collapse
...
Home / ఆరోగ్యం / డైట్ & న్యూట్రిషన్ / అవకాడో...ఆరోగ్యానికి మేలు....! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News T...

అవకాడో...ఆరోగ్యానికి మేలు....!

2021-12-13  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Avacado
 

అవకాడో...హెల్తీ ఫ్రూట్ ఇది. నిత్యం అవకాడో ఆహారంలో తీసుకుంటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవ కాడోలో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. అంతేకాదు అనేక వ్యాధులను నయం చేసే సామర్ధ్యంలో ఫ్రూట్ లో ఉన్నాయి.        

అవకాడోలో విటమిన్ ఎ,బిఈ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో అధిక మొత్తంలో  ప్రొటీన్లు,ఫైబర్కొవ్వుఆమ్లాలు,ఖనిజాలు కూడా ఉన్నాయి. శరీరంలోని కొన్ని వ్యాధులను నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాదు ఎక్కువ క్యాలరీలను కలిగి ఉండటంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అవకాడోను ప్రతిరోజూ తీసుకున్నట్లు మంచి బెనిఫిట్స్ ను పొంద వచ్చు. ఈ ఫ్రూట్ ను ఎక్కువగా మిల్క్ షేక్ఐసీ క్రీంలలో ఉపయోగిస్తారు.        

గుండె సమస్యలను తగ్గించడంలోఅవకాడో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అవకాడోలో బి6, ఫోలిక్ యాసిడ్ సమృద్దిగా ఉన్నాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇందులో అధి కంగా మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండటంతో గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.                 

బరువును పెంచడంలో సాయపడుతుంది...ఇందులో ఆరోగ్యకరమై కొవ్వు పదార్థాలతోపాటు పిండి పదార్థాలు అధికంగా ఉన్నా యి. ఇవి బరువు పెరగాలనుకునే వారికి ఎంతగానో సాయపడతాయి. 100 గ్రాముల అవకాడో సుమారు 60 నుంచి 80   కేలరీ లను కలిగి ఉంటుంది. ఈ పోషకాలు శరీర బరువును  ఆరోగ్యకరమైన పద్దతిలో పెంచేందుకు సహాయపడతాయి.                 

చర్మసౌందర్యాన్ని పెంచడంలో...పొడిబారిన చర్మానికి తేమను అందించడంలో అవకాడో పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. చర్మం ప్రకాశ వంతంగా,కాంతివంతం మారేలా చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపించి చర్మాన్ని తాజాగా ఉంచు తుంది. చర్మ సమస్యలను దగ్గరికి రానివ్వదు. ఇక చర్మ సౌందర్యం కోసం అవకాడో నూనెను ఉపయోగించడం ఎంతో మంచిది.   

 నొప్పులను తగ్గిస్తుంది....అవకాడోలో యాంటీ ఆక్సిడైట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.కొవ్వు,విటమిన్లు,ఇనుము,పొటాషి యం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో నొప్పులను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పికారణంగా వచ్చే జాయింట్ పెయిన్స్ ను తగ్గిం చడానికి సహాయపడుతాయి. అవకాడో నూనెను నొప్పి ఉన్న ప్రాంతంలోమర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీటన్నింటితో పాటుగా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఎముకలు బలంగా ఉండటానికి చక్కగా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్ గర్భిణులు తీసుకున్నట్లయితే వారికి తగిన పోషకాలు అందుతాయి. అరటిలో పొటాషియం అధిక మొత్తంలో ఎలాఉంటుందో... అవకాడో లోనూ పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.        

అవకాడో ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఫ్రూట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ మాత్రం ఎంతో మేలు చేస్తాయి.                 



2021-12-13  Health Desk