దేశంలోని అతి పెద్ద రాష్ర్టం ఉత్తరప్రదేశ్.. అలాగే ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్లలో కూడా యూపీ ముందుంది. దేశంలోని ప్రజల్లో కొనుగోలు శక్తిలో 8శాతం వాటా ఆక్రమించింది. దీనికి కారణం ఇక్కడ లభించే సహజ వనరులు, ముడి సరకులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులు దేశంలోని 50శాతం వరకు వినియోగిస్తున్నారు. ఇవన్నీ కలిసి ఉత్తరప్రదేశ్ దేశంలోనే శరవేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ర్టంగా ఎదిగింది.
ఒకప్పుడు యూపీ అంటే పేద రాష్ర్టంగా అందరికి తెలిసిందే. నిరక్షరాస్యత దీనికి తోడైంది. అటు నుంచి రాష్ర్టం క్రమంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. రాష్ర్టం ఆర్థికంగా పటిష్టమవుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాల నుంచి యూపీ సులభతర వాణిజ్యానికి (ఈజ్ ఆఫ్ డూయింగ్)కు పెద్దపీట వేయడంతో రాష్ర్టానికి పెట్టుబడులు వరదలా వచ్చి పడ్డాయి.
ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా ఆర్థికంగా బాగా నష్టపోయింది. వ్యాపారాలు కుంటుపడి ప్రభుత్వాలకు రావాల్సిన పన్నులు బాగా తగ్గిపోయాయి. అదే సమయంలో యూపీలో మాత్రం అనూహ్యంగా ప్రభుత్వానికి పన్ను వసూళ్లు తగ్గలేదు. దీన్ని బట్టి రాష్ర్టంలో వాణిజ్య కార్యకలాపాలపై పెద్ద ప్రభావం చూపలేదని చెప్పవచ్చు.
సులభతర వాణిజ్యం వల్ల యూపీ ఒకప్పుడు 12వ ర్యాంకులో ఉండేది. కేవలం నాలుగేళ్లలో రెండవ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం దేశంలోని అతి పెద్ద కంపెనీలు ఉత్తరప్రదేశ్‌లో తమ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి. దీనికి కారణం ప్రభుత్వం నుంచి సానుకూలమైన సహాయ సహకారాలు అందడంతో పాటు వ్యాపారాలు చేసుకోవడానికి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారడమేనని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు స్యాంసంగ్ చైనాలోని తన డిస్ప్లే ప్టాంట్‌ను నోయిడాకు మార్చుకుంది. ఫుట్‌వేర్ దిగ్గజం వోన్ వెల్‌ఎక్స్ కూడా చైనా లోని తన ప్లాంట్‌ను ఆగ్రాకు తరలించుకుంది. అదానీలు కూడా తమ లాజిస్టిక్ పార్కును పంజాబ్‌లో మూసేసింది. ప్రస్తుతం నోయిడాలో డేటా సెంటర్ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.
2018లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ యూపీ నిర్వహించింది. మొత్తం 1,045పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా వాటి విలువ రూ.4.28లక్షలుగా తేలింది. ప్రస్తుతం ఈ పెట్టుబడులు క్రమంగా రాష్ర్టానికి వస్తున్నాయి. రూ.1.84లక్షల కోట్ల ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 2020నుంచి టాటా-- ఎయిర్‌బస్‌లు కలిసి ఇక్కడ రూ.22,000కోట్లు పెట్టుబడులు పెట్టి సీ-295ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయార చేయబోతున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ది క్రమంగా పుంజుకుంటుంది. ప్రధానమత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింది 2.54కోట్ల మంది రైతులకు రూ.37,388కోట్లు నగదు బదిలీ చేసింది. దీంతో పాటు రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని పెంచింది. దీంతో పాటు రాష్ర్టప్రభుత్వం కూడా రైతుల వ్యవసాయ రుణాలను రూ.4.72కోట్ల వరకు చెల్లించింది. వన్ డిస్ర్టిక్.. వన్ ప్రొడక్టును అనే కొత్త పథకాన్ని 2018లో ప్రారంభించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులకు ఉపాధి లభించే విధంగా ప్రణాళికలు సిద్దం చసింది. ప్రస్తుతం వన్డిస్ర్టిక్, వన్ ప్రొడక్టు పథకం కింది లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఎంఎస్ఎంఈ విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఎనిమిది నెలల కాలంలో రాష్ర్టంలో 8.67లక్షల కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. ఈ యూనిట్లకు బ్యాంకులు రూ.30,840కోట్ల రుణాలు మంజూరు చేశాయి. సుమారు 1.5కోట్ల మందికి ఉపాధి లభించింది. గత మూడేళ్ల నుంచి బ్యాంకులు ఈ యూనిట్లకు రూ.2,12,000 కోట్ల రుణాలు మంజూరు చేశాయని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ప్రొడక్టుల్లో 38 శాతం ఎగుమతి అవుతున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా .. పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.
రాష్ర్టప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల పుణ్యమా అని ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఆర్థికంగా పరుగులు పెడుతోంది.