ ఈ సంప్రదాయం ఇప్పటికీ ముఖ్యమైనదే. ఇతర సంప్రదాయాల్లాగా కాకుండా, ఇది వధూవరులను నేరుగా ఇన్ వాల్వ్ చేయదు, వరుడు తన చెప్పులను వదిలిపెట్టి పెళ్లిమండపం వద్దకు పెళ్లినప్పుడు వధువు పక్షం నుంచి కజిన్లు (సాధారణంగా మహిళలే) వారి చెప్పులను దొంగిలించి దాచిపెడతారు. కాబట్టి పెళ్లి సంబరం ముగియగానే వరుడు మండపం వదలి పెట్టి వెళ్లలేడు.      

బాలీవుడ్ సినిమాలు మీకు పరిచయమే అయితే ఇది మీకు తెలిసిన విషయమే. అవును. మీరు రాంగ్ కాదు. 1994లో వచ్చిన సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ సినిమా హమ్ అప్ కే హై కౌన్ లో ఇదే దృశ్యం ఉంది. హిందీలో దీన్ని జూటా చుపాయ్అని, బెంగాలీలో జుటో చురి అని దీన్ని పిలుస్తారు. పెళ్లి వేడుక ముగియగానే వధువు బంధువులు చెప్పులను దాచేస్తారు. బాగా డబ్బు చేతిలో పెడితే ఆ చెప్పులను సొంతదారుకు తిరిగి ఇచ్చేస్తారు.      

రాత్రి ఎక్కడ గడుపుతారు      

పెళ్లి రాత్రిని బషోర్ రాత్ అంటారు. ఇక్కడ వధూవరులు తమ సోదరీసోదరులు, బాబాయి పిన్నిలు, స్నేహితులతో కలిసి రాత్రంతా గేమ్స్ ఆడుతూ, చాటింగ్ చేస్తూ గడుపుతారు. ఇరుపక్షాల్లోని యువతీయువకులు ఒకరినొకరు తెలుసుకునేందుకు ఇది చక్కటి అవకాశం మరి. బషోర్ రాత్ సాధారణంగా అంత్యాక్షరి, డంబ్ చరదేశ్ వంటి టీమ్ గేమ్స్‌లో పెళ్లివారిని పరస్పరం సన్నిహితులను చేస్తాయి.       

ఉంగరం కోసం వెదుకులాట      

జూటా చుపాయి మాదిరి, ఇది కూడా బెంగాలి పెళ్లిళ్లకు ప్రత్యేకించినది కాదు. ఇతర సంస్కృతులలోనూ దీన్ని పాటిస్తారు. భర్త కుటుంబం బంగారు రింగును పెద్ద పాత్రలో దాచి ఉంచుతుంది. ఈ పాత్రలో పాలు, పూల రెమ్మలు,నాణేలు, నీరు కలిపి కుంకుమను జత చేస్తారు. దీంతో నీళ్లు ఎర్రగా మారతాయి. భార్య, భర్త ఇద్దరూ పాత్రలోని రింగుకోసం వెతుకుతారు. ఎవరికైతే రింగు దొరుకుతుందో వారు దాన్ని ఉంచుకోవచ్చు.      

కాబట్టి ఈ పెళ్లిళ్ల సీజన్‌లో మీ దుస్తులు, బపేలో మీ డిన్నర్ కి ప్లాన్ చేస్తున్నప్పుడు, (చేపల ఫ్రై, మాంగషో పులావ్ రుచిచూడటం మర్చిపోవద్దు.) ఈ బియే బారి సంప్రదాయాలలో ఉన్న సరదా కార్యక్రమాల్లో తప్పక పాలుపంచుకోండి.      

 


2022-01-12  Lifestyle Desk