6tvnews

collapse
...
Home / లైఫ్ స్టైల్ / కళలు & సంస్కృతి / Smart Phone: ఎవరికి వారు...యమునా తీరు

Smart Phone: ఎవరికి వారు...యమునా తీరు

2022-01-09  Lifestyle Desk

girls with smartphone (2) (1)
 

వినూత్న అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన వివో మానవ సంబంధాలపై స్మార్ట్ ఫోన్ల ప్రభావం  2021’  పేరుతో జరిగిన అధ్యయనం మూడో ఎడిషన్ ను విడుదల చేసింది. పిల్లలు తల్లిదండ్రులు పరిమితికి మించి స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం కారణంగా ప్రవర్తన పై కలిగే ప్రభావాలపై ఇది దృష్టి పెట్టింది. సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) తో కలసి నిర్వహించిన ఈ అధ్యయనం స్మార్ట్ ఫోన్ల వినియోగ ధోరణులపై కొత్త వెలుగులు ప్రసరింపజేసింది. 

స్మార్ట్ ఫోన్ల కారణంగా పిల్లలతో తమ అనుబంధం దెబ్బ తింటుందేమోనని  74 శాతం మంది   తల్లిదండ్రులు భావిస్తు న్నారు. 

తాము పిల్లలతో ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ల కారణంగా తాము వారిపై అంతగా దృష్టి పెట్టలేకపోతున్నట్లు  69 శాతం మంది తల్లిదండ్రులు చెబుతున్నారు. 

పరిమితికి మించిన రీతిలో స్మార్ట్ ఫోన్ల వినియోగం కారణంగా పిల్లల్లో కోపం వంటి లక్షణాలు పెరుగుతున్నట్లుగా తల్లి దండ్రులు గుర్తించారు.

తాము అభిమానించే వారితో అనుసంధానమై ఉండేందుకు తమ ఉత్పాదకత పెంచేందుకు జీవన నాణ్యత పెంచేందు కు స్మార్ట్ ఫోన్లు తోడ్పడుతున్నాయని అంగీకరిస్తున్నవారు  84% మంది

పిల్లలతో గడుపుతున్నప్పటికీ తాము ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నట్లుగా అంగీకరిస్తున్న భారతీయ తల్లి దండ్రులు  66% మంది

ఆమోదనీయ నైతిక సామాజిక ప్రవర్తనలో తమ పిల్లలు వెనుకబడి ఉన్నారన్నది 90 శాతం మంది తల్లిదండ్రుల భావన

కోవిడ్ -19 ప్రభావం   

స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయయి. కోవిడ్ ప్రభావం దాన్ని మరింత అధికం చేసింది. 

కోవిడ్ ముందు కాలంతో పోలిస్తే తాము రోజుకు సగటున  6.5 గంటల పాటు స్మార్ట్ ఫోన్ పై గడుపుతున్నట్లుగా వినియోగదారులు చెబుతున్నారు. కోవిడ్ ముందు కాలంతో పోలిస్తే ఇది  32 శాతం అధికం.    

నేడు మనం నివసించేది స్మార్ట్ ఫోన్ పైనే అంటే అతిశయోక్తి కాదు. అంతగా మనం దానికి అడిక్ట్ అయిపోయాం. స్మార్ట్ ఫోన్ మన డిజిటల్ హోమ్ గా మారిపోయింది. అన్ని రకాల కమ్యూనికేషన్లకు అదొక్కటే దిక్కయిపోయింది. తాము అభి మానించే వారితో అనుసంధానమై ఉండేందుకు స్మార్ట్ పోన్లు తోడ్పడుతున్నాయని 80 శాతం మంది చెబుతున్నారు. అదే సమయంలో 94 శాతం మంది మాత్రం స్మార్ట్ ఫోన్ అనేది తమ శరీరంలో భాగంగా మారిపోయిందని వాపో తున్నారు. దాని నుంచి విడిపోయి బతుకలేమని అంటున్నారు. మొత్తం మీద చూస్తే స్మార్ట్ ఫోన్ పై ఆధారపడడం అనే ది క్రమంగా అధికమైపోతున్నది. ఏ పని చేస్తున్నా ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నాం. తినేటప్పుడు ఫోన్ చూసే వారు 70 శాతం ఉండగా, లివింగ్ రూంలోనూ వినియోగించే వారు 72 శాతం దాకా ఉన్నారు. కుటుంబంతో గడిపే టప్పుడూ ఫోన్ ఉపయోగించే వారు 75 శాతం మంది. 

పిల్లలతో గడిపేటప్పుడు ఎలాంటి అంతరాయం ఉండకూడదని (మరీ ముఖ్యంగా ఫోన్ నుంచి) భావిస్తున్నట్లగా 95 శాతం మంది తల్లిదండ్రులు చెబుతున్నారు. కాకపోతే వారి ఆశలు నెరవేరే సూచనలు మాత్రం కనిపించడం లేదు. 


2022-01-09  Lifestyle Desk